- Home
- Entertainment
- Karthika Deepam: చంద్రమ్మ, ఇంద్రుడుపై శోభ దొంగతనం కేసు.. అసహ్యంగా ఫీల్ అయిన నిరుపమ్!
Karthika Deepam: చంద్రమ్మ, ఇంద్రుడుపై శోభ దొంగతనం కేసు.. అసహ్యంగా ఫీల్ అయిన నిరుపమ్!
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ రోజు జూన్ 6 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఇక ఎపిసోడ్ ప్రారంభంలోనే శోభ (Sobha) పార్టీకి వచ్చిన వారిని రిసీవ్ చేసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో అక్కడకు నిరూపమ్ (Nirupam), హిమలు కూడా వస్తారు. ఇక శోభ జ్వాల రాలేదా అంటూ హడావిడి చేస్తూ ఉంటుంది. ఇక హిమ జ్వాల గురించి అడుగుతున్నందుకు ఏదైనా కుట్ర చేయ బోతుందేమో అని ఆలోచిస్తుంది.
తర్వాత శోభ (Sobha) స్వప్న గురించి పార్టీలో ఎంతో గౌరవంగా చెబుతుంది. ఇక అదే పార్టీలో ఇంద్రుడు (Indrudu), చంద్రమ్మ లు డ్రింక్స్ సర్వ్ చేస్తూ ఉంటారు. ఇక జ్వాలను చూసిన స్వప్న .దాన్ని ఎందుకు పిలిచావంటూ శోభ పై చిరాకు పడుతుంది. నేనంటే ఏంటో చూపిస్తా అంటూ శోభ సప్న కు చెబుతుంది.
ఇక పార్టీలో ఒక్కసారిగా కరెంటు వచ్చి పోతుంది.. ఈ క్రమంలో శోభ (Sobha) నా నక్లెస్ పోయిందంటూ పెద్దగా అరుస్తుంది. ఇక నిరూపమ్ (Nirupam) పోలీసులకు ఫోన్ చేస్తాడు. ఇక వచ్చిన పోలీసులు ఇంద్రుడు జేబులో చెక్ చేయగా నెక్లెస్ దొరుకుతుంది. ఇక ఇంద్రుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు.
ఈలోపు సప్న (Swapna) వీళ్లంతా దొంగల బ్యాచ్.. ఒకసారి నా కారు ను కూడా కావాలనే స్పాయిల్ చేసారు అని పోలీసులకు చెబుతుంది. జ్వాల (Jwala) మా వాళ్ళు అలా చేయరు అని ఎంత చెప్పినా వినకుండా.. నిరూపమ్ చాలా అసహ్యంగా ఫీల్ అవుతాడు. ఇక హిమ కావాలని మెయిన్ ఆఫ్ చేసిన వ్యక్తిని సీసీ కెమెరా ద్వారా పసిగడుతుంది.
ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచి లాగి ఒకటి చంప మీద గట్టిగా కొడుతుంది. ఇక ఎవరు ఇదంతా కావాలనే ప్లాన్ చేశారు అనడంతో శోభ (Sobha) టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ వ్యక్తిని నేనే అని మెయిన్ ఆఫ్ చేశాను అని పోలీసుల ముందు నిజం ఒప్పుకుంటాడు. ఇక ఇదంతా ఎవరు చేసారో వాళ్ళు ఇంద్రుడు ఫ్యామిలీకి సారీ చెప్పాలి అని హిమ (Hima) కోరుతుంది.
ఈ క్రమంలో క్రమంలో హిమ (Hima) శోభ దగ్గరికి వెళ్లి చెవిలో.. నేను తలుచుకుంటే నిరూపమ్ (Nirupam) బావ దగ్గర క్షణాల్లో నీ పరువు తీయగలను అని అంటుంది. కాబట్టి వెళ్లి ఇంద్రుడు దంపతులకు సారీ చెప్పు అని అంటుంది. శోభ ఆ వ్యక్తిని చెంపమీద కొట్టి ఇంద్రుడు ఫ్యామిలీ కు క్షమాపణలు చెబుతుంది. ఇక ఈ క్రమంలో జ్వాల ఏ విధంగా రియాక్ట్ అవుతుందో రేపటి భాగం లో చూడాలి.