- Home
- Entertainment
- హోమ్లీ బ్యూటీ స్నేహని ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసి ఉండరేమో.. చేతులు పైకెత్తి విరహంతో స్టన్నింగ్ లుక్..
హోమ్లీ బ్యూటీ స్నేహని ఇంత హాట్‌గా ఎప్పుడూ చూసి ఉండరేమో.. చేతులు పైకెత్తి విరహంతో స్టన్నింగ్ లుక్..
హోమ్లీ బ్యూటీగా తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైంది స్నేహ. ఆమె గ్లామర్‌కి దూరంగా ఉంటూ ఇంటిల్లిపాదిని ఆకట్టుకుంటుంది. కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం తనలోని కొత్త యాంగిల్స్ చూపిస్తుంది. షాకింగ్ పోజులతో ఆశ్చర్యపరుస్తుంది.

స్నేహ(Sneha) ఇటీవల కాలంలో అడపాదడపా ఫోటో షూట్లతో మెరుస్తుంది. శారీలో, ట్రెండీ వేర్‌లో పోజులిస్తూ ఆకట్టుకుంటుంది. చూడ్డానికి నిండుగా దుస్తులు ధరించినా, తనలోని హాట్ యాంగిల్‌ని బయటపెడుతుందీ హోమ్లీ బ్యూటీ. హాట్‌గా పోజులిస్తుంది. టెంప్ట్ చేసేలా ఆమె లుక్స్ ఉండటం విశేషం. ఇప్పుడు ఎల్లో శారీలోనూ అలానే మెరిసిందీ అందాల భామ.
తాజాగా స్నేహ(Sneha Glamour Photos) పసుపు పచ్చ కలర్ చీరలో మెరిసింది. నిండుతనం తెచ్చే చీరలో ఆమె హోయలు పోయింది. చిలిపిగా, కొంటెగా, వయ్యారంగా పోజులిచ్చింది. విరహాన్ని కూడా జోడించి ఆమె కెమెరా ముందు పోజులివ్వడం విశేషం. ఆయా ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుందీ బొద్దుగుమ్మ. దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి.
స్నేహ.. ఒకప్పుడు హోమ్లీ అందాలతో మెరిసింది. కానీ చూడబోతుంటే ఇప్పుడు మారుతున్న ట్రెండ్ కి తగ్గట్టుగా తాను కూడా మారుతుందనే సిగ్నల్స్ ఇస్తుంది. కొన్ని సార్లు పొట్టి దుస్తుల్లో, పొదుపైన దుస్తులో మెరుస్తూ ఆకట్టుకుంటుంది. గ్లామరస్‌గా కనిపిస్తూ ఫ్యాన్స్ కి విజువల్ ట్రీట్ ఇస్తుంటుంది.
కానీ ఇప్పుడు శారీ కట్టినా యమ హాట్‌గా ఉంది స్నేహ. తనలోని హాట్ యాంగిల్‌ని బయటపెట్టింది. దీనికితోడు టెంప్టింగ్ పోజులిచ్చింది. వివిధ భంగిమల్లో ఫోటోలు దిగింది. కిల్లర్ లుక్‌లో కుర్రాళ్లని హంట్ చేస్తుంది. మత్తుగా చూస్తూ నిషా ఎక్కిస్తుంది. మొత్తంగా ఇంటర్నెట్‌లో స్నేహ రచ్చ మామూలుగా లేదు.
స్నేహ తెలుగులో చాలా సినిమాలు చేసింది. స్టార్ హీరోయిన్‌గా నటించింది. అనుష్క, నయనతార, శ్రియా, త్రిష వంటి భామలకు ఆల్టర్ నేట్‌గా రాణించింది. తెలుగులో తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకుంది. పద్ధతైన పాత్రలు చేసి ఇంటిల్లిపాదికి దగ్గరయ్యింది. హోమ్లీ బ్యూటీగా మారిపోయింది.
స్నేహ తెలుగులో గోపీచంద్‌తో `తొలివలపు` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయమైంది. అంతకు ముందు `ప్రియమైన నీకు` చిత్రంలో కీలక పాత్రలో మెరిసింది. కానీ హీరోయిన్‌గా `తొలివలపు` మొదటి సినిమాగా చెప్పొచ్చు. ఇందులో ఆమె భిన్నమైన పాత్ర పోషించింది. ఓ పెద్ద సాహసం చేసింది. `హనుమాన్ జంక్షన్`తో మెప్పించింది. హిట్ అందుకుంది. ఆ తర్వాత `వెంకీ`తో పెద్ద విజయాన్ని అందుకుని అందరి దృష్టిలో పడింది. దీంతో వరుసగా అవకాశాలు క్యూ కట్టాయి.
`సంక్రాంతి`, `రాధాగోపలం`, `ధట్ ఈజ్ పండు`, `శ్రీరామదాసు`, `ఎవండోయ్ శ్రీవారు`, `మనసు పలికే మౌన రాగం`, `మహారథి`, `మధుమాసం`, `నీ సుఖమే నే కోరుకున్నా`, `పాండురంగడు`, `ఆది విష్ణు`, `అమరావతి`, `రాజన్న`, `ఉలవచారు బిర్యానీ` వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళంలోనూ నటించి మెప్పించింది.
పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. నటుడు ప్రసన్నని స్నేహ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి కొడుకు, కుమార్తె ఉన్నారు. పెళ్లి తర్వాత అడపాదడపా బలమైన పాత్రలు ఉండే చిత్రాల్లోనే మెరుస్తుంది స్నేహ. మరోవైపు టీవీ షోస్‌తో బిజీగా ఉంటుంది.