- Home
- Entertainment
- ట్రెడిషనల్ లుక్‌లో మతిపోగొడుతున్న స్నేహ అందం.. యంగ్ హీరోయిన్లకే అసూయ పుట్టిస్తున్న సీనియర్ భామ
ట్రెడిషనల్ లుక్‌లో మతిపోగొడుతున్న స్నేహ అందం.. యంగ్ హీరోయిన్లకే అసూయ పుట్టిస్తున్న సీనియర్ భామ
సీనియర్ హీరోయిన్ స్నేహ ఫోటో షూట్లతో అభిమానులను ఆకట్టుకుంటుంది. హోమ్లీ బ్యూటీగా పేరుతెచ్చుకున్న ఈ అందాల భామ అప్పుడప్పుడు కాస్త హాట్‌గానూ కనిపిస్తూ షాకిస్తుంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

స్నేహ ఇటీవల వరుసగా తన ఫోటో షూట్లతో ఆకట్టుకుంటుంది. అందరిని అలరింప చేస్తుంది. తన క్యూట్,హాట్ మిక్స్ చేసిన అందాలను వడ్డిస్తూ మెస్మరైజ్ చేస్తుంది. తాజాగా ట్రెడిషనల్ లుక్‌లో మతిపోగొడుతుంది స్నేహ. క్యూట్‌నెస్ ఓవర్‌లోడ్ అనేట్టుగా మారిపోయింది. పింక్ డ్రెస్‌లో చైర్‌లో కూర్చొని ఆమె ఇచ్చిన పోజులు కట్టిపడేస్తున్నాయి.
చూడ్డానికి సాంప్రదాయబద్దంగా ఉన్నా ఆమెలోని అందం మాత్రం మరింత పెరిగిందని చెప్పొచ్చు. చూపుతిప్పుకోనివ్వడం లేదు అనేట్టుగా ఆమె పోజులుండటం విశేషం. దీంతో ఈ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే ఇందులో తనకు ఫ్లవర్‌ఫుల్‌లాంటి ఫీలింగ్ ఉందని చెప్పడం విశేషం. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
అచ్చమైన తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలుస్తుంటుంది స్నేహ. హద్దులు మీరని అందాల ప్రదర్శనతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరైంది. హోమ్లీ బ్యూటీ అనే ట్యాగ్ తగిలించుకుంది. చేసింది కొద్ది సినిమాలే అయినా గుర్తుండిపోయే పాత్రలు, నిలిచిపోయే సినిమాలు చేయడం విశేషం. అందుకే స్నేహ అంటే అందరిలోనూ ఓ పాజిటివ్ ఫీలింగ్ కలుగుతుంది.
కెరీర్ బాగా సాగుతున్న సమయంలోనే మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయ్యింది. ఆమె తమిళ నటుడు ప్రసన్న కుమార్‌ని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. చాలా వరకు స్నేహ ఫ్యామిలీకే ప్రయారిటీ ఇస్తుంటుంది. ఎప్పుడూ వారితోనే గడుపుతుంటుంది.
అయితే ఇటీవల ఆమె సినిమాలపై మొగ్గు చూపుతుంది. రీఎంట్రీ తర్వాత అక్క పాత్రలు, వదిన పాత్రలు చేస్తుంది. సీనియర్ హీరోలకు జోడీగానూ కీలక పాత్రల్లో నటిస్తూ ఆకట్టుకుంటుంది. కానీ అవి కూడా చాలా ఆచితూచి ఎంపిక చేసుకుంటుండటం విశేషం.
తెలుగులో స్నేహ చివరగా `వినయ విధేయరామ` చిత్రంలో నటించింది. అంతకు ముందు `సన్నాఫ్ సత్యమూర్తి`లో ఉపేంద్రకి భార్యగా చేసింది. హుందాతనంతో కూడిన పాత్రల్లో నటిస్తూ తన మార్క్ ని చాటుకుంటుంది. హుందాతనాన్ని కాపాడుకుంటుంది స్నేహ. అయితే ఇటీవల చూస్తుంటే అప్పుడుడప్పుడు కాస్త హాట్‌లుక్‌లోనూ దర్శనమిస్తుంది స్నేహ. అవి వైరల్ అవుతున్నాయి. స్నేహపై ఉన్న ఇమేజ్‌ని మార్చేస్తున్నాయి.
ఇదిలా ఉంటే సీనియర్ హీరోయిన్లు ఇప్పుడు రీఎంట్రీ తర్వాత గ్లామర్ డోస్ పెంచుతున్నారు. సదా, మీరా జాస్మిన్, భూమికతోపాటు స్నేహ కూడా వరుస ఫోటో షూట్లతో కట్టిపడేస్తున్నారు. హాట్ లుక్‌లో ఫోటో షూట్లు చేస్తూ అభిమానులకు షాకిస్తున్నారు. మళ్లీ సినిమాల్లో రాణించే ప్రయత్నాల్లో భాగంగా ఇలాంటి గ్లామర్ ఫోటో షూట్లతో ఎట్రాక్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు. మరి వారి ప్రయత్నం ఏ మేరకు ఫలిస్తుందో చూడాలి.