MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • Sivaji Ganesan: స్టార్‌ కమెడియన్‌ని ఇంటికి పిలిచి అవమానించిన శివాజీ గణేషన్‌.. స్టార్‌ హీరోకి మతిపోయే కౌంటర్‌

Sivaji Ganesan: స్టార్‌ కమెడియన్‌ని ఇంటికి పిలిచి అవమానించిన శివాజీ గణేషన్‌.. స్టార్‌ హీరోకి మతిపోయే కౌంటర్‌

గౌండమణి ఇచ్చిన సమాధానం ఊహించని శివాజీ గణేశన్, నోట మాట రాక నిశ్చేష్టులయ్యారు. తనకు గతంలో జరిగిన అవమానానికి గౌండమణి ఈ రకంగా బదులు తీర్చుకుని ఇంటికి వెళ్లారు.

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 12 2026, 02:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గౌండమణి కామెడీ విని రిలీఫ్‌ అయిన శివాజీ గణేశన్
Image Credit : x

గౌండమణి కామెడీ విని రిలీఫ్‌ అయిన శివాజీ గణేశన్

కోలీవుడ్‌ దిగ్గజ నటుడు శివాజీ గణేషన్‌ తమిళ సినిమాని శాసించిన విషయం తెలిసిందే. అన్ని రకాల పాత్రలు, సినిమాలతో మెప్పించారు. లెజెండరీ నటిగా రాణించారు. అయితే ఆయనకు, కమెడియన్‌ గౌండమణికి మధ్య జరిగిన ఒక ఆసక్తికర సంఘటన ఇప్పుడు బయటకు వచ్చింది.  ఆ విశేషాలను నటుడు గౌండమణి వెల్లడించారు. శివాజీ గణేశన్ ఎప్పుడైనా డల్‌గా ఉన్నా,  'ఒరేయ్... ఆ గౌండమణి జోకులు కాస్త పెట్టండ్రా' అని చెప్పి, ఆయన కామెడీ సీన్లు చూసి రిఫ్రెష్ అయ్యేవారట. కానీ, ఆ ఇద్దరి మధ్య ఓ తెలియని ఈగో వార్ నడుస్తూ ఉండేది. శివాజీ గణేశన్ ఇంట్లో తరచూ విందులు జరుగుతుండేవి. కానీ గౌండమణి ఎవరి ఇంటికీ విందుకు వెళ్లేవారు కాదు. గౌండమణి నియమాన్ని ఎలాగైనా బ్రేక్ చేయాలని శివాజీ నిర్ణయించుకున్నారు. అప్పట్లో ప్రభు, గౌండమణి కలిసి చాలా సినిమాలు చేస్తుండటంతో వారి మధ్య మంచి స్నేహం ఉండేది. ఆ స్నేహాన్ని వాడుకుని, ప్రభు ద్వారా గౌండమణిని ఇంటికి పిలిచి విందు ఇవ్వాలని శివాజీ ప్లాన్ చేశారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గౌండమణిని అవమానించిన శివాజీ గణేశన్‌
Image Credit : stockPhoto

గౌండమణిని అవమానించిన శివాజీ గణేశన్‌

'ఆ గౌండర్‌ని విందుకు పిలుచుకురా' అని శివాజీ ఆదేశించడంతో, ప్రభు నేరుగా గౌండమణి ఇంటికి వెళ్లారు. 'అన్నా... నాన్నగారు ఇప్పటివరకు ఎవరినీ ఇంటికి వెళ్లి మరీ విందుకు పిలవలేదు. మిమ్మల్ని మొదటిసారి ఇలా పిలుస్తున్నారు. నాకే ఆశ్చర్యంగా ఉంది' అని ప్రభు చెప్పడంతో గౌండమణి కాదనలేకపోయారు. శివాజీ ఇల్లు 'అన్నై ఇల్లం'కు వెళ్లేసరికి చాలామంది భోజనం చేస్తున్నారు. గౌండమణి కారు దిగగానే శివాజీ, 'ఏమయ్యా గౌండర్... బాగున్నావా?' అని పలకరించి కూర్చోబెట్టారు. అందరూ లోపల భోజనం చేస్తుంటే, గౌండమణికి మాత్రం హాల్‌లోనే భోజనం వడ్డించారు. అంతటితో ఆగకుండా, 'గౌండరే... మా ఇంట్లో ఇలా విందులు పెట్టడం మామూలే. నలుగురికి అన్నం పెడితే పుణ్యం వస్తుంది. అందుకే నిన్ను కూడా పిలిచాను' అని గౌండమణిని నేరుగా అవమానించారు శివాజీ.

34
శివాజీ గణేశన్‌కి ఇచ్చిన పడేసిన గౌండమణి
Image Credit : facebook/@goundamani

శివాజీ గణేశన్‌కి ఇచ్చిన పడేసిన గౌండమణి

ఈ సంఘటన జరిగిన కొన్ని సంవత్సరాల తర్వాత 'దేవర్ మగన్' సినిమా ప్రివ్యూ షో వేశారు. ఆ థియేటర్‌కు గౌండమణి కూడా వచ్చారు. సినిమా చూసిన వాళ్లంతా శివాజీ నటనను తెగ పొగిడారు. దీంతో శివాజీ చాలా సంతోషంగా కనిపించారు. సినిమా అయ్యాక గౌండమణి పక్కనుంచి వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. అది చూసిన శివాజీ, 'అదిగో వెళ్తున్నాడు చూడు గౌండర్. వాడిని పిలవండి' అని పిలిపించారు. గౌండమణి దగ్గరికి రాగానే, 'ఈ సినిమాలో దేవర్ జీవించేశాడు కదా? నా నటన ఎలా ఉంది? ఊరిని కంట్రోల్‌లో పెట్టే దేవర్ గంభీరంగా ఉన్నాడా?' అని అడిగారు. దానికి గౌండమణి, 'సినిమా గురించి ఒకటి చెబుతాను, మీరేమీ తప్పుగా అనుకోవద్దు' అని కోరారు. 'ఏమీ అనుకోను, నీ అభిప్రాయం చెప్పు' అని శివాజీ అన్నారు. వెంటనే గౌండమణి, 'మీరు సినిమాలో పెద్ద దేవర్. మీరు నడిస్తే ఊరు నడుస్తుంది, మీరు నిల్చుంటే ఊరు కూర్చుంటుంది. అంత పెద్ద మనిషి మీరు. కానీ ఒక చిన్న పిల్లాడు తొక్కడం వల్ల చనిపోయారేంటి? ఇంతకుమించి సినిమాలో చెప్పడానికి ఏమీ లేదు' అని ముఖం మీదే చెప్పేశారు.

44
శివాజీని నోరు మెదపకుండా చేసిన గౌండమణి
Image Credit : Asianet News

శివాజీని నోరు మెదపకుండా చేసిన గౌండమణి

ఆ సమాధానం ఊహించని శివాజీ గణేశన్, నోట మాట రాక నిశ్చేష్టులయ్యారు. తనకు గతంలో జరిగిన అవమానానికి గౌండమణి ఈ రకంగా బదులు తీర్చుకుని ఇంటికి వెళ్లారు. ఈ ఆసక్తికరమైన విషయాన్ని దివంగత సినీ జర్నలిస్ట్ నెల్లై భారతి ఒక సందర్భంలో పంచుకున్నారు. ఇప్పుడీ విషయం వైరల్‌ అవుతుంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anasuya: అనసూయ ఏం చేసిన వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image2
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Related Stories
Recommended image1
OTT Movie: ఓటీటీలో దుమ్ములేపుతున్న `మన శంకర వర ప్రసాద్‌ గారు`, కానీ ట్విస్ట్ ఇదే.. చిరంజీవి మూవీ క్లోజింగ్‌ కలెక్షన్లు
Recommended image2
Sequel Movies: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన 7 ఇండియన్ సీక్వెల్స్.. 'ధురంధర్ 2' రికార్డులు బద్దలు కొడుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved