మధుమితను చేసుకుంటే అమ్మ చనిపోతుందన్నారు.. శివబాలాజీ కామెంట్స్ వైరల్..
ఇండస్ట్రీలోకి ఎంట్రీ.. ప్రేమ పెళ్లి గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు శేర్ చేసుకున్నారు శివబాలాజీ, మధుమిత. ఓ టీవీకార్యక్రమానికి అతిధులగా వచ్చిన వీరు.. హోస్ట్ అయిన వెన్నెల కిషోర్ తో కలిసి సరదా విషయాలు పంచుకున్నారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలు నటీనటుగా.. ఉంటూ.. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల్లో శివబాలాజీ, మధుమిత జంట కూడా ఉన్నారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేసిన ఈ జంట.. ప్రస్తుతం హ్యాపీలైఫ్ ను లీడ్ చేస్తున్నారు. అందరిలాగానే తాము కూడా గోడవలు పడ్డామంటున్న ఈ కపుల్.. అసలు తాము పెళ్ళి చేసుకోవడమే విచిత్ర పరిస్థితుల్లో చేసుకున్నామంటున్నారు.
షూటింగ్ లో కలిసినప్పుడు ఒకరిని మరొకరు చూసుకోవడం.. నుంచిప్రేమించుకోవడం వరకూ వచ్చిందట వీరిద్దరి వ్యవహారం. అంతే కాదు మధుమిత లిఫ్ స్టిక్ తుడిచిన టిష్యూస్ ను కూడా కావాలని ఆమె ముందే దాచుకునేవాడట శివబాలాజి. ఆతరువాత కొన్నాళ్లకు శివ మధుమితకు ప్రపోజ్ చేశాడట. అయితే ఐలవ్ మూ అనిమాత్రం చెప్పలేదట.. పెళ్ళి చేసుకుందామంటూ డైరెక్ట్ మ్యారేజ్ ప్రపోజల్ పెట్టాడట.
ఇంట్లో వాళ్లు కూడా పెళ్ళికి ఒప్పుకోవడంతో.. ఇద్ధరి జాతకాలు చూసుకోవడం.. జాతకాలు కలవలేదనే షాకింగ్ న్యూస్ తెలిసిందట. అంతే కాదు.. మధుని చేసుకుంటే శివబాలాజీ తల్లికి.. ప్రాణ గండం అని చెప్పారట. దాంతో మధుకి విషయం చెప్పడం..దాదాపు ఏడాదిన్నర వరకూ ఇద్దరుమాట్లాడుకోలేదట. ఆతరువాత తానే మధు గురించి ఎంక్వైరీ చేశానంటున్నాడు శివబాలాజీ.
ఇక ఏదైతే అది అయ్యిందని తనపై కోపంగా ఉన్నా.. మధుమితను కన్విన్స్ చేసి.. ఇంట్లో వాళ్లతో యుద్దం చేసి మరీ.. పెళ్లికి రెడీ అయ్యారట.. వెండితెర జంట. అంతే కాదు సెకండ్ టైమ్ జాతకాలు చూపించినప్పుడు మాత్రం కరెక్ట్ గా సరిపోయాయి అన్నారట పండితులు. దాంతో పెళ్లి పిల్లలు టైమ్ తెలియలేదంటున్నారు కపుల్స్.
ఇలా తమ జీవితంలో జరిగిన ఫన్నీ విషయాలు.. సీరియస్ విషయాలు వెల్లడించారు శివబాలాజీ, మధుమిత. కమెడియన్ కమ్ హోస్ట్ వెన్నెల కిషోర్ తో కలిసి సందడి చేశారు. అంతే కాదు చెన్నై సిటీబస్ లో సడె న్ బ్రేక్ వేసినప్పుడు శివబాలాజీ కిస్ చేశాడని.. దాంతో తన గుండె ఆగినంత పని అయ్యిందన్నారు మధుమిత. ఇలా చాలా విషయాలు శేర్ చేసుకున్నారుటాలీవుడ్ కపుల్.