మొగుడు వద్దు.. కాని అది మాత్రం కావాలట, సీతారామం హీరోయిన్ మృణాల్ సెన్సేషనల్ కామెంట్స్
నాకు పెళ్ళి వద్దు.. మగతోడు అసలే వద్దు.. నాకునేను బ్రతకగలను అంటోంది సీతారామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఒంటరి జీవితమే మేలు అంటోంది. అంతే కాదు పెళ్లి, సెక్స్, పిల్లలు గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది బ్యూటీ. ఇంతకీ ఆమె ఏమన్నదంటే..?
హీరోయిన్లలో ఇప్పటికే చాల మంది పెళ్ళి పెటాకులు లేకుండా, కుటుంబం బాధత్యలు తెలియకుండా.. ఒంటరి జీవితానికి అలవాటు పడిపోయారు. అంతే కాదు వస్తువులు అద్దెకు తెచ్చుకున్నట్టు..పిల్లలను కూడా అద్దె గర్బాల ద్వారా కంటున్నారు. కొంత మంది పెళ్లి చేసుకుని కూడా అద్దె గర్బాలనుఆశ్రయిస్తున్నారు. ఇలా హీరోయిన్లలో అనేక రకాల ఆలోచనలు ఉంటే.. తన ఆలోచన కూడాబయట పెట్టింది హీరోయిన్ మృణాల్ ఠాకూర్.
mrunal thakur
ఈ మధ్యే ఓ ఫేమస్ యూట్యూబ్ ఛానల్ లో ప్రసారం అయిన డేటింగ్ కు సబంధించిన ఎపిసోడ్ లో మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ బోల్డ్ కామెంట్స్ చేసింది. 30 ఏళ్ల వయసులో ఉన్న స్త్రీలు డేటింగ్ చేయడం.. ప్రేమలో పడటం పిల్లల్ని కనడం వల్ల చాలా స్ట్రెస్ కి లోనవుతారంటోంది బ్యూటీ. అందుకే తాను మాత్రం ఆ ఒత్తిడి నేను దూరంగా ఉండాలి అనుకుంటుందట.
ఇలానే ఉండాలి... ఇది ఆచారం అంటూ... పాత చింతకాయ పచ్చడిలా నేను ఉండను అని తెగేసి చెప్పేసింది బ్యూటీ. అలాగని మరీ ఫాస్ట్ గా.. ఈతరం అమ్మాయిలలా ఏది పడితే అది చేసే రకం కాదు నేను అంటోంది మృణాల్. అలా ఫాస్ట్ గా ఉన్నా చాలా కష్టం ఎందుకంటే.. ఇప్పుడు అంతటా చాలా అభద్రతాభావం ఉంది. అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అందుకే నాకు నచ్చింది నేను చేస్తూ ఉంటాను అని క్లారిటీ ఇచ్చింది బ్యూటీ.
అంతే కాదు నాకు కావాల్సిందల్లా ప్రొటెక్టెడ్ పర్సన్ మాత్రమే.. ఎందుకంటే నాకు మాత్రం అమ్మ అని పిలిపించుకోవాలని ఉంది. ఓ బిడ్డను కనాలి అని ఉంది. కానీ నాకు మొగుడు వద్దు.. సెక్స్ అసలే వద్దు అంటూ.. డిఫరెంట్ గా మాట్లాడింది బ్యూటీ. అంతే కాదు తాను ఒంటరి తల్లిగా ఉండాలని అనుకుంటున్నట్టు తన కోరిక చెప్పేసింది.
Image: Mrunal Thakur/Instagram
అయితే మృణాల్ చేసిన కామెంట్స్ పైన నెటిజన్స్ మండిపడుతున్నారు. దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మొగుడు వద్దు సెక్స్ వద్దు మరి పిల్ల ఎలా పుడతారు.. నువ్వే చెప్పు.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి వారివల్లే సమాజం ఇలా తయారవుతుందంటూ విమర్షిస్తున్నారు. కాని అవేవి పట్టనట్టే ఉంటోంది మృణాల్.
ఇక మరాఠీ సీరియల్ నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన మృణాల్.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. హిందీలోకాస్త సక్సెస్ సాధించంది. ఇక తెలుగులో ఫస్ట్ టైమ్ సీతారామం సినిమాతో ఎంట్రీ ఇచ్చి..ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టింది. ప్రస్తుతం ఆమెకువరుస అవకాశాలు క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది. అంతే కాదు రెమ్యూనరేషన్ కూడా పెంచేసిందట చిన్నది.