'జబర్దస్త్' లోకి రాగానే పరువాల వరద మొదలు పెట్టిన సిరి హనుమంత్.. క్లాసీ టచ్ తో కిల్లింగ్ లుక్స్
సిరి ప్రస్తుతం కెరీర్ లో ఒక్కో మెట్టు ఎదుగుతోంది. ప్రస్తుతం యాంకర్ గా పలు షోలు చేస్తోంది. ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్న విషయం ఏంటంటే సిరి హనుమంత్ జబర్దస్త్ యాంకర్ గా మారిపోయింది.
బిగ్ బాస్ సీజన్ 5లో గ్లామర్ బ్యూటీ, యూట్యూబ్ స్టార్ సిరి హనుమంత్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ సీజన్ లో సన్నీ విజేతగా నిలిచాడు. ఆమె స్నేహితుడు షణ్ముఖ్ రన్నరప్ గా నిలిచాడు. సిరి టాప్ 5 కి చేరుకుంది.
బిగ్ బాస్ 5తో సిరి క్రేజ్ మరింతగా పెరిగింది. ప్రస్తుతం సిరి పలు షోలలో యాంకర్ గా అవకాశాలు అందుకుంటోంది. అలాగే నటిగా కూడా రాణిస్తోంది. ఇటీవల ముగిసిన బిగ్ బాస్ సీజన్ 6లో సిరి ప్రియుడు శ్రీహాన్ రన్నరప్ సాధించిన సంగతి తెలిసిందే.
చాలా కాలంగా సిరి, శ్రీహాన్ ప్రేమలో ఉన్నారు. అయితే ఆమె బిగ్ బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ తో క్లోజ్ గా మూవ్ కావడంతో అనేక రూమర్లు వినిపించాయి. సిరి.. షణ్ముఖ్ తో క్లోజ్ గా ఉండడం వల్లే దీప్తి సునైనా అతడికి బ్రేకప్ చెప్పింది అనే ప్రచారం కూడా జరిగింది.
ఇదంతా పక్కన పెడితే సిరి ప్రస్తుతం కెరీర్ లో ఒక్కో మెట్టు ఎదుగుతోంది. ప్రస్తుతం యాంకర్ గా పలు షోలు చేస్తోంది. అదిరిపోయే తన గ్లామర్ లుక్ తో నెటిజన్లని ఆకర్షిస్తోంది. ఇప్పుడు అందరిని ఆకర్షిస్తున్న విషయం ఏంటంటే సిరి హనుమంత్ జబర్దస్త్ యాంకర్ గా మారిపోయింది.
జబర్దస్త్ లో వరుసగా యాంకర్స్ మారుతూనే ఉన్నారు. గతంలో అనసూయ యాంకరింగ్ చేస్తుండగా ఆమె స్థానంలో సౌమ్య రావు వచ్చింది. ఆమె కూడా జబర్దస్త్ నుంచి తొలగింది. అంతే సౌమ్యరావు జబర్దస్త్ నుంచి ఎందుకుతప్పుకుంది అనేది స్పష్టంగా తెలియదు. ఇప్పుడు ఆమె స్థానంలో సిరి హనుమంత్ వచ్చింది. రాగానే సిరి పరువాల వరద మొదలు పెట్టింది.
జబర్దస్త్ షో కోసం సిరి ఎంతో అందంగా ముస్తాబైన ఫోటోలని సోషల్ మీడియాలో పంచుకుంది. వైట్ లాంగ్ డ్రెస్ లో సిరి హనుమంత్ మెరుపులు మెరిపిస్తోంది. తన సొగసుకి క్లాసీ టచ్ అంటూ కామెంట్ పెట్టింది. సిరి ఇయర్ రింగ్స్ చాలా వెరైటీగా ఉన్నాయి అంటూ కుర్రాళ్లు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
సిరి జబర్దస్త్ యాంకర్ గా ఎలా రాణిస్తుందో అని అంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రోమో ఆకట్టుకుంది. జబర్దస్త్ కమెడియన్లు యాంకర్స్ పై సెటైర్లు వేయడం చూస్తూనే ఉన్నాం. మరి సిరి వాళ్ళతో కలసి ఎలా నవ్విస్తుందో చూడాలి. లేటెస్ట్ ఫొటోస్ మాత్రం కురాళ్ళకి కనువిందు గా మారాయి. సిరి పర్ఫెక్ట్ స్ట్రక్చర్ చూస్తే ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఆమె చంద్రబింబం లాంటి ముఖం మతిపోగొడుతున్నాయి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.