Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi mynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • Singer Sunitha-Ram:ఆమెను వేశ్యగా చిత్రీకరించారు... చిక్కుల్లో సింగర్ సునీత భర్త రామ్!

Singer Sunitha-Ram:ఆమెను వేశ్యగా చిత్రీకరించారు... చిక్కుల్లో సింగర్ సునీత భర్త రామ్!

స్టార్ సింగర్ సునీత(Singer Sunitha) భర్త వీరపనేని రామ్ వివాదంలో చిక్కున్నట్లు తెలుస్తుంది. ఓ వర్గం మహిళలను కించపరిచాడన్న ఆరోపణలు ఆయన ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ వివాదంలో ఆయన ఆఫీస్ పై కొందరు దాడులకు తెగబడ్డారని వార్తలు అందుతున్నాయి.

Sambi Reddy | Published : Jan 25 2022, 03:34 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image


వీరపనేని రామ్ (Veerapaneni Ram)చాలా కాలంగా మీడియా రంగంలో రాణిస్తున్నారు. ఆయనకు మాంగో మీడియా సంస్థ ఉంది. ఈ సంస్థ క్రింద ఓ యూట్యూబ్ ఛానల్ తో పాటు పలు వ్యాపారాలు ఆయన నిర్వహిస్తున్నారు. అయితే సదరు యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేసిన వీడియో ఆయనకు కొత్త చిక్కులు తెచ్చిపెట్టింది. 

26
Asianet Image

మాంగో యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ అయిన ఓ వీడియోలో గౌడ సామాజిక వర్గానికి చెందిన మహిళను వేశ్యగా చూపించారు. సదరు వీడియో ద్వారా గౌడ సామజిక వర్గ మహిళలను కించపరిచాడని రామ్ పై కొందరు మండిపడుతున్నారు. ఈ క్రమంలో మాంగో మీడియా సంస్థ కార్యాలయంపై భౌతిక దాడులకు పాల్పడినట్లు కూడా సమాచారం అందుతుంది.

36
Asianet Image

ఇక ఈ వివాదానికి సంబంధించిన పూర్తి సమాచారం అందాల్సి ఉంది. నేడు ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు పలు మీడియా సంస్థలు కథనాలు వెల్లడించాయి. సోషల్ మీడియా విప్లవం నేపథ్యంలో కొన్ని సున్నితమైన అంశాలపై ఆచితూచి స్పందించాల్సి ఉంది. లేదంటే ఇలాంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

46
Asianet Image

కాగా 2021 జనవరిలో సునీత- రామ్ వివాహం జరిగింది. హైదరాబాద్ లో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహము జరిగింది. మొదటి భర్తతో విడాకుల అనంతరం ఇద్దరు పిల్లతో ఒంటరిగా ఉంటున్న సునీత రామ్ ని రెండో వివాహం చేసుకున్నారు. 42 ఏళ్ల వయసులో రెండో పెళ్లి ఏంటంటూ అప్పట్లో ఆమెను కొందరు విమర్శించారు.

56
Asianet Image


పిల్లల భవిష్యత్ కోసం రెండో వివాహ నిర్ణయం తీసుకుంటున్నట్లు సునీత తెలియజేశారు. రామ్ తో వివాహం తర్వాత సునీత చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. ఆమె కొత్త జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. సునీత జీవితం ఈ వివాహంతో అనుకోని మలుపు తిరిగింది. కాగా పెళ్లి తర్వాత సునీత సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నారు. 

66
Asianet Image


సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సునీత సుదీర్ఘ కెరీర్ కలిగి ఉన్నారు. ప్రస్తుతం ఆమె కొన్ని బుల్లితెర కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఎస్పీ బాలు జ్ఞాపకార్థం స్వరాభిషేకం కొత్త సీజన్ ప్రారంభం కాగా... సునీత మరలా భమయ్యారు. బాలు కుమారుడు చరణ్ తో పాటు సంగీత ప్రియులను అలరిస్తున్నారు. 
 

Sambi Reddy
About the Author
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. Read More...
 
Recommended Stories
Top Stories