- Home
- Entertainment
- Sravana Bhargavi: `అన్నమయ్య కీర్తనలు` వివాదంపై శ్రావణ భార్గవి షాకింగ్ కౌంటర్.. పడుకుని అలా చేస్తే తప్పేంటి?
Sravana Bhargavi: `అన్నమయ్య కీర్తనలు` వివాదంపై శ్రావణ భార్గవి షాకింగ్ కౌంటర్.. పడుకుని అలా చేస్తే తప్పేంటి?
స్టార్ సింగర్ శ్రావణ భార్గవి.. `అన్నమయ్య కీర్తనల` వివాదంలో ఇరుక్కున్న విషయం తెలిసిందే. తాజాగా ఆమె స్పందించింది. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
శ్రావణ భార్గవి(Sravana Bhargavi) తెలుగులో స్టార్ సింగర్స్ లో ఒకరిగా రాణిస్తున్నారు. మేల్ సింగర్ హేమచంద్ర(HemaChandra), శ్రావణ భార్గవి భార్యాభర్తలనే విషయం తెలిసిందే. ఈ మధ్య వీరిద్దరు విడిపోతున్నట్టు వార్తల్లో నిలిచారు. ఆ వెంటనే అందులో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు శ్రావణ భార్గవి మరో పెద్ద వివాదంలో ఇరుక్కుంది. `అన్నమయ్య కీర్తనలను ఉపయోగించి ఆమె వీడియో చేయడం దుమారం రేపుతుంది.
ఇందులో శ్రావణ భార్గవి వయ్యారాలు పోతూ, కాళ్లు ఊపుతూ, వొంపు సొంపులతో కవ్విస్తూ కాస్త రొమాంటిక్‌గా కనిపించిందని అంటున్నారు విమర్శకులు. అన్నమయ్య కీర్తనల్లో ఒకటైన `ఒకపరి ఒకపరి వయ్యారమే`(Okapari) అంటూ సాగే ఓ పాటని ఉపయోగించి తన విజువల్స్ వాడి ఓ స్పెషల్ వీడియోని రూపొందించింది. ఈ వీడియో సాంగ్ యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతుంది. గత నాలుగు రోజులుగా నెట్టింట ఇది వైరల్‌గా మారింది.
దీన్నిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు తిరుపతికి చెందిన అన్నమయ్య ట్రస్ట్ సభ్యలు, అన్నమాచార్యుల వంశీయులు. ఇది స్వామివారిని కించపరిచేలా ఉందని, విజువల్ శృంగార భరితంగా ఉన్నాయని ఆరోపిస్తున్నారు. అన్నమయ్య కీర్తనలను అపహాస్యం చేసేలా ఉన్నాయని, స్వామి వారికి, అమ్మవారిని కీర్తిస్తూ పాడే ఈ పాటని తప్పుగా వాడుతున్నారని, ఇది సరైనది కాదని వారు ఆరోపిస్తున్నారు. ఆ వీడియోని తొలగించాలన్నారు. లేకపోతే టీటీడీకి ఫిర్యాదా చేస్తామన్నారు. కోర్ట్ వరకు వెళ్తామని హెచ్చరించారు. Sravana Bhargavi Annamaya Keerthana Controversy.
ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై సింగర్ శ్రావణ భార్గవి స్పందించింది. ఆ వీడియోలో అశ్లీలత ఏం కనిపిస్తుందని ప్రశ్నించింది. తాను ఎంతో భక్తితో, కష్టపడి ఆ వీడియో చేశానని తెలిపింది. ఆ వీడియోలో అభ్యంతకరంగా ఏం కనిపిస్తుందని ప్రశ్నించింది. ఆ కీర్తనలకు సంబంధించి తాను ఎలాంటి రిలిక్ మార్చి పాడలేదని, సంగీతంలో తనకున్న నాలెడ్జ్ ని మొత్తం పెట్టానని పేర్కొంది.
`ఈ పాటని ఎందుకు డిలీట్ చేయాలని అడుగుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నేను పడుకుని కనిపించడంలో తప్పేముంది. అందులో కనీసం లిప్ సింక్ కూడా లేదు. మీ చూపులో తప్పులేకపోతే మీకది తప్పుగా అనిపించదు. నా అంతరాత్మకి తెలుసు. నేను తప్పు చేయలేదని. దాన్ని మీరు తప్పుగా భావిస్తున్నారు. మీరు తీసుకోవాల్సిన యాక్షన్ తీసుకోండి. యూట్యూబ్ వాళ్లతో మాట్లాడుకుని ఏం చేస్తారో చేసుకోండి` అని ఘాటుగా రియాక్ట్ అయ్యింది శ్రావణ భార్గవి.
అంతేకాదు తాను కూడా బ్రాహ్మణ అమ్మాయినే అని, తాను పూజలు, వ్రతాలు, నోములు చేస్తానని, నా మనసుకి అది తప్పుగా అనిపించడం లేదని తెలిపింది. ఈ పాట అమ్మవారి గురించని, మీ ఇంట్లో అమ్మాయిపుడితే అమ్మవారిగానే భావిస్తామని, ఇప్పుడు నేను అదే కదా. స్ట్రీ అంటే అమ్మావారే కదా. స్త్రీని తప్పుగా చూపించలేదని పేర్కొంది. అందులో నేఉన కాళ్లు ఊపుతూ చేశానని అంటున్నారు. కానీ ఓ అమ్మాయి ఇంట్లో తనకి నచ్చినట్టుగా ఉంటుందని, తెలుగమ్మాయి ఎలా ఉంటుందో అలా చూపించామని వెల్లడించింది శ్రావణ భార్గవి.
`తినే వంటకాల నుంచి, పుస్తకం వరకు అన్నింటిలోనూ తెలుగు సాంప్రదాయమే కనిపిస్తుందని చెప్పారు. ఈ పాటలో మీకు తెలుగుదనం తప్ప మరేదైనా కనిపిస్తే అది మీ చూపులో లోపం ఉన్నట్టే నా పాటలో కాదని, అది నా సమస్య కాదని, మీ సమస్య అని, నిజంగా ఈ పాట తప్పు అంటే దేవుడే ఆ పాటని తీయించేస్తాడు. మీరు తీయమంటే తీయడానికి మీరు దేవుడు కాదు కదా. అసలు దేవుడికే నచ్చలేదంటే అది బయటకు వచ్చేది కాదనేది నా నమ్మకం. నాకు తప్పు అనిపించలేదు. మీకు తప్పు అనిపిస్తే ఏం చేసుకుంటారో చేసుకోండని స్పష్టం చేసింది శ్రావణ భార్గవి. ఆమె చెప్పిన విషయాలు వైరల్‌గా మారాయి. మరోవైపు దీనిపై బీజేపీ నాయకురాలు శ్వేత రెడ్డి ఫైర్ అయిన విషయం తెలిసిందే.