MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • 'అన్‌స్టాపబుల్'కి పోటీగా 'నిజం'.. అతిథులుగా చిరు, నాని, చంద్రబాబు.. కులం గురించి నోరు విప్పిన మెగాస్టార్

'అన్‌స్టాపబుల్'కి పోటీగా 'నిజం'.. అతిథులుగా చిరు, నాని, చంద్రబాబు.. కులం గురించి నోరు విప్పిన మెగాస్టార్

బాలయ్య అన్ స్టాపబుల్ కి పోటీగా మరో సెన్సేషనల్ టాక్ షో రెడీ అవుతోంది. ఈ షోకి హోస్ట్ ఎవరో కాదు.. ప్రముఖ గాయని స్మిత. 'నిజం విత్ స్మిత' అనే పేరుతో ఈ షో సోని లివ్ ఓటీటీ వేదికగా ప్రసారం కానుంది.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Feb 02 2023, 06:50 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ షో తిరుగులేని టాక్ షోగా దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు, ప్రభాస్, కిరణ్ కుమార్ రెడ్డి, రాజమౌళి, ప్రభాస్ లాంటి ప్రముఖులు ఈ షోకి హాజరయ్యారు. బాలయ్య వారితో జరిపిన సరదా సంభాషణలు.. నిజాలు చెప్పించిన విధానం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. అందుకే పేరుకి తగ్గట్లుగానే ఈ షో అన్ స్టాపబుల్ గా దూసుకుపోతోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిథిగా హాజరైన ఎపిసోడ్ నేడు టెలికాస్ట్ కానుండడంతో ఎక్కడ లేని హైప్ నెలకొంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఈ తరుణంలో బాలయ్య అన్ స్టాపబుల్ కి పోటీగా మరో సెన్సేషనల్ టాక్ షో రెడీ అవుతోంది. ఈ షోకి హోస్ట్ ఎవరో కాదు.. ప్రముఖ గాయని స్మిత. 'నిజం విత్ స్మిత' అనే పేరుతో ఈ షో సోని లివ్ ఓటీటీ వేదికగా ప్రసారం కానుంది. ఫిబ్రవరి 10 నుంచి ఈ షోని లాంచ్ చేస్తున్నారు. తాజాగా ఈ షోకి సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. హేమాహేమీలతో పాటు యువ హీరోలు, నటీమణులు నిజం విత్ స్మితలో పాల్గొననున్నారు. 

36

చంద్రబాబు, చిరంజీవి, బిజెపి నేత రామ్ మాధవ్, క్రేజీ హీరో నాని, అడివి శేష్, రానా దగ్గుబాటి, సాయి పల్లవి, సీనియర్ హీరోయిన్ రాధిక లాంటి ప్రముఖులు నిజం విత్ స్మితలో పాల్గొనబోతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో ఆసక్తికరంగా ఉంది. వాడివేడిగా స్మిత వీరందరిచే నిజాలు మాట్లాడించబోతోంది. 

46

ప్రోమోలో చూపిన విధంగా చంద్రబాబు వెన్నుపోటు గురించి ఓపెన్ కాబోతున్నారు. ఇక చిరంజీవి తొలిసారి కులం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు ఉన్నారు. అలాగే నాని నెపోటిజం గురించి మాట్లాడుతూ రాంచరణ్ ని ఉదాహరణగా చెప్పడం ఉత్కంఠ రేపుతోంది. 

56

నెపోటిజం..నెపోటిజం.. అని గోల చేస్తుంటారు. రాంచరణ్ మొదటి సినిమా కోటి మంది చూశారు. నెపోటిజం అని మాట్లాడేవారు ఆ కోటిమందిలో లేరా అని నాని ప్రశ్నించడం ఆసక్తిగా మారింది. ఉత్కంఠ రేపుతున్న ఈ షోకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.  

66

మరి ఈ షో అన్ స్టాపబుల్ రేంజ్ లో సక్సెస్ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. సింగర్ గా, డ్యాన్సర్ గా అలరించిన స్మిత ఇలా హోస్ట్ గా అవతారం ఎత్తడం ఆసక్తిగా మారింది. 

 

About the Author

SG
Sreeharsha Gopagani
నాని (నటుడు)
Latest Videos
Recommended Stories
Recommended image1
krishna: నీతో సినిమా చేస్తే అడ్రస్‌ గల్లంతే, కృష్ణను భయపెట్టిన స్టార్‌ ప్రొడ్యూసర్‌.. సూపర్‌ స్టార్‌ దెబ్బకి రికార్డులు బ్రేక్‌
Recommended image2
Allu Arjun: హేట్‌ చేయోద్దు, అమ్మాయి ఇంటి ముందు కూర్చొని ఎంజాయ్‌ చేయండి.. అభిమానులకు అల్లు అర్జున్‌ సందేశం
Recommended image3
150 కోట్ల హీరో, 40 కోట్ల హీరోయిన్, ఆ ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ స్టార్స్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved