MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Mangli: శ్రీముఖిపై అతడి కన్ను పడింది, అందుకే నన్ను టార్గెట్ చేశాడు..సింగర్ మంగ్లీ సంచలన ఆరోపణలు

Mangli: శ్రీముఖిపై అతడి కన్ను పడింది, అందుకే నన్ను టార్గెట్ చేశాడు..సింగర్ మంగ్లీ సంచలన ఆరోపణలు

సింగర్ మంగ్లీ తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. వ్యాపారం పేరుతో కొంత మంది వద్ద మంగ్లీ డబ్బు తీసుకుని మోసం చేసింది అంటూ న్యాయవాది ఒకరు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Apr 12 2026, 08:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Mangli
Image Credit : Asianet News

Mangli

ప్రముఖ తెలుగు సింగర్ మంగ్లీ ఇటీవల ఎక్కువగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. పెట్టుబడుల పేరుతో 100మందిని పైగా ఆమె మోసం చేసింది అనే ఆరోపణలతో పాటు, న్యాయవాదిని బెదిరించిన ఆరోపణలతో కూడా ఆమెపై కేసు నమోదైంది. సుబ్బారావు అనే న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగ్లీపై కేసు నమోదు చేశారు. దీనితో ఒక్కసారిగా మంగ్లీ వార్తల్లో నిలిచారు.

25
వ్యాపారాల పేరుతో మోసం
Image Credit : Instagram

వ్యాపారాల పేరుతో మోసం

అసలేం జరిగిందంటే.. మంగ్లీ, ఆమె సోదరుడు శివ, విరాటపర్వం దర్శకుడు వేణు ఊడుగుల, మరికొందరు కలసి వ్యాపారాల పేరుతో 100 మందిని పైగా నమ్మించి వారి వద్ద డబ్బు తీసుకున్నారట. దీని వల్ల అధికమొత్తంలో లాభాలు వస్తాయి అని ఆశ చూపారట. ఎన్నిరోజులైనా లాభాలు చూపలేదు కదా కనీసం అసలు కూడా ఇవ్వలేదని బాధితులు ఫిర్యాదు చేయడం ప్రారంభించారు.

Related Articles

Related image1
Anchor Vishnu Priya: వల్గర్ ఫోజులతో డబ్బు సంపాదన, యాంకర్‌పై సైబర్ క్రైమ్ కేసు.. అసలేం జరిగింది?
Related image2
Soundarya: ఆ సీక్రెట్స్ ఫ్యామిలీకి కూడా చెప్పకుండా సౌందర్య చనిపోయింది, ఒక్క సెకనులో అడ్రెస్ లేని వాళ్ళలా..
35
పోలీసులని ఆశ్రయించి కేసు నమోదు
Image Credit : Instagram

పోలీసులని ఆశ్రయించి కేసు నమోదు

దీనితో వారి తరుపున సుబ్బారావు అనే న్యాయవాది పోరాటానికి దిగారు. దీనితో మంగ్లీ, ఆమె సోదరుడు, శివ, దర్శకుడు వేణు ఊడుగుల.. సుబ్బారావుపై బెదిరింపులకు దిగారట. ఏకంగా యాక్సిడెంట్ చేసి చంపేస్తాం అని బెదిరిస్తున్నారట. దీనితో న్యాయవాది సుబ్బారావు పోలీసులని ఆశ్రయించి కేసు నమోదు చేశారు.

45
 ఏమాత్రం సంబంధం లేని వివాదంలోకి నన్ను లాగారు
Image Credit : Instagram

ఏమాత్రం సంబంధం లేని వివాదంలోకి నన్ను లాగారు

పోలీసులు మంగ్లీని విచారణ చేయడం ప్రారంభించారు. ఈ వివాదం తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చిన మంగ్లీ కన్నీటి పర్యంతం అయ్యారు. అసలు ఏమాత్రం సంబంధం లేని వివాదంలోకి నన్ను లాగారు అని ఆమె కన్నీరు మున్నీరు అయ్యారు. ఇందులో తన ఇన్వాల్వ్ మెంట్ ఉంది అని తేలితే ఎలాంటి శిక్షకు అయినా సిద్ధం. నేను కూడా మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను.

55
శ్రీముఖి అంటే క్రష్
Image Credit : instagram/sreemukhi

శ్రీముఖి అంటే క్రష్

పాటే ప్రపంచంగా బతుకుతున్నాను. నాకు పాట తప్ప ఇంకొక వ్యాపారం తెలియదు. ఎలాంటి వ్యాపారాలు లేవు. పాటలతో నాకు ప్రజల నుంచి ఎలాంటి ఆదరణ వస్తుందో తెలుసు కదా. అలాంటప్పుడు నాకు మరో వ్యాపారం చేయాల్సిన అవసరం ఏంటి అని మంగ్లీ అన్నారు. సుబ్బారావు అనే న్యాయవాది సెలేబ్రిటిగా మారాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. ఫేమస్ అవ్వడమే తన లక్ష్యం. అందుకే ఇలాంటి వివాదాలు పెట్టుకుంటున్నాడు. సుబ్బారావుకి భరతనాట్యం తెలుసు. సినిమాలు అంటే పిచ్చి. శ్రీముఖి అంటే క్రష్ అని చెప్పాడు. నా ద్వారా ఫేమస్ అయి బిగ్ బాస్ లోకి వెళ్ళాలి అనుకుంటున్నాడు. అందుకే నన్ను ఇలా ఇరికించాలి అని ప్రయత్నిస్తున్నాడు అంటూ మంగ్లీ తీవ్ర ఆరోపణలు చేసింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Flora Saini: 14 నెలలు నరకం అనుభవించా, ఆ నిర్మాత నా జీవితాన్ని నాశనం చేశాడు.. బిగ్‌ బాస్‌ నటి సంచలన విషయాలు వెల్లడి
Recommended image2
Dhruva Natchathiram: 9 ఏళ్ల తర్వాత థియేటర్లోకి విక్రమ్‌ సినిమా.. ధృవ నక్షత్రం కి కోర్ట్ గ్రీన్‌ సిగ్నల్‌
Recommended image3
NTR Warning To Chiranjeevi: ఎన్టీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చినా లెక్కచేయని చిరంజీవి, దెబ్బకి 6 నెలలు మంచానికే పరిమితం
Related Stories
Recommended image1
Anchor Vishnu Priya: వల్గర్ ఫోజులతో డబ్బు సంపాదన, యాంకర్‌పై సైబర్ క్రైమ్ కేసు.. అసలేం జరిగింది?
Recommended image2
Soundarya: ఆ సీక్రెట్స్ ఫ్యామిలీకి కూడా చెప్పకుండా సౌందర్య చనిపోయింది, ఒక్క సెకనులో అడ్రెస్ లేని వాళ్ళలా..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved