- Home
- Entertainment
- నా వైవాహిక జీవితం డిజాస్టర్, ముఖం మీదే ఉమ్మేసారు.. అప్పట్లోనే చనిపోవాలనుకున్న కల్పనని ఆపింది ఎవరో తెలుసా
నా వైవాహిక జీవితం డిజాస్టర్, ముఖం మీదే ఉమ్మేసారు.. అప్పట్లోనే చనిపోవాలనుకున్న కల్పనని ఆపింది ఎవరో తెలుసా
Singer Kalpana: ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. కల్పన టాలీవుడ్ లో మంచి ప్రతిభ, గుర్తింపు ఉన్న సింగర్. 2018లో ఇంటింటి అన్నమయ్య చిత్రంలో నవమూర్తులైనట్టి అనే సాంగ్ కి నంది అవార్డు కూడా అందుకున్నారు.

sp balasubrahmanyam, kalpana, Chitra
Singer Kalpana: ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం చేసిన సంగతి తెలిసిందే. కల్పన టాలీవుడ్ లో మంచి ప్రతిభ, గుర్తింపు ఉన్న సింగర్. 2018లో ఇంటింటి అన్నమయ్య చిత్రంలో నవమూర్తులైనట్టి అనే సాంగ్ కి నంది అవార్డు కూడా అందుకున్నారు. గాయనిగా రాణిస్తూనే అనేక టివి మ్యూజిక్ షోలలో కల్పన పాల్గొన్నారు. ఆమె ఆత్మహత్యకి ప్రయత్నించి నిద్ర మాత్రలు తీసుకోవడం సంచలనంగా మారింది.
ప్రస్తుతం కల్పన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ కోలుకుంటున్నారు. ప్రస్తుతానికి కల్పన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. కుటుంబ గొడవల వల్లే ఆమె సూసైడ్ కి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. పోలీసులు విచారణలో ఆమె భర్త, కుమార్తె గురించి వార్తలు వస్తున్నాయి. వీరిద్దరిలో కల్పనకి ఎవరితో సమస్య అనేది తెలియాల్సి ఉంది.
అయితే కల్పనకి ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన రావడం ఇది కొత్త కాదు. చాలా ఏళ్ళ క్రితమే తాను మరణించాలి అనుకున్నట్లు కల్పన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. కల్పన గాయనిగా అవకాశాలు అందుకుని మంచి గుర్తింపు పొందిన తర్వాత కూడా వర్తమాన సింగర్ తరహాలో ఒక మ్యూజిక్ కాంపిటీషన్ లో పాల్గొన్నారు. అది మలయాళంలో జరిగిన మ్యూజిక్ కాంపిటీషన్. అందులో కల్పన విజేతగా నిలిచారు.
గాయనిగా అవకాశాలు వస్తున్నప్పుడు కంటెస్టెంట్ గా సింగింగ్ కాంపిటీషన్ లో ఎందుకు పాల్గొన్నారు అని యాంకర్ ప్రశ్నించగా.. కల్పన సమాధానం ఇచ్చింది. 2010లో ఆ సింగింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్నాను. ఓపెన్ గా చెప్పాలంటే నా జీవితంలో ఆ టైంలో నేను అన్నీ కోల్పోయాను. నా వైవాహిక జీవితం డిజాస్టర్ అయింది. నా కూతురు ఉంది, సంపాదన అంతగా లేదు. ఆ టైంలో నాకు చనిపోవడమే బెటర్ అనిపించింది. అప్పుడు సింగర్ చిత్రమ్మ (చిత్ర) నా ఆలోచనని మార్చే ప్రయత్నం చేశారు.
నువ్వు సూసైడ్ చేసుకోవడానికే పుట్టవా అని తిట్టారు. నువ్వు అనుభవించిన కష్టాలు చాలు. నువ్వు దీని నుంచి ఏదో విధంగా బయటపడు అని చెప్పి మలయాళంలో సింగింగ్ కాంపిటీషన్ జరుగుతోంది అని నన్ను రమ్మన్నారు. దీనితో నేను వెళ్లి ఆ షోలో పాల్గొనడం జరిగింది. విజేతగా కూడా నిలిచాను అని కల్పన తెలిపారు. ఆ షోలో పాల్గొనడం వల్ల చాలా మంది నన్ను చాలా మాటలు అన్నారు. వాస్తవం గా చెప్పాలంటే కొందరు నా ముఖం మీద ఉమ్మేసినట్లు మాట్లాడారు. సింగర్ గా రాణిస్తూ సింగింగ్ కాంపిటీషన్ లో పాల్గొంటోంది.. ఏంటి ఈ కక్కుర్తి అని మాట్లాడారు అంటూ కల్పన తెలిపారు.
singer chitra
చిత్ర గారు తన లైఫ్ ని గైడ్ చేసినట్లు కల్పన పేర్కొన్నారు. మరో వైపు లెజెండ్రీ సింగర్ ఎస్పీ బాలు గారు నన్ను కెరీర్ పరంగా గైడ్ చేసారు. నేను పాడే చాలా పాటలని ఆయన వినేవారు. ఎక్కడైనా తప్పు అనిపిస్తే వెంటనే ఫోన్ చేసి.. ఏంటమ్మా ఆ పదం తప్పుగా పలికావు అని మందలించేవారు. నీకు అర్థం తెలియకపోతే తెలుసుకుని పాడాలి. తెలుసుకోవడంలో తప్పులేదు అని చెప్పేవారు అంటూ కల్పన ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో ఉన్న అనుబంధం గురించి తెలిపారు.