- Home
- Entertainment
- చిన్మయి ఓవరాక్షన్, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..పెద్దావిడ మాటలని వక్రీకరించి వెటకారం
చిన్మయి ఓవరాక్షన్, దుమ్మెత్తిపోస్తున్న నెటిజన్లు..పెద్దావిడ మాటలని వక్రీకరించి వెటకారం
గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ చిన్మయి సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే మహిళలపై జరిగే వేధింపుల విషయంలో చిన్మయి ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది. మీటూ ఉద్యమంలో భాగంగా చిన్మయి తరచుగా తన గళం వినిపిస్తూ ఉంటుంది.

గాయనిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా సింగర్ చిన్మయి సౌత్ లో గుర్తింపు సొంతం చేసుకుంది. అలాగే మహిళలపై జరిగే వేధింపుల విషయంలో చిన్మయి ఫైర్ బ్రాండ్ గా మారిపోయింది. మీటూ ఉద్యమంలో భాగంగా చిన్మయి తరచుగా తన గళం వినిపిస్తూ ఉంటుంది. మహిళలని అవమానించేలా చిన్న సంఘటన జరిగినా చిన్మయి ఊరుకోవడం లేదు.
మీటూ ఉద్యమం చెలరేగినప్పుడు చిన్మయి తమిళ లిరిసిస్ట్ వైరముత్తుపై తీవ్రమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైరాముత్తు తనని లైంగికంగా వేధించినట్లు చిన్మయి సంచలన ఆరోపణలు చేసింది. అప్పటి నుంచి ఈ వివాదం రగులుతూనే ఉంది. వైరముత్తుపై చిన్మయి అలుపెరగని పోరాటం చేస్తూనే ఉంది. అయితే మహిళల ఆత్మగౌరవానికి సంబంధించిన విషయాల్లో సైతం చిన్మయి వెనకడుగు వేయడం లేదు.
ఇటీవల సీనియర్ నటి అన్నపూర్ణమ్మ మహిళలని ఉద్దేశించి వ్యాఖ్యలపై చిన్మయి ఘాటుగా కౌంటర్ వేసింది. ఫెమినిస్ట్ గా చిన్మయి అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలని ఖండించవచ్చు. అందులో తప్పు లేదు. అర్థరాత్రి అమ్మాయిలకు బయట పని ఏంటి అనే విధంగా అన్నపూర్ణమ్మ ప్రశ్నించారు. ఇటీవల అమ్మాయిలు చాలా పొట్టిగా బట్టలు వేసుకుంటున్నారని.. అందుకే చూసే వాళ్ళు కామెంట్స్ చేస్తున్నారని అన్నపూర్ణమ్మ అన్నారు.
ఎప్పుడూ తప్పు ఒకవైపే ఉండదు.. మనది కూడా ఉంటుందని తెలిపారు. అయితే ఆమె వ్యాఖ్యలని చిన్మయి ఖండించకుండా వెటకారం చేసింది. ఇలాంటి వాళ్ళని చూస్తే ఇండియాలో అమ్మాయిలుగా పుట్టడం ఎంత ఖర్మో అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడేసింది. అమ్మాయిలకు అర్థ రాత్రి బయట పని ఏముంటుందని అన్నపూర్ణమ్మ ప్రశ్నిస్తే.. దానిని వక్రీకరిస్తూ చిన్మయి.. అంటే ఆమె మాటల ప్రకారం మహిళలు మెడికల్ ఎమెర్జన్సీ టైం లో కూడా బయటకి వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలా అని ప్రశ్నించింది.
మహిళలు నర్సులుగా రాత్రి వేళల్లో డ్యూటీలు చేయకూడదా అని చిన్మయి వెటకారం చేసింది. గ్రామాల్లో మహిళలు బాత్రూమ్ లేకపోతే రాత్రి వేళల్లో ఆ అవసరం కోసం బయట వెళ్లకూడదా అని ఇంకా వెటకారంగా ప్రశ్నించింది. చిన్మయి ఇంతలా అన్నపూర్ణమ్మ మాటలని వక్రీకరించి వెటకారం చేస్తుండడంతో నెటిజన్లు దుమ్మెత్తి పోస్తున్నారు.
అసలు ఆమె మెడికల్ ఎమర్జనీ, రాత్రి వేళలో చేసే ఇతర వృత్తుల గురించి మాట్లాడిందా.. అన్నపూర్ణమ్మ జనరల్ సినారియోలో మహిళలు రాత్రి వేళల్లో బయట ఎందుకు ఉండడం అని ప్రశ్నించారు. ఆమె ప్రశ్నించింది.. పబ్బుల్లో అర్థరాత్రి దాకా హంగామా చేసే అమ్మాయిల గురించి మాత్రమే. మెడికల్ ఎమర్జన్సీ టైంలో ఇల్లు విడచి వెళ్ళకూడదు అని ఎవరూ చెప్పరు. నీ మీద గౌరవం పోయింది చిన్మయి.. ఇండియా లాంటి దేశంలో పుట్టడం ఖర్మ అంటావా అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.