MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆమె వంద మంది శ్రేయా ఘోషల్ లను బీట్ చేస్తుంది.. థగ్ లైఫ్ లో పాట పాడిన సింగర్ ధీపై చిన్మయి కామెంట్స్

ఆమె వంద మంది శ్రేయా ఘోషల్ లను బీట్ చేస్తుంది.. థగ్ లైఫ్ లో పాట పాడిన సింగర్ ధీపై చిన్మయి కామెంట్స్

థగ్ లైఫ్ లో పాట గురించి తనను, గాయని ధీని పోల్చడం బాధ కలిగించిందని చిన్మయి తెలిపారు. ధీపై చిన్మయి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jun 02 2025, 09:15 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ముత్త మలై పాట వివాదం
Image Credit : Social Media

ముత్త మలై పాట వివాదం

‘థగ్ లైఫ్’ చిత్రంలోని ముత్త మలై  పాటను గాయని ధీ (ధీక్షిత) పాడారు. ఆడియో లాంచ్ లో ఇదే పాటను చిన్మయి పాడారు. దీంతో ఇద్దరి గాత్రాన్ని పోల్చుతూ నెటిజన్లు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో చిన్మయి వివరణ ఇచ్చారు.

26
భారీ అంచనాలతో ‘థగ్ లైఫ్’ చిత్రం
Image Credit : Twitter

భారీ అంచనాలతో ‘థగ్ లైఫ్’ చిత్రం

ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో కమల్, సింబు, త్రిష, జోజు జార్జ్, అశోక్ సెల్వన్, నాజర్ వంటి భారీ తారాగణం నటించిన చిత్రం ‘థగ్ లైఫ్’. ఈ చిత్రాన్ని మద్రాస్ టాకీస్, రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రానికి ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

Related Articles

Related image1
స్టార్ హీరోతో డేటింగ్ ? పర్సనల్ లైఫ్ పై హరిహర వీరమల్లు హీరోయిన్ సమాధానం ఇదే
Related image2
అమ్మ చనిపోయినంత బాధ కలిగింది, చిరంజీవి మూవీపై క్రేజీ కమెడియన్ తీవ్ర వ్యాఖ్యలు.. మెగాస్టార్ ఏం చేశారో తెలుసా
36
‘థగ్ లైఫ్’ ఆడియో లాంచ్ లో పాడిన చిన్మయి
Image Credit : Google

‘థగ్ లైఫ్’ ఆడియో లాంచ్ లో పాడిన చిన్మయి

ఈ చిత్రం జూన్ 5న విడుదల కానుంది. ట్రైలర్ కు మంచి ఆదరణ లభిస్తుండగా, ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇటీవల చిత్రం ఆడియో లాంచ్ వేడుక ఘనంగా జరిగింది. చిత్రంలోని “ముత్త మలై..” పాటను చిన్మయి వేదికపై పాడారు. ఆ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.

46
చిన్మయి పాటే బాగుంది అంటూ..
Image Credit : Google

చిన్మయి పాటే బాగుంది అంటూ..

తెలుగు, హిందీ వెర్షన్లలో చిన్మయి పాడిన ఈ పాటను తమిళంలో ధీ పాడారు. ధీ పాడిన పాట కంటే చిన్మయి పాడిన వెర్షన్ బాగుందని, మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుందని అభిమానులు ఇద్దరినీ పోల్చి వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ఇది తప్పు అని చిన్మయి వివరణ ఇచ్చారు.

56
ధీకి క్షమాపణ చెప్పిన చిన్మయి
Image Credit : Asianet News

ధీకి క్షమాపణ చెప్పిన చిన్మయి

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన చిన్మయి, తనను, దీని పోల్చి మాట్లాడటం బాధ కలిగించిందని అన్నారు. నేను పాడిన పాటకు ఇంతటి ఆదరణ లభిస్తుందని అనుకోలేదు. ఆ రోజు ధీ ఆడియో లాంచ్ కి రాలేకపోయింది. అందుకే ఆ పాటను నేను వేదికపై పాడాను. నా పని నేను చేశాను. గాయని దీకి ప్రత్యేకమైన గాత్రం ఉంది. ఈ పాటపై అనుకోని విధంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నందుకు చిన్మయి.. ధీకి క్షమాపణ చెప్పింది.

66
ధీ గొప్ప గాయని అవుతుంది - చిన్మయి
Image Credit : Google

ధీ గొప్ప గాయని అవుతుంది - చిన్మయి

ఒక కళాకారిణిగా ఆమె పాటను నేను గౌరవిస్తాను. 20 ఏళ్ల వయసులో నేను ఇలా పాడలేదు. గాత్ర నైపుణ్యం సాధించడానికి నా అనుభవం కూడా కారణం. ఇది నాకు, దీకి మధ్య పోటీ కాదు. ఆమె వర్ధమాన గాయని. 15 ఏళ్ల తర్వాత ఆమె 100 చిన్మయిలను, 100 శ్రేయ ఘోషల్ లను మించిపోతుంది. ఆమెకు ప్రత్యేక స్థానం ఉంటుంది. మమ్మల్ని పోల్చడం అనవసరం” అని అన్నారు.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ కు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ముగ్గురు ప్రాణ స్నేహితులు ఎవరో తెలుసా? వారితో అనుబంధం ఎలా?
Recommended image2
Gunde Ninda Gudi Gantalu: రోహిణీని ముప్పు తిప్పలు పెట్టిన బాలు, గుణ కుట్రలో ఇరుక్కుపోయిన శివ
Recommended image3
RX100 హీరో కార్తికేయ ఏమైపోయాడు..? ఎక్కడున్నాడు? ఏం చేస్తున్నాడు?
Related Stories
Recommended image1
స్టార్ హీరోతో డేటింగ్ ? పర్సనల్ లైఫ్ పై హరిహర వీరమల్లు హీరోయిన్ సమాధానం ఇదే
Recommended image2
అమ్మ చనిపోయినంత బాధ కలిగింది, చిరంజీవి మూవీపై క్రేజీ కమెడియన్ తీవ్ర వ్యాఖ్యలు.. మెగాస్టార్ ఏం చేశారో తెలుసా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved