- Home
- Entertainment
- 'ఈ నగరానికి ఏమైంది..' యాడ్ లో నటించిన చిన్నారి లేటెస్ట్ లుక్ వైరల్.. త్వరలో టాలీవుడ్ లో హీరోయిన్ గా..
'ఈ నగరానికి ఏమైంది..' యాడ్ లో నటించిన చిన్నారి లేటెస్ట్ లుక్ వైరల్.. త్వరలో టాలీవుడ్ లో హీరోయిన్ గా..
ఈ నగరానికి ఏమైంది ఒకవైపు నుసి మరోవైపు పొగ.. ఎవ్వరూ నోరు మెదపరేంటి.. అంటూ వచ్చే యాడ్ లో తండ్రి పక్కన అమాయకంగా కూర్చునే చిన్నారి గుర్తుందిగా. ఆ చిన్నారి పేరు సిమ్రాన్ నటేకర్.

ఎంతటి భారీ చిత్రం అయినా, స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరే ముందు ఆ చిన్నారి కనిపిస్తేనే సినిమా మొదలవుతుంది. ప్రతి ఒక్క సినీ ప్రేక్షకుడు అన్ని సినిమాలు చూడకపోవచ్చు కానీ.. వెండి తెరపై ఆ పాపని పలుమార్లు చూసి ఉంటారు. ఈ రేంజ్ లో చెబుతున్నారు ఎవరా చిన్నారి అనుకుంటున్నారా.. సినిమా ప్రారంభం అయ్యే ముందు ధూమపానం గురించి వచ్చే యాడ్ అందరికి తెలుసు.
ఈ నగరానికి ఏమైంది ఒకవైపు నుసి మరోవైపు పొగ.. ఎవ్వరూ నోరు మెదపరేంటి.. అంటూ వచ్చే యాడ్ లో తండ్రి పక్కన అమాయకంగా కూర్చునే చిన్నారి గుర్తుందిగా. ఆ చిన్నారి పేరు సిమ్రాన్ నటేకర్. ఆ చిన్నారి సిమ్రాన్ నటేకర్ ఇప్పుడు పాతికేళ్ల పెద్ద పాప అయింది. వరుసగా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు కూడా చేస్తోంది.
1997లో సిమ్రాన్ నటేకర్ ముంబైలో జన్మించింది. ఈ నగరానికి ఏమైంది యాడ్ తర్వాత నటేకర్ దాదాపు 150 యాడ్స్ లో అవకాశం దక్కించుకుంది. చిన్నారి పెళ్లికూతురు సీరియల్ లో సైతం నటించింది. క్రిష్ 3 లో చైల్డ్ ఆర్టిస్ట్ గా రాణించింది.
అయితే ఇప్పుడు వయసు పెరగడంతో సిమ్రాన్ హీరోయిన్ గా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. సోషల్ మీడియాలో ఆమె లేటెస్ట్ ఫొటోస్ చూస్తే కుర్రాళ్ళ మతి పోతుంది. అంత హాట్ గా క్లీవేజ్ అందాలతో సిమ్రాన్ మెరుపులు మెరిపిస్తోంది. సిల్వర్ స్క్రీన్ పై గ్లామర్ మెరుపులకు రెడీ అంటూ సంకేతాలు పంపుతోంది.
తాజా సమాచారం మేరకు సిమ్రాన్ టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక సమాచారం లేదు కానీ ఓ నిర్మాణ సంస్థ ఆడిషన్స్ లో సిమ్రాన్ హీరోయిన్ గా ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. సౌత్ లో ఆఫర్స్ కోసం సిమ్రాన్ నటేకర్ వరుసగా ఆడిషన్స్ లో పాల్గొంటూ ఫిలిం మేకర్స్ ని మెప్పించే పనిలో ఉందట.
ఎట్టకేలకు ఆమె ప్రయత్నం ఫలించినట్లు తెలుస్తోంది. చైల్డ్ ఆర్టిస్ట్ గా, యాడ్స్ చేసిన నటిగా అనుభవం ఉంది కాబట్టి ఫిలిం మేకర్స్ ఆమెకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా సిమ్రాన్ నటేకర్ త్వరలో హీరోయిన్ గా అలరించడం ఖాయం అంటూ ప్రచారం జరుగుతోంది.