నా కోసం శింబు అన్ని పక్కన పెట్టేశాడు, చికిత్స కోసం యూఎస్ వెళుతూ రాజేందర్ ఎమోషనల్..
ప్రముఖ తమిళ నటుడు, నిర్మాత టి రాజేందర్ ఇటీవల అనారోగ్యం కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే.

ప్రముఖ తమిళ నటుడు, నిర్మాత టి రాజేందర్ ఇటీవల అనారోగ్యం కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. రాజేందర్ తమిళ స్టార్ హీరో శింబు తండ్రి. రాజేందర్ గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. రాజేందర్ చెన్నై ఆసుపత్రిలో వైద్యం తీసుకుంటున్నారు.
మేరకు మెరుగైన చికిత్స కోసం యుఎస్ వెళ్లాలని వైద్యులు సూచించారట. దీనితో రాజేందర్ నేడు అమెరికా బయలు దేరారు. విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. తన ఆరోగ్యం గురించి ప్రార్థిస్తున్న వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
రాజేందర్ తన కొడుకు శింబు గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. నేను నా కొడుకు శింబు కోసమే అమెరికాకు వైద్యం కోసం వెళుతున్నా. శింబు నా కోసం అన్ని పక్కన పెట్టి అమెరికాలో గత కొన్ని రోజులుగా ఉంటున్నాడు. నా వైద్యానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నాడు.
నా కోసం శింబు తన సినిమా షూటింగ్స్, ఇతర కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకున్నాడు. శింబు గొప్ప నటుడు మాత్రమే కాదు.. మంచి మనసున్న కొడుకు, వ్యక్తి అని రాజేందర్ మీడియాతో తెలిపారు.
simbu
ఇదిలా ఉండగా రాజేందర్ ని ఇటీవల కమల్ హాసన్ పరామర్శించారు. ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. రాజేందర్ త్వరగా కోలుకోవాలని కమల్ కోరారు. అలాగే రాజేందర్ ఆరోగ్యం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఆరా తీసినట్లు తెలుస్తోంది.
దీనితో రాజేందర్.. కమల్ హాసన్ కి, సీఎం స్టాలిన్ కి కృతజ్ఞతలు తెలిపారు. అమెరికాలో రాజేందర్ కి దాదాపు రెండు నెలల పాటు చికిత్స జరగనున్నట్లు తెలుస్తోంది. దీనితో శింబు యుఎస్ వెళ్లి కావాల్సిన ఏర్పాట్లన్నీ తన తండ్రి కోసం పూర్తి చేశాడు.