- Home
- Entertainment
- సైమా అవార్డ్స్ 2023.. రాంచరణ్, ఎన్టీఆర్ కి అంత ఈజీ కాదు..ఉత్తమ నటుల రేసులో ఎవరెవరంటే, మజా ఇచ్చే పోటీ
సైమా అవార్డ్స్ 2023.. రాంచరణ్, ఎన్టీఆర్ కి అంత ఈజీ కాదు..ఉత్తమ నటుల రేసులో ఎవరెవరంటే, మజా ఇచ్చే పోటీ
ప్రతి ఏడాది కనుల పండుగలా జరిగే సౌత్ సినీ వేడుక సైమా అవార్డ్స్ 2023కి రంగం సిద్ధం అవుతోంది. 11 వ సైమా వేడుకలు దుబాయ్ లో సెప్టెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

ప్రతి ఏడాది కనుల పండుగలా జరిగే సౌత్ సినీ వేడుక సైమా అవార్డ్స్ 2023కి రంగం సిద్ధం అవుతోంది. 11 వ సైమా వేడుకలు దుబాయ్ లో సెప్టెంబర్ 15, 16 తేదీల్లో నిర్వహించబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఈ వేడుకల్లో రానా, మృణాల్ ఠాకూర్ హోస్ట్ లుగా వ్యవహరించబోతున్నట్లు కూడా తెలుస్తోంది. ఇప్పుడు నామినేషన్స్ రచ్చ కూడా షురూ అయింది. సైమా సంస్థ ఉత్తమ దర్శకులు, ఉత్తమ నటులు ఇలా వివిధ విభాగాల్లో ప్రతి దక్షణాది చిత్ర పరిశ్రమల నుంచి నామినేషన్స్ ప్రారంభించింది.
తెలుగులో ఉత్తమ నటుల జాబితాలో అయితే రచ్చ మాములుగా లేదనే చెప్పాలి. బెస్ట్ యాక్టర్ లీడింగ్ రోల్ తెలుగు విభాగంలో మొత్తం ఆరుగురు నటులు పోటీ పడుతున్నారు. అంతా ఊహించినట్లుగానే ఈ లిస్ట్ లో మెగా పవర్ స్టార్ రాంచరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరూ ఆర్ఆర్ఆర్ చిత్రానికి గాను నామినేట్ అయ్యారు. అయితే అవార్డు గెలవడం వీరిద్దరికి అంత సులభం కాదనే చెప్పాలి.
ఆర్ఆర్ఆర్ హీరోలిద్దరికి బలమైన పోటీ ఇచ్చే విధంగా మరో నలుగురు నటులు నామినేట్ అయ్యారు. ఆ స్టార్లు ఎవరెవరంటే.. అడివి శేష్- మేజర్, దుల్కర్ సల్మాన్ - సీతారామన్, నిఖిల్ - కార్తికేయ2 , సిద్ధూ జొన్నలగడ్డ - డీజే టిల్లు నామినేషన్స్ లో ఉన్నారు.
రాంచరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఆర్ఆర్ఆర్ చిత్రంలో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ వీరికి ఏమాత్రం తీసిపోని విధంగా మేజర్ చిత్రంలో అడివి శేష్.. సీతారామన్ లో దుల్కర్ సల్మాన్ ఎమోషనల్ అండ్ పవర్ ఫుల్ పెర్ఫామెన్స్ తో మెప్పించారు. ఈ ఇద్దరు హీరోలకు దేశభక్తి చిత్రాలనే అడ్వాంటేజ్ కూడా ఉంది. వీళ్ళిద్దరూ ఆయా చిత్రాల్లో దేశ రక్షణలో ప్రాణాలు వదిలిన సైనికులుగా నటించారు.
సో అవార్డు గెలవడం చరణ్, ఎన్టీఆర్ కి అంత సులభం కాకపోవచ్చు. అడివి శేష్, దుల్కర్ సల్మాన్ లలో ఎవరికి అవార్డు వచ్చినా వాళ్ళకి ఆ అర్హత ఉందనే అభిప్రాయం ఆడియన్స్ లో ఉంది. చరణ్, ఎన్టీఆర్ ఇద్దరికీ అర్హత ఉంది. కానీ వీళ్ళిద్దరిలో ఎవరికీ అవార్డు దక్కినా ఫ్యాన్స్ లో పెద్ద రచ్చ మాత్రం తప్పదని అంటున్నారు.
ఇదిలా ఉండగా నిఖిల్, సిద్దు జొన్నలగడ్డలని కూడా విస్మరించడానికి లేదు. ఏది ఏమైనా ఈసారి సైమా అవార్డ్స్ లో బెస్ట్ యాక్టర్ లీడింగ్ రోల్ కేటగిరిలో మజా వచ్చే పోటీ ఉందని అంటున్నారు. ఈ మేరకు సైమా సంస్థ నామినేషన్స్ లో ఉన్న వారిని ప్రకటిస్తూ మీ అభిమాన నటుడికి ఓట్ చేయమని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.. మరి మీ ఓటు ఎవరికి ?