- Home
- Entertainment
- Tillu Square Trailer Date : ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ వచ్చేస్తోంది.. వైరల్ గా అనుపమా పరమేశ్వరన్ స్టిల్!
Tillu Square Trailer Date : ‘టిల్లు స్క్వేర్’ ట్రైలర్ వచ్చేస్తోంది.. వైరల్ గా అనుపమా పరమేశ్వరన్ స్టిల్!
సిద్ధూ జొన్నలగడ్డ - అనుపమా పరమేశ్వరన్ Anupama Parameswaran జంటగా నటించిన ‘టిల్లు స్క్వేర్’ Tillu Square నుంచి బిగ్ అప్డేట్ అందింది. అనుపమా స్టిల్ నెట్టింట వైరల్ గా మారింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
‘డీజే టిల్లు’.. రెండేళ్ల కింద చిన్న సినిమాగా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ Jonnalagadda, నేహా శెట్టి జంటగా అలరించిన విషయం తెలిసిందే. చిత్రంలోని డైలాగ్స్, సాంగ్స్, టిల్లు యాటిట్యూడ్, కలెక్షన్లు అన్నీ అదుర్స్ అనిపించాయి.
దీంతో వెంటనే సీక్వెల్ ను కూడా అనౌన్స్ చేశారు. ‘టిల్లు స్క్వేర్’ Tillu Square టైటిల్ తో రాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ డేట్ ను కూడా ప్రకటించి ప్రమోషన్స్ ను షురూ చేశారు. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ బిగ్ అప్డేట్ అందించారు.
రేపు వాలెంటైన్స్ డే సందర్భంగా Tillu Square Trailer ను విడుదల చేయబోతున్నట్టు కొద్దిసేపటి కింద ప్రకటించారు. ఫిబ్రవరి 14న థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేయబోతున్నారు. రేపు సాయంత్రం 5.04 గంటలకు మూసాపేట్ లోని శ్రీరాములు థియేటర్ లో ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు.
దీంతో ఆడియెన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ట్రైలర్ కోసం వేచి చేస్తున్నారు. అయితే ట్రైలర్ అప్డేట్ తో విడుదల చేసిన పోస్టర్ ఇప్పుడు హాట్ టాపిక్ గ్గా మారింది. పోస్టర్ కోసం అనుపమా ఇచ్చిన స్టిల్ అందరి అటెన్షన్ ను డ్రా చేస్తోంది. ఈ సీక్వెల్ లో సిద్ధూకు జోడీగా కేరళ కుట్టి అనపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటిస్తున్న విషయం తెలిసిందే.
ఈ మూవీలో అనుపమా రొమాంటిక్ డోస్ ను పెంచేసినట్టు కనిపిస్తోంది. మొదటి నుంచి వస్తున్న పోస్టర్లలో అనుపమా లుక్ టూ హాట్ గా ఉంటోంది. పోస్టర్ల కోసం అనుపమా ఇస్తున్న స్టిల్స్ కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. యంగ్ బ్యూటీ మునుపెన్నడూ లేనివిధంగా అందాలను ఆరబోస్తుండటంతో అవాక్కవుతున్నారు.
పోస్టర్లతోనే అనుపమా ఇంతలా ఆకట్టుకుంటుందంటే.. ఇంక సినిమాలో ఎలాంటి పెర్ఫామెన్స్ ఇచ్చిందోనని అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ప్రస్తుతం ట్రైలర్ పై ఆసక్తినెలకొంది. ఈ చిత్రం మార్చి 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. థమన్, రామ్ మిరియాల సంగీతం అందిస్తున్నారు.