- Home
- Entertainment
- Kriti Shetty:లంగా ఓణీలో వచ్చి గుండెల్లో లంగరేసిన ఉప్పెన బేబమ్మ... ట్రెడిషనల్ వేర్ లో కూడా టెంప్ట్ చేస్తుందిగా
Kriti Shetty:లంగా ఓణీలో వచ్చి గుండెల్లో లంగరేసిన ఉప్పెన బేబమ్మ... ట్రెడిషనల్ వేర్ లో కూడా టెంప్ట్ చేస్తుందిగా
అందం, అభినయం, అదృష్టం ఇది రేర్ కాంబినేషన్. ఈ మూడు ఉంటే చాలు ఓవర్ నైట్ స్టార్ అయిపోవచ్చు. సమంత, రష్మిక (Rashmika Mandanna)లాంటి హీరోయిన్స్ ఈ కోవకే చెందుతారు. తాజాగా ఈ లిస్ట్ లో చేరింది ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి. పాతికేళ్లు కూడా నిండకుండానే కృతి టాలీవుడ్ ని ఊపేస్తుంది.

మొదటి చిత్రంతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కృతి (Kriti shetty)దెబ్బకు స్టార్డం తెచ్చుకుంది. ఉప్పెన విజయంలో సింహ భాగం కృతి శెట్టిదే. ఏజ్ తగ్గ పాత్ర చేసిన కృతి చాలా సహజంగా అనిపించింది. చేపకళ్ళు, చొట్ట బుగ్గలకు తోడు మెస్మరైజ్ చేసే ముఖకవళికలు కుర్రకారుకు నిద్ర లేకుండా చేశాయి.
చిన్న చిత్రంగా విడుదలైన ఉప్పెన స్టార్ హీరో మూవీ రేంజ్ వసూళ్లు సాధించి ట్రేడ్ వర్గాలను షాక్ కి గురిచేసింది. ఉప్పెన వరల్డ్ వైడ్ గా వంద కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టడం ఊహించని పరిణామం. ఉప్పెన విజయం నేపథ్యంలో కృతి శెట్టికి టాలీవుడ్ లో అవకాశాలు వరుస కట్టాయి.
డిసెంబర్ 24న కృతి శెట్టి నటించిన శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy)విడుదలైంది. ఈ మూవీలో నాని డైరెక్టర్ పాత్ర చేస్తుండగా.. ఆయన మూవీలో నటిగా కృతి బోల్డ్ రోల్ చేస్తున్నారు.
ట్రైలర్లో ముద్దు సన్నివేశాలతో పాటు, దమ్ము కొడుతూ కనిపించి... వామ్మో అనిపించింది. ఉప్పెన చిత్రంలో పడవలో రెచ్చిపోయి రొమాన్స్ చేసిన కృతి.. శ్యామ్ సింగరాయ్ మూవీలో నాని(Nani)తో కూడా అలాంటి సన్నివేశాల్లో నటించినట్లు అర్థమవుతుంది.
శ్యామ్ సింగరాయ్ మూవీకి ట్విట్టర్ లో పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. శ్యామ్ సింగరాయ్ విజయం సాధించిన నేపథ్యంలో కృతి ఖాతాలో మరిన్ని చిత్రాలు వచ్చి చేరే అవకాశం కలదు. శ్యామ్ సింగరాయ్ మూవీలో మరో హీరోయిన్ గా సాయి పల్లవి నటించారు.
ఇక నెక్స్ట్ మూవీలో కృతి పల్లెటూరు అమ్మాయి పాత్రలో కనువిందు చేయనున్నారు. నాగార్జున-నాగ చైతన్యల మల్టీస్టారర్ బంగార్రాజు చిత్రంలో కృతి నాగలక్ష్మి అనే పాత్ర చేస్తున్నారు. బంగార్రాజు మూవీలో కృతి పాత్రకు చాలా వెయిట్ ఉన్నట్లు ప్రోమోల ద్వారా అర్థమవుతుంది.
అలాగే హీరో సుధీర్ కి జంటగా ఓ చిత్రం చేస్తున్న కృతి, రామ్-లింగుస్వామి కాంబినేషన్ లో రూపొందుతున్న బైలింగ్వెల్ మూవీలో కూడా అవకాశం దక్కించుకున్నారు.
ఈ రెండు ప్రాజెక్ట్స్ చిత్రీకరణ దశలో ఉన్నాయి. వరుస సినిమాలతో ఫిదా చేస్తున్న కృతి... ఫోటో షూట్స్ తో మరోవైపు ఫ్యాన్స్ ని పండగ చేసుకోమంటున్నారు. తాజాగా పట్టు లంగా ఓణీలో పద్దతిగా దర్శనమిచ్చింది. పదహారణాల తెలుగు పడుచులా ఉన్న కృతి ట్రెడిషనల్ లుక్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.