శాంతనుతో ప్రేమకి మూలం ఏంటో బయటపెట్టిన శృతి హాసన్.. బోరింగ్ ప్రశ్నలు అడగొద్దంటూ స్ట్రాంగ్ కౌంటర్
శృతి హాసన్ హీరోయిన్ గా బిజీగా ఉంది. మరోవైపు ప్రియుడు శాంతనుతో ప్రేమలోనూ బిజీగా ఉంది. అయితే ఆ ప్రేమకి మూలం ఎక్కడుందో చెప్పింది శృతి హాసన్. ఆసక్తికర విషయాలను బయటపెట్టింది.
స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ తనయ శృతి హాసన్.. ఈ ఏడాది ఒకేసారి రెండు హిట్లు అందుకుంది. సంక్రాంతికి ఆమె చిరంజీవితో `వాల్తేర్ వీరయ్య`, బాలకృష్ణతో `వీరసింహారెడ్డి` చిత్రాల్లో నటించింది. ఈ ఇద్దరితోనూ మొదటిసారి యాక్ట్ చేసింది. రెండు బ్లాక్ బస్టర్స్ ని అందుకుంది. సక్సెస్ జోరులో ఉన్న ఈ బ్యూటీ ఇప్పుడు మరో రెండు సినిమాలతో వచ్చేందుకు రెడీ అవుతుంది.
Shruti Haasan
అయితే సినిమాలే కాదు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది శృతి హాసన్. ఓ వైపు గ్లామర్ ఫోటోలను పంచుకుంటుంది. నెటిజన్లకి ట్రీట్ ఇస్తూ అలరిస్తుంది. తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటుంది. అలా నిత్యం ఫ్యాన్స్ కి టచ్‌లో ఉంటుంది. అంతేకాదు వారితోనూ రెగ్యూలర్‌గా ఛాట్ చేస్తుందీ బ్యూటీ. ఓపెన్‌గా అన్ని విషయాలను పంచుకుంటుంది.
తాజాగా ఈ బ్యూటీ క్రేజీ విషయాలను బయటపెట్టింది. ముఖ్యంగా తన లవ్ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయ్యిందో తెలిపింది. ఎలా స్టార్ట్ అయ్యింది, దానికి మూలం ఎక్కడుందో వెళ్లడించింది. పెళ్లిపై కూడా రియాక్ట్ అయ్యింది. కానీ షాకింగ్ కౌంటర్ ఇచ్చింది. ప్రియుడు శాంతను ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం అయ్యాడట. ఆయన డూడుల్ ఆర్టిస్టు అని, ఆ ఆర్ట్ నచ్చి అతన్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేసిందట.
అలా ఇన్‌స్టా ఛాట్‌లో పరిచయం కాస్త రెగ్యూలర్ డిస్కషన్‌గా మారి అది కాస్త ప్రేమగా మారిందని చెప్పింది. తమ ప్రేమ ఇన్‌స్టాగ్రామ్‌లో పుట్టిందని చెప్పింది. ఈసందర్భంగా పెళ్లెప్పుడనే ప్రశ్న కూడా ఎదురయ్యింది. దీనికి శృతి స్పందిస్తూ, దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ఇలాంటి బోరింగ్ ప్రశ్నలు అడగొద్దంటూ షాకిచ్చింది.
మరోవైపు తాను హీరోయిన్ కాకపోతే ఏం చేసేదో కూడా చెప్పింది. తాను హీరోయిన్ కాకపోతే సేల్స్ గర్ల్ అయ్యేదట. సేల్స్ గర్ల్ జాబ్ అంటే చాలా ఇష్టమని, అప్పట్లో షాకింగ్ చేసినప్పుడు ఎక్కువగా అందులో పనిచేసేవారితోనే మాట్లాడేదాన్ని అని తెలిపింది. సినిమాల్లోకి వచ్చాక ఆ ఆలోచన మారిపోయిందని చెప్పింది.
టాటూలంటే తనకు చాలా ఇష్టమట. ఓ రకంగా చెప్పాలంటే పిచ్చి అని పేర్కొంది. 19ఏళ్ల వయసులో మొదటిసారి టాటూ వేయించుకుందట. ఒకవేళ నటిని కాకపోతే ముఖం మీద కాకుండా బాడీ మొత్తం టాటూలతో నింపుకునేదాన్ని అని పేర్కొంది. మరోవైపు విహారయాత్రలకు సంబంధించి లండన్ అంటే ఇష్టమట. తాను మొదటగా నోకియా ఫోన్ వాడినట్టు చెప్పింది శృతి హాసన్. తాను చాలా సార్లు ఏడ్చానని, కానీ అందరిలో ఏడవడం ఇష్టం ఉండదని పేర్కొంది.
ప్రస్తుతం ఈ బ్యూటీ `సలార్`లో ప్రభాస్‌తో కలిసి నటిస్తుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 28న విడుదల కావాల్సి ఉండగా, వాయిదా పడింది. దీంతోపాటు నానితో కలిసి `హాయ్ నాన్న` చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీ డిసెంబర్‌లో క్రిస్మస్ కానుకగా రిలీజ్ కానుంది. మరోవైపు శాంతను హజారికాతో ప్రేమలో మునిగితేలుతుందీ బ్యూటీ. ఓ రకంగా ఈ ఇద్దరు సహజీవనం చేస్తున్నారని చెప్పొచ్చు.