నన్ను ఐరన్ లెగ్ అన్నారు, మరి ఆ హీరో సంగతేంటి.. శృతి హాసన్ దిమ్మతిరిగే కౌంటర్
శృతి హాసన్ తనపై వచ్చిన ఐరన్ లెగ్ విమర్శలపై ఊహించని విధంగా స్పందించింది. ఓ హీరోపై ఆమె పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

శృతి హాసన్ తెలుగు చిత్రాలు
శృతి హాసన్ త్వరలో సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో శృతి హాసన్ ఈ చిత్రం కోసం జోరుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. శృతి హాసన్ తెలుగులో పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రాంచరణ్ లాంటి అగ్ర హీరోలతో నటించి సూపర్ హిట్ చిత్రాలు అందుకుంది.
KNOW
ఐరన్ లెగ్ అని విమర్శలు
శృతి హాసన్ కి గబ్బర్ సింగ్ చిత్రంలో నటించే వరకు హిట్స్ లేవు. దీనితో ఆమెని ఐరన్ లెగ్ అని పిలవడం ప్రారంభించారు. ఆ కామెంట్స్ తో శృతి హాసన్ బాగా హర్ట్ అయింది. గబ్బర్ సింగ్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఆమె కెరీర్ పూర్తిగా మారిపోయింది. తాజాగా ఇంటర్వ్యూలో శృతి హాసన్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసింది.
ఆ హీరో సంగతేంటి
నేను నటించిన తొలి రెండు తెలుగు చిత్రాలు వర్కౌట్ కాలేదు. దీనితో నన్ను ఐరెన్ లెగ్ అని విమర్శించడం ప్రారంభించారు. కానీ వాళ్ళు రియలైజ్ కానీ విషయం ఏంటంటే ఆ రెండు చిత్రాల్లో హీరో ఒక్కరే. నన్ను ఐరెన్ లెగ్ అన్నారు సరే మరి ఆ హీరో సంగతేంటి అంటూ శృతి హాసన్ పరోక్షంగా కామెంట్స్ చేసింది. ఆ రెండు చిత్రాల హీరో ఎవరో కాదు సిద్దార్థ్. అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్ చిత్రాల్లో శృతి హాసన్ అతడికి హీరోయిన్ గా నటించింది. ఆ రెండు చిత్రాలే ఫ్లాప్ అయ్యాయి.
గబ్బర్ సింగ్ మూవీతో హిట్
ఆ తర్వాత నాకు పవన్ కళ్యాణ్ గారి గబ్బర్ సింగ్ చిత్రంలో అవకాశం వచ్చింది. ఆ మూవీ సూపర్ హిట్. నాకేమి ఐరెన్ లెగ్స్ లేవు, నా కాళ్ళని వదిలేయండి అని తాను అనుకున్నట్లు శృతి హాసన్ పేర్కొంది. అప్పటి నుంచి విమర్శలకు రియాక్ట్ కావడం ఆపేశానని శృతి హాసన్ తెలిపింది.
శృతి హాసన్ పర్సనల్ లైఫ్
ఇదిలా ఉండగా శృతి హాసన్ పర్సనల్ లైఫ్ వ్యవహారాలతో కూడా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల శృతి హాసన్ ఇటీవల తన ప్రియుడితో విడిపోయింది. పెళ్లి అంటేనే తన భయం వేస్తోందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో శృతి హాసన్ పేర్కొంది.