MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Shruti Haasan: నేను కమల్ హాసన్ కూతుర్ని కాదు.. చిన్నప్పటి సీక్రెట్ చెప్పిన శ్రుతి హాసన్

Shruti Haasan: నేను కమల్ హాసన్ కూతుర్ని కాదు.. చిన్నప్పటి సీక్రెట్ చెప్పిన శ్రుతి హాసన్

చెన్నైలో ఎక్కడ చూసినా  కమల్ హాసన్ మ్యానియా నడిచిన టైమ్ లో..  చిన్నప్పుడు తనకంటూ ఓ గుర్తింపు లేక ఇబ్బందిపడింది శ్రుతి హాసన్. ఈ విషయానికి సబంధించి ఒక ఆసక్తికరమైన సీక్రెట్ ను ఆమె  బయటపెట్టింది.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 21 2026, 05:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కమల్ కూతుర్ని కాదు అని చెప్పిన శ్రుతిహాసన్
Image Credit : X

కమల్ కూతుర్ని కాదు అని చెప్పిన శ్రుతిహాసన్

సినిమాల్లో 'లోకనాయకుడు' కమల్ హాసన్ రేంజ్ గురించి చెప్పక్కర్లేదు. అలాంటి స్టార్ ఇంట్లో పుడితే, పుట్టుకతోనే సెలబ్రిటీ స్టేటస్ వస్తుంది. కానీ, ప్రపంచమంతా కమల్ నటనను పొగుడుతుంటే, ఆయన సొంత కూతురు శ్రుతి హాసన్ మాత్రం 'నేను ఆయన కూతుర్ని కానే కాదు' అని అబద్ధం చెప్పి తిరిగారట! ఇదేంటి, సినిమా ట్విస్ట్ లా ఉందే అనుకుంటున్నారా? దాని వెనుక ఉన్న కథేంటో తెలుసా?

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
ఆల్-రౌండర్ శ్రుతి హాసన్
Image Credit : shrutzhaasan instagram

ఆల్-రౌండర్ శ్రుతి హాసన్

శ్రుతి హాసన్ ఈరోజు ఒక ఆల్-రౌండర్. నటి, గాయని, మ్యూజిక్ కంపోజర్.. ఇలా అన్నింటిలో తనదైన ముద్ర వేశారు. కానీ చిన్నప్పుడు 'కమల్ హాసన్ కూతురు' అనే గుర్తింపు ఆమెకు పెద్ద భారంగా ఉండేదట. ఎక్కడికి వెళ్లినా, 'అదిగో చూడు, కమల్ హాసన్ కూతురు' అని అందరూ వేలెత్తి చూపుతుంటే, చిన్నారి శ్రుతికి చాలా ఇబ్బందిగా అనిపించేదట. 'నాకూ ఓ పేరుంది, నేను శ్రుతిని' అని గట్టిగా అరవాలనిపించేదట.

Related Articles

Related image1
NTR Dragon: 4 నెలల్లో 15 కేజీలు.. ఎన్టీఆర్ చూసి భయంతో ఆయన ఫ్యామిలీ ఏం చేశారో తెలుసా?
Related image2
Roja: హైపర్ ఆది, రోజా కలిసిపోయారా? రాజకీయ విభేదాలపై ఫస్ట్ టైమ్ స్పందించిన జబర్దస్త్ స్టార్ కమెడియన్
35
చిన్నప్పుడే పెద్ద అబద్దం చెప్పిన హీరోయిన్
Image Credit : Instagram

చిన్నప్పుడే పెద్ద అబద్దం చెప్పిన హీరోయిన్

ఇలా నాన్న పేరు నుంచి తప్పించుకోవడానికి, శ్రుతి ఒక ఐడియా వేశారట. స్కూల్లో గానీ, బయట గానీ ఎవరైనా 'నువ్వు కమల్ హాసన్ కూతురివా?' అని అడిగితే, 'అయ్యయ్యో కానే కాదు, నా పేరు పూజ రామచంద్రన్, మా నాన్న డాక్టర్ రామచంద్రన్' అని చాలా కాన్ఫిడెంట్‌గా అబద్ధం చెప్పేదట.  ఇందులో ట్విస్ట్ ఏంటంటే, ఈ రామచంద్రన్ మరెవరో కాదు, శ్రుతి పంటి నొప్పికి ట్రీట్‌మెంట్ ఇచ్చిన డెంటిస్ట్! పాపం, ఆ డాక్టర్‌కు తాను శ్రుతి హాసన్‌కు తండ్రిగా ప్రమోషన్ పొందిన విషయం కూడా తెలిసి ఉండదు. తనకంటూ ఓ గుర్తింపు కోసం శ్రుతి పడిన ఈ పాట్లు, ఇప్పుడు వినడానికి ఫన్నీగా అనిపిస్తుంటాయి. 

45
స్వేచ్ఛగా ఉండలేకపోయిన శ్రుతి హాసన్..
Image Credit : Instagram

స్వేచ్ఛగా ఉండలేకపోయిన శ్రుతి హాసన్..

చెన్నైలో ఏ మూల చూసినా నాన్న కమల్ పోస్టర్లే. అక్కడ శ్రుతి స్వేచ్ఛగా ఉండలేకపోయింది. సారిక, కమల్ హాసన్ విడిపోయిన సమయంలో, శ్రుతి ముంబైకి షిఫ్ట్ అయ్యారు. 'అక్కడైనా నన్ను కమల్ కూతురు అని పదేపదే గుర్తుచేసి ఇబ్బంది పెట్టరు' అని అనుకునే అక్కడికి వెళ్లారు. అప్పటి నుంచి తన సొంత గుర్తింపు కోసం.. కష్టపడి పనిచేసి, ఈ రోజు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది శ్రుతీ హాసన్.

55
ప్రస్తుతం పూర్తిగా మారిపోయిన శ్రుతీ హాసన్..
Image Credit : Instagram

ప్రస్తుతం పూర్తిగా మారిపోయిన శ్రుతీ హాసన్..

ఒకప్పుడు నాన్న పేరు నుంచి పారిపోయిన శ్రుతి, ఇప్పుడు చాలా మారిపోయిందిు. 'ఇప్పుడు కమల్ హాసన్ పేరు లేని శ్రుతిని నేను ఊహించుకోలేను' అని చెబుతూ, నాన్నపై ఉన్న గౌరవాన్ని ప్రేమను చాటుకుంటోంది. . బహుశా కమల్ హాసన్, నటి సారికల పట్టుదల గుణమే పిల్లలకు కూడా వచ్చి ఉంటుంది. అందుకే, ఎలాంటి అండ లేకుండా, శ్రుతి హాసన్ ఈరోజు తనంతట తానుగా ఒక అద్భుతమైన కెరీర్‌ను నిర్మించుకుంది. మొత్తానికి, నాన్న నీడ నుంచి తప్పించుకోవడానికి 'పూజ రామచంద్రన్' అయిన శ్రుతి, ఈరోజు ఇండియా గర్వించదగ్గ స్టార్ నటిగా ఎదిగారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Peddi Movie: పెద్ది విధ్వంసం, రాంచరణ్ మూవీ ట్రైలర్ పై గ్లోబల్ బ్యూటీ రివ్యూ.. తగలబెట్టేసిందిగా
Recommended image2
Roja: హైపర్ ఆది, రోజా కలిసిపోయారా? రాజకీయ విభేదాలపై ఫస్ట్ టైమ్ స్పందించిన జబర్దస్త్ స్టార్ కమెడియన్
Recommended image3
Top 10 Heroes: విజయ్‌, ఎన్టీఆర్‌, అల్లు, చరణ్‌ డౌన్‌.. ధురంధర్‌ 2 హీరో జోరు.. నెం 1 ఎవరంటే?
Related Stories
Recommended image1
NTR Dragon: 4 నెలల్లో 15 కేజీలు.. ఎన్టీఆర్ చూసి భయంతో ఆయన ఫ్యామిలీ ఏం చేశారో తెలుసా?
Recommended image2
Roja: హైపర్ ఆది, రోజా కలిసిపోయారా? రాజకీయ విభేదాలపై ఫస్ట్ టైమ్ స్పందించిన జబర్దస్త్ స్టార్ కమెడియన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved