MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • Entertainment
  • Top 10 Heroes: పడిపోయిన అల్లు, చరణ్‌, ఎన్టీఆర్‌, విజయ్‌.. ధురంధర్‌ 2 హీరో సంచలనం.. నెం 1 ఎవరంటే?

Top 10 Heroes: పడిపోయిన అల్లు, చరణ్‌, ఎన్టీఆర్‌, విజయ్‌.. ధురంధర్‌ 2 హీరో సంచలనం.. నెం 1 ఎవరంటే?

ఇండియా టాప్‌ 10 హీరోల లిస్ట్ వచ్చింది. ఏప్రిల్‌ నెలలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్‌, ఎన్టీఆర్‌, విజయ్‌ పడిపోయారు. ధురంధర్‌ 2 హీరో దూసుకొచ్చారు.  

2 Min read
Author : Aithagoni Raju
Published : May 21 2026, 04:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
ఇండియా టాప్‌ 10 హీరోలు
Image Credit : bollywoodmdb

ఇండియా టాప్‌ 10 హీరోలు

ఓర్మాక్స్ మీడియా తాజాగా ఏప్రిల్‌ నెలకు సంబంధించి ఇండియా టాప్‌ 10 హీరోల లిస్ట్ ని విడుదల చేసింది. ఇందులో నెంబర్‌ వన్‌ మారలేదు, కానీ మిగిలిన స్థానాల్లో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. విజయ్‌ డౌన్‌ అయ్యారు. బన్నీ డౌన్‌ అయ్యాడు. తారక్‌ పడిపోయాడు. కానీ ధురంధర్‌ 2 హీరో రణ్‌వీర్‌ సింగ్‌దూసుకొచ్చారు. అజిత్‌ లిస్ట్ లోనే లేరు. చరణ్‌, మహేష్‌ బాబు సేఫ్‌గానే ఉన్నారని చెప్పొచ్చు. మరి ఓర్మాక్స్ మీడియా ప్రకటించిన ఇండియా టాప్‌ 10 హీరోల లిస్ట్ చూస్తే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
ప్రభాస్‌ నెంబర్‌ 1
Image Credit : Asianet News

ప్రభాస్‌ నెంబర్‌ 1

ఓర్మాక్స్ మీడియా ప్రకారం నెంబర్‌ వన్‌ స్థానంలో మార్పు లేదు. ఎప్పటిలాగానే ప్రభాస్‌ మొదటి స్థానంలో ఉన్నారు. తిరుగులేని తన ఇమేజ్‌ని చాటి చెప్పారు. తన సినిమాలు, ఫాలోయింగ్‌, క్రేజ్‌, మార్కెట్‌ పరంగా నిత్యం ఏదో రూపంలో ప్రభాస్‌పై చర్చ నడుస్తోన్న విషయం తెలిసిందే.

Related Articles

Related image1
Drishyam 3 Review: దృశ్యం 3 మూవీ రివ్యూ.. మోహన్‌లాల్‌, మీనా కలిసి నటించిన మూవీ ఎలా ఉందంటే?
Related image2
Balakrishna: బాలయ్య జాతకంలో అతి పెద్ద గండం, ఆదివారం ఆయన అస్సలు చేయకూడని పని ఏదో తెలుసా?
310
రెండో స్థానంలో షారూఖ్‌ ఖాన్‌
Image Credit : Red Chillies Entertainment

రెండో స్థానంలో షారూఖ్‌ ఖాన్‌

రెండో స్థానంలోకి షారూఖ్‌ ఖాన్‌ వచ్చారు. గతంలో ఆయన మూడు, నాల్గో స్థానాల్లో ఉండేవారు. కానీ ఈసారి సడెన్‌గా పుంజుకున్నారు. విజయ్‌కి, అల్లు అర్జున్‌కి షాకిస్తూ రెండో స్థానంలోకి వచ్చారు. షారూఖ్‌ ప్రస్తుతం `కింగ్‌` అనే చిత్రంలో నటిస్తున్నారు.

410
మూడో స్థానంలో అల్లు అర్జున్‌
Image Credit : Asianet News

మూడో స్థానంలో అల్లు అర్జున్‌

మూడో స్థానంలో అల్లు అర్జున్‌ ఉన్నారు. గత నెల(మార్చి)లో ఆయన రెండో స్థానంలో ఉన్నారు. `రాకా` అప్‌డేట్ల కారణంగా టాప్‌ 2లోకి దూసుకొచ్చిన ఆయన ఇప్పుడు టాప్‌ 3కి పడిపోయారు.

510
నాల్గో స్థానానికి పడిపోయిన విజయ్‌
Image Credit : Asianet News

నాల్గో స్థానానికి పడిపోయిన విజయ్‌

నాల్గో స్థానంలో విజయ్‌ ఉన్నారు. తమిళనాడు ఎన్నికలు జరిగాయి. విజయ్‌కి సంబంధించిన చర్చ నడుస్తూనే ఉంది. అయినా ఆయన స్థానం పడిపోవడం గమనార్హం. అయితే హీరోగా ఆయన క్రేజ్‌ తగ్గిపోయిందని చెప్పడానికి ఇదొక నిదర్శనమని చెప్పొచ్చు. కాకపోతే మే నెలలో మళ్లీ పుంజుకునే అవకాశం ఉంది.

610
ఐదో స్థానంలో మహేష్‌ బాబు
Image Credit : Mahesh Babu\Instagram

ఐదో స్థానంలో మహేష్‌ బాబు

ఐదో స్థానంలో మహేష్‌ బాబు ఉన్నారు. మహేష్‌ తన స్థానాన్ని పదిలపర్చుకున్నారు. ఆయన స్థానంలో పెద్దగా మార్పు లేదు. మార్చిలోనూ ఆయన ఇదే స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం మహేష్‌ `వారణాసి` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

710
ఆరో స్థానంలోకి దూసుకొచ్చిన రణ్‌వీర్‌ సింగ్‌
Image Credit : Asianet News

ఆరో స్థానంలోకి దూసుకొచ్చిన రణ్‌వీర్‌ సింగ్‌

ఆరో స్థానంలోకి `ధురంధర్‌ 2` హీరో దూసుకొచ్చారు. రణ్‌వీర్‌ సింగ్‌ 6వ స్థానాన్ని దక్కించుకున్నారు. చాలా వరకు ఈ టాప్‌ 10 లిస్ట్ లోనే ఆయన ఉండేవారు కాదు. కానీ `ధురంధర్‌` ఎఫెక్ట్ తో ఆయన టాప్‌ 10లోకి వచ్చారు. మార్చిలో 8వ స్థానంలో ఉండగా, ఇప్పుడు ఆరో స్థానానికి ఎగబాకడం విశేషం. పెరిగిన ఆయన ఇమేజ్‌, క్రేజ్‌కిది నిదర్శనం.

810
ఏడో స్థానంలో రామ్‌ చరణ్‌
Image Credit : Asianet News

ఏడో స్థానంలో రామ్‌ చరణ్‌

ఏడో స్థానంలో రామ్‌ చరణ్‌ ఉన్నారు. గత నెలతో పోల్చితే ఓ స్థానం పడిపోయారు. మార్చిలో 6వ స్థానంలో ఉండగా, ఏప్రిల్‌లో ఏడో స్థానానికి పరిమితం కావడం గమనార్హం. ఆయన హీరోగా నటించిన పెద్ది సినిమాకి సంబంధించిన చర్చ నడుస్తున్నా కూడా చరణ్‌ ఒక స్థానాన్ని పడిపోవడం గమనార్హం.

910
ఎనిమిదో స్థానంలో సల్మాన్‌ ఖాన్‌
Image Credit : Asianet News

ఎనిమిదో స్థానంలో సల్మాన్‌ ఖాన్‌

ఎనిమిదో స్థానంలో బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ ఉన్నారు. ఆయన వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో మూవీ చేస్తున్నారు. దీనితో ఎక్కువగా చర్చల్లోకి వచ్చారు. ఆయన డ్రెస్‌స్టయిల్‌ కూడా వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో సల్మాన్‌ ఎనిమిదో స్థానంలో ఉన్నారు. అయితే మార్చితో పోల్చితే సల్మాన్‌ కూడా ఒక స్థానం పడిపోయారు.

1010
ఒక స్థానం పడిపోయిన తారక్‌
Image Credit : Youtube@Mythri Movie Makers

ఒక స్థానం పడిపోయిన తారక్‌

తొమ్మిదో స్థానంలో మరో బాలీవుడ్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ నిలిచారు. పదో స్థానంలోకి ఎన్టీఆర్‌ పడిపోయారు. మార్చిలో 9వ స్థానంలో ఉండగా, ఇప్పుడు మరో స్థానానికి పడిపోవడం గమనార్హం. ఇదే అందరికి ఆశ్చర్యపరుస్తోంది. ప్రస్తుతం ఆయన `డ్రాగన్‌` చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన గ్లింప్స్ విడుదల కాగా, అది ఆద్యంతం కట్టిపడేస్తోంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
తెలుగు సినిమా
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Allari Naresh: మూడు నెలలు బెడ్ రూమ్ నుంచి బయటకు రాని హీరో, పని మనిషి తెస్తేనే భోజనం..నితిన్ చెప్పాకే మారాడు
Recommended image2
Romanchakam Movie Review: రోమాంచకం మూవీ రివ్యూ.. సందీప్‌ రెడ్డి వంగా నిర్మించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image3
Chiranjeevi: సీనియర్ ఎన్టీఆర్ నుంచి చిరంజీవి వరకు, ఆ ఫార్ములాకు తిరుగులేదు..పాపం రవితేజకి కోలుకోలేని దెబ్బ
Related Stories
Recommended image1
Drishyam 3 Review: దృశ్యం 3 మూవీ రివ్యూ.. మోహన్‌లాల్‌, మీనా కలిసి నటించిన మూవీ ఎలా ఉందంటే?
Recommended image2
Balakrishna: బాలయ్య జాతకంలో అతి పెద్ద గండం, ఆదివారం ఆయన అస్సలు చేయకూడని పని ఏదో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved