MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Entertainment
  • Roja: హైపర్ ఆది, రోజా కలిసిపోయారా? రాజకీయ విభేదాలపై ఫస్ట్ టైమ్ స్పందించిన జబర్దస్త్ స్టార్ కమెడియన్

Roja: హైపర్ ఆది, రోజా కలిసిపోయారా? రాజకీయ విభేదాలపై ఫస్ట్ టైమ్ స్పందించిన జబర్దస్త్ స్టార్ కమెడియన్

రోజాతో శత్రుత్వంపై హైపర్ ఆది హాట్ కామెంట్స్ చేశాడు. జబర్దస్త్ స్టేజ్ పై నవ్వులు పంచుకున్న ఈ స్టార్స్.. పొలిటికల్ గా మాత్రం మాటల తూటాలు పేల్చారు. ఈక్రమంలో రోజా గురించి ఆది ఈ మధ్య కాలంలో చేసిన వ్యాఖ్యలు అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.  

2 Min read
Author : Mahesh Jujjuri
Published : May 21 2026, 05:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జబర్దస్త్ లో ఆదిపై రోజా ప్రశంసలు..
Image Credit : Asianet News

జబర్దస్త్ లో ఆదిపై రోజా ప్రశంసలు..

జబర్దస్త్ స్టేజ్ పై హైపర్ ఆది జోకులను రోజా తెగ ఎంజాయ్ చేసేవారు. ఆది స్కిట్ లో ఉన్నాడంటే.. ప్రశంసల వర్షం కురిసేది. నువ్వు ఏ జోక్ వేసినా.. అది సూపర్ అని రోజా నుంచి ఆదికి కాంప్లిమెంట్స్ వచ్చేవి. ఇక జబర్దస్త్ నుంచి నాగబాబు, రోజా ఒక్కొక్కరుగా ఆ షో నుంచి బయటకు రావడం, ఆది లాంటి సీనియర్ కమెడియన్స్ కూడా సినిమాలతో బిజీ అవ్వడం.. జబర్దస్త్ కళ తప్పింది. మరోవైపు జబర్దస్త్ స్టేజ్ పై నవ్వులు పంచుకున్న వీళ్లంతా.. రాజకీయాల్లో వేరే వేరు పార్టీల్లో ఉండటంతో.. ఎన్నికల టైమ్ వాడీ వేడీ గా మాటల బాణాలు విసురుకున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఎన్నికల ప్రచారంలో రోజాపై ఆది పంచులు..
Image Credit : youtube/sreyas media

ఎన్నికల ప్రచారంలో రోజాపై ఆది పంచులు..

జబర్దస్ట్ స్టేజ్ పై ఒకరిపై మరొకరు ప్రశంసలు కురిపించుకోగా.. ఎన్నికల ప్రచారంలో మాత్రం విమర్శలతో హోరెత్తించారు. ముఖ్యంగా జనసేన తరపున ప్రచారం చేసిన హైపర్ ఆది రోజాను ఇండైరెక్ట్ గా విమర్శిస్తూ.. కౌంటర్ల మీద కౌంటర్లు వేశాడు. కానీ ఎక్కడా రోజా గురించి వల్గర్ కామెంట్లు కానీ, ఆమెపై ఘాటు విమర్శలు కానీ చేయలేదు. మరోవైపు రోజా కూడా జబర్దస్త్ లో ఆదిని పొగిడిన నోటితోనే అల్పులు, వాళ్ల బ్రతుకులు ఎంత పాపం అటూ.. ఇండైరెక్ట్ గా కామెంట్స్ చేసింది.

Related Articles

Related image1
Roja Selvamani daughter: చరిత్ర సృష్ణించిన రోజా కూతురు, అమెరికాలో అన్షు మాలిక కు అరుదైన గౌరవం
Related image2
NTR Dragon: 4 నెలల్లో 15 కేజీలు.. ఎన్టీఆర్ చూసి భయంతో ఆయన ఫ్యామిలీ ఏం చేశారో తెలుసా?
35
రోజా-ఆదికి మధ్య విభేదాలు నిజమేనా?
Image Credit : Asianet News

రోజా-ఆదికి మధ్య విభేదాలు నిజమేనా?

ఈక్రమంలో పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేసిన జబర్దస్త్ కమెడియన్స్ కు , రోజాకు మధ్య గ్యాప్ వచ్చింది. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ లో రకరకాల కమెంట్లు, సోషల్ మీడియాలో ట్రోల్స్ వినిపించాయి. ఇక ఆది, రోజా ఉప్పు నిప్పు అయిపోయారు... ఇక కలవరు, అని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. వాటన్నింటిని పటాపంచలు చేస్తూ..అసలు విషయంపై క్లారిటీ ఇచ్చాడు హైపర్ ఆది. రోజాతో తనకు ఉన్న అనుబంధం, రోజాపై తాను చేసిన విమర్శల గురించి, సింపుల్ గా తేల్చేశాడు.

45
రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన హైపర్ ఆది..
Image Credit : our own

రూమర్స్ పై క్లారిటీ ఇచ్చిన హైపర్ ఆది..

ఓ ఫంక్షన్ లో రోజా హైపర్ ఆది కలుసుకున్నారు, కూల్ గా మాట్లాడుకున్నారు, ఆతరువాత మైక్ అందుకున్న ఆది మాట్లాడుతూ..'' ఈ ఫంక్షన్ కు రావడం ఆనందంగా ఉంది. మరీ ముఖ్యంగా రోజాగారిని ఇక్కడ కలవడం మరింత సంతోషంగా ఉంది. చాలా కాలం తరువాత రోజాగారిని చూశాను.

 ఇక్కడ ఇంకో విషయం మాట్లాడుకోవాలి. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ వారి థంబ్ నైల్స్ లో హైపర్ ఆది రోజాను ఏమన్నాడో తెలుసా అని పెట్టారు.. నేనేమీ అనలేదండి.. రోజా గారిని ఒక్క మాట కూడా అనలేదు. యూట్యూబ్ వాళ్లు... వారి వ్యూస్ కోసం ఏదోదో పెడుతుంటారు కానీ. నాకు రోజాగారికి మధ్యలో ఎటువంటి శత్రుత్వం లేదు. '' అని అన్నారు.

55
హైపర్ ఆది గతంలో ఏమన్నాడంటే?
Image Credit : Google

హైపర్ ఆది గతంలో ఏమన్నాడంటే?

ఇక గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో కూడా ఆది ఈవిషయంలో క్లారిటీ ఇచ్చారు. జబర్దస్త్ లో రోజాను గురువుగా భావించి.. బయటకు వచ్చిన తరువాత రాజకీయంగా ఎలా విమర్శించారు. అని యాంకర్ ఆదిని ప్రశించింది. ఆది మాట్లాడుతూ..'' మా మధ్య ఎటువంటి శత్రుత్వం లేదు. రోజాగారికి కూడా తెలుసు. రాజకీయంగా ఎవరి దారులు వారివి. జబర్దస్త్ సెట్ లో ఉన్నప్పుడు ఎవరు కూడా రాజకీయాల గురించి మాట్లాడుకునేవారం కాదు. రోజా గారు కూడా ఎప్పుడు రాజకీయాల గురించి మాట్లాడలేదు. 

అందరితో మంచిగా ప్రేమగా ఉండేవారు. మేమందరం కమెడియన్స్ గా ఎదగడంలో నాగబాబుగారి పాత్ర ఎంత ఉందో.. రోజాగారి పాత్ర కూడా అంతే ఉంది. ఇక రాజకీయంగా బయటకు వచ్చిన తరువాత ఎవరిదారి వారిది. అందరు ఒకరికే సపోర్ట్ చేయాలని లేదు కదా.. అలా అని ఎప్పుడూ కొట్టుకుంటూ.. తిట్టుకుంటూ.. ఉంటారని కాదు కదా.. రాజకీయంగా ఎన్ని ఉన్నా పర్సనల్ గా ఒకరంటే ఒకరికి అభిమానం ఉంటుంది.'' అని ఆది అన్నారు. ఇదంతా చూసిన నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Annapurna: భర్తను రెండో పెళ్లి చేసుకోమన్న స్టార్ నటి.. అన్నపూర్ణ సంచలన నిర్ణయం వెనుక కారణం ఏంటి?
Recommended image2
Ramu Rathod: రాను బొంబాయికి పాట హీరోయిన్ లిఖిత సంచలన కామెంట్స్, రాము రాథోడ్ మోసం చేశాడా? సర్ప్రైజ్ ఏంటంటే?
Recommended image3
Youtuber Nandu: నందూస్ వరల్డ్ రమా నందన అరెస్ట్, దోషిగా తేలితే నందుకి పడే శిక్ష ఏంటో తెలుసా?
Related Stories
Recommended image1
Roja Selvamani daughter: చరిత్ర సృష్ణించిన రోజా కూతురు, అమెరికాలో అన్షు మాలిక కు అరుదైన గౌరవం
Recommended image2
NTR Dragon: 4 నెలల్లో 15 కేజీలు.. ఎన్టీఆర్ చూసి భయంతో ఆయన ఫ్యామిలీ ఏం చేశారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved