- Home
- Entertainment
- బ్లాక్ అండ్ వైట్‌లో మత్తెక్కిస్తున్న శృతి హాసన్.. చిరు, బాలయ్య, ప్రభాస్ సినిమాలకు పారితోషికం ఎంతంటే?
బ్లాక్ అండ్ వైట్‌లో మత్తెక్కిస్తున్న శృతి హాసన్.. చిరు, బాలయ్య, ప్రభాస్ సినిమాలకు పారితోషికం ఎంతంటే?
శృతి హాసన్ కవ్విస్తూ కనువిందు చేస్తుంటుంది. రెగ్యూలర్‌గా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఏదో ఒక చిలిపి పనిచేస్తూ అలరిస్తుంది. ఇప్పుడు రెమ్యూనరేషన్ విషయంలో వార్తల్లో నిలుస్తుంది.

లోకనాయకుడు కమల్ హాసన్ తనయ శృతి హాసన్(Shruti Haasan) కమర్షియాలిటీని, స్ట్రాంగ్ రోల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంటుంది. స్టార్ కిడ్ అయినా తన సొంత నిర్ణయాలతో దూసుకుపోతుంది. ఉమెన్ ఎంపవర్‌మెంట్‌కి నిదర్శనంగా నిలుస్తుంది. ఓ వైపు నటిగా, మరోవైపు సింగర్‌గా, ఇంకోవైపు మ్యూజీషియన్‌గా రాణిస్తూ కెరీర్‌ని తనకు నచ్చినట్టు ఆస్వాదిస్తుంది.
శృతి హాసన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి అప్‌డేట్‌ని పంచుకుంటుంది. గ్లామర్ ఫోటోలను నిర్మొహమాటంగా షేర్ చేసుకుంటూ తన ప్రత్యేకతని చాటుకుంటుంది. అందాల విందుతో ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారుతుంది. తాజాగా ఆమె పంచుకున్న లేటెస్ట్ బ్లాక్ అండ్‌వైట్ ఫోటోలు సైతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
తరచూ క్యాట్‌ని పోలిన బ్లాక్ అండ్ వైట్ పిక్స్ ని పంచుకుంటూ ఆకట్టుకుంటుంది శృతి. అయితే ఆమె ఇలాంటి ఫోటోలు పంచుకోవడం వెనకాల సీక్రెట్ ఏంటనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. ఇదే తరచూ చర్చనీయాంశంగా మారుతుంది. ఏదేమైనా తన గ్లామర్ ఫోటోలను నెటిజన్లని అలరిస్తూ, ఫాలోయింగ్‌ని పెంచుకుంటుందీ సెక్సీ భామ.
ఇటీవల శృతి హాసన్ కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. దాదాపు వారం రోజులపాటు హోం క్వారంటైన్‌లో ఉండిపోయింది. అయితే క్వారంటైన్‌లో ఎంత చిరాకుగా ఉందో, కరోనా వల్ల ఎంతటి ఇబ్బంది పడుతుందో వెల్లడించింది. మొత్తానికి ఇప్పుడు ఆమె కరోనా నుంచి కోలుకుంది.
కోలుకోవడమే కాదు ఏకంగా చిరంజీవి సరసన నటించే ఛాన్స్‌ని అందుకుంది. చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో రూపొందుతున్న `మెగా154` చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఇటీవల ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి ప్రకటించారు. పుష్పగుచ్ఛం అందించి ఆమెకి ఆహ్వానం పలికారు. అయితే ఇప్పటికే శృతి.. బాలయ్యతో `ఎన్బీకే 107`లో నటిస్తుంది. దీనికి గోపీచంద్ మలినేని దర్శకుడు.
మరోవైపు ప్రభాస్‌తో `సలార్` చిత్రంలోనూ హీరోయిన్‌గా `ఆద్య` పాత్రలో కనిపించబోతుంది. వరుసగా మూడు భారీ ప్రాజెక్ట్ ల్లో శృతి నటిస్తూ బిజీగా ఉంది. అయితే ఇప్పుడు ఆమె తీసుకుంటున్న పారితోషికం హాట్ టాపిక్ అవుతుంది. చిరంజీవి, బాలయ్య, ప్రభాస్ చిత్రాలకు శృతి తీసుకుంటున్న పారితోషికం లీక్ అయ్యింది. చిరంజీవి చిత్రానికి శృతి రెండు కోట్ల పారితోషికం తీసుకుంటుందట. అలాగే బాలయ్య సినిమాకి 1.5 కోట్లు రెమ్యూనరేషన్‌గా అందుకుంటుందని సమాచారం. గోపీచంద్ మలినేనితో ఉన్న అనుబంధంతో కాస్త తగ్గించిందట.
మరోవైపు ప్రభాస్‌తో భారీ పాన్ ఇండియా మూవీ `సలార్`లో నటిస్తుంది శృతి హాసన్. ఈ చిత్రానికి మాత్రం భారీగానే అందుకుంటుందని టాక్. 2-3కోట్ల మధ్య ఈ చిత్రానికి తీసుకుంటుందనే వార్త వినిపిస్తుంది. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది. ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. కోలార్ మైనింగ్‌లో పనిచేసే ఓ నాయకుడి కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట. ప్రస్తుతం ఈ మూడు సినిమాలతో శృతి బిజీగా ఉంది.
ఇదిలా ఉంటే శృతి ప్రేమలో మునిగితేలుతుంది. డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో ఆమె డేట్‌లో ఉంది. ప్రస్తుతం వీరిద్దరు కపుల్ గోల్స్ తో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఓ సారి శృతి లవ్‌కి బ్రేకప్ చెప్పిన విషయం తెలిసిందే.