- Home
- Entertainment
- Shruti Haasan: శృతి హాసన్ నో మేకప్ ఫొటోస్ చూశారా.. వైరల్ అవుతున్న ఎమోషనల్ కామెంట్స్
Shruti Haasan: శృతి హాసన్ నో మేకప్ ఫొటోస్ చూశారా.. వైరల్ అవుతున్న ఎమోషనల్ కామెంట్స్
శృతి హాసన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 13 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తనని ఆదరించిన అభిమానులకు, అవకాశాలిచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు చెబుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

ప్రస్తుతం శృతి హాసన్ వరుస చిత్రాలతో దూసుకుపోతోంది. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శృతి హాసన్ కు ఆరంభంలో పరాజయాలు తప్పలేదు. ఫలితంగా ఐరన్ లెగ్ అనే ముద్ర పడింది. ఆ ముద్రని చెరిపివేస్తూ టాప్ హీరోయిన్ గా దూసుకుపోవడానికి శృతికి ఎక్కువ టైం పట్టలేదు.
పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం రూపంలో శృతి హాసన్ కు అదృష్టం వరించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సెన్సేషన్ ఎలాంటిదో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత శృతి హాసన్ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. వరుసగా విజయాలు కూడా దక్కడంతో శృతి హాసన్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.
బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలలో శృతి హాసన్ భాగమైంది. టాలీవుడ్ హీరోలకు లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇదిలా ఉండగా శృతి హాసన్ ప్రేమ వ్యవహారాలు కూడా వైరల్ అయ్యాయి.
తరచుగా శృతిహాసన్ మ్యూజిక్ వీడియోలు చేయడం చూస్తూనే ఉన్నాం. అలాగే విభిన్నమైన ఫోటో షూట్స్ కూడా చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్ కి జోడిగా పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా శృతి హాసన్ సోషల్ మీడియాలో మేకప్ లేకుండా ఉన్న తన బ్యూటిఫుల్ ఫొటోస్ ని షేర్ చేసింది. తనకి వైట్ డ్రెస్ అంటే నచ్చదని.. కనై ఒకసారి ట్రై చేసినట్లు శృతి హాసన్ పేర్కొంది. మేకప్ లేకపోయినప్పటికీ శృతి హాసన్ బ్యూటిఫుల్ గా ఉంది. అలాగే శృతి హాసన్ రెడ్ డ్రెస్ గులాబీ పువ్వుని నమిలేస్తూ ఉన్న వీడియో కూడా షేర్ చేసింది.
ఇదిలా ఉండగా శృతి హాసన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 13 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా తనని ఆదరించిన అభిమానులకు, అవకాశాలిచ్చిన దర్శక నిర్మాతలకు కృతజ్ఞతలు చెబుతూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన బ్యూటిఫుల్ జర్నీని గుర్తు చేసుకుంది.
2009లో శృతి హాసన్ లక్ అనే బాలీవుడ్ చిత్రంతో ఇదే రోజు జూలై 25న నటిగా పరిచయం అయింది. ఆ చిత్రాన్ని శృతి హాసన్ కి గుర్తింపు తీసుకురాలేదు. రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రంతో శృతి హాసన్ జైత్ర యాత్ర మొదలయింది.