- Home
- Entertainment
- చీరకట్టులో శ్రియా శరన్ స్టన్నింగ్ అందాలు.. మతులు పోగొడుతున్న స్టార్ హీరోయిన్.. ఈసారి షో మామూలుగా లేదుగా!
చీరకట్టులో శ్రియా శరన్ స్టన్నింగ్ అందాలు.. మతులు పోగొడుతున్న స్టార్ హీరోయిన్.. ఈసారి షో మామూలుగా లేదుగా!
స్టార్ హీరోయిన్ శ్రియా శరన్ (Shriya Saran) చీరకట్టులో హోయలు పోయింది. బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలోనూ వరుసగా గ్లామర్ ఫొటోలను పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఖుషీ చేస్తోంది.

తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ శ్రియా సరన్. యూపీకి చెందిన ఈ బ్యూటీ తన తొలిచిత్రాన్ని తెలుగులోనే చేసింది. ‘ఇష్టం’ అనే చిత్రంతోనే వెండితెరకు పరిచయం కావడంతో పాటు ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. ఇప్పటికీ 22 ఏండ్లుగా బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటిస్తూ అలరిస్తోంది.
తెలుగుతోపాటు బాలీవుడ్ లోనూ వరుస ఆఫర్లను అందుకుంటూ వచ్చింది శ్రియా. ఈ క్రమంలో సౌత్ ఆడియెన్స్ తో పాటు నార్త్ ఆడియెన్స్ ను కూడా తనవైపు తిప్పుకుంది. భారతీయ ప్రేక్షకాదరణ పొందిన హీరోయిన్లలో శ్రియా కూడా ముందు వరసలో ఉంది. ఇప్పటికీ సౌత్ సినిమాలతో పాటు నార్త్ భాషల్లో రూపొందుతున్న చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
మరోవైపు ఇంటర్నెట్ లోనూ తెగ సందడి చేస్తోంది. నాలుగు పదుల వయస్సులోనూ అదిరిపోయే అవుట్ ఫిట్ లో ఫొటోషూట్లు చేస్తూ మతులు పోగొడుతోంది. తాజాగా చీరకట్టులో సీనియర్ హీరోయిన్ చేసిన ఫొటోషూట్ వైరల్ గా మారింది. అందుకు సంబంధించిన ఈ ఫొటోలను అభిమానులతోనూ పంచుకుంది.
లేటెస్ట్ ఫొటోల్లో శ్రియా శరన్ అదిరిపోయే శారీలో దర్శనమిచ్చింది. అప్పటికే చెక్కు చెదరని అందంతో మతులు పోగొడుతున్న శ్రియా.. మెరిసిపోతున్న చీరలో ఒంపుసొంపులు చూపిస్తూ మతిపోగొట్టింది. స్లిమ్ ఫిట్ పరువాలను ప్రదర్శిస్తూ కుర్రకాను చూపు తిప్పుకోకుండా చేసింది.
వయస్సు పెరిగినా కొద్ది మరింత గ్లామర్ గా తయారవుతూ నెట్టింట అందాలను ఆరబోస్తోంది. ఈ ఫొటోల్లో చీరకట్టి మరింత హాట్ గా పరువాలను ప్రదర్శించింది. స్లీవ్ లెస్ బ్లౌజ్ లో టాప్ గ్లామర్ చూపిస్తూ.. అన్నీ యాంగిల్లో వయ్యారాలను వడ్డిస్తూ పిచ్చెక్కించింది. దీంతో ఫొటోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి.
చివరిగా బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’(RRR)లో కీలక పాత్రలో నటించి ఆకట్టుకుంది. అజయ్ దేవగన్ (Ajay Devgn) సరసన నటించిన విషయం తెలిసిందే. తాజాగా వీరిద్దరూ ‘ద్రుశ్యం 2’తోనూ అలరించబోతున్నారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లోనే భాగంగా ఈ శారీలో కపిల్ శర్మ షోకు హాజరైంది. Dhrushyam 2 నవంబర్ 18న విడుదల కానుంది.