- Home
- Entertainment
- ట్రోల్స్ పై శ్రియా షాకింగ్ కౌంటర్.. చెత్త కామెంట్లని పట్టించుకోనంటూ కామెంట్.. భర్తని ముద్దుపెడితే ఇంత రచ్చా
ట్రోల్స్ పై శ్రియా షాకింగ్ కౌంటర్.. చెత్త కామెంట్లని పట్టించుకోనంటూ కామెంట్.. భర్తని ముద్దుపెడితే ఇంత రచ్చా
హీరోయిన్ శ్రియా ఇటీవల అందరి ముందు తన భర్తకి లిప్ కిస్ ఇచ్చిన విషయం తెలిసిందే. ట్రోల్స్ గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై శ్రియా స్పందించింది. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది.

ఇటీవల `దృశ్యం2` స్క్రీనింగ్ టైమ్‌లో ఫోటోలకు పోజులిస్తూ ఆనందంలో శ్రియా తన భర్త ఆండ్రీ కొచ్చివ్ కి లిప్ కిస్ ఇచ్చింది. ఇది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ట్రోలర్స్ రెచ్చిపోయారు. పబ్లిక్ ప్లేస్‌లో ఎలా ఇలాంటి పనులు చేస్తారని, ముద్దులకు వేరే టైమే దొరకలేదా? ఇలా రకరకాల కామెంట్లతో విరుచుకుపడుతున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా దీనిపై శ్రియా స్పందించింది. భర్తని ముద్దుపెట్టుకుంటే ఇంత రచ్చనా అని ప్రశ్నించింది. తాను ట్రోల్స్ ని లెక్కచేయనని తెలిపింది. భార్యాభర్తలైనా తామిద్దరం ముద్దుపెట్టుకోవడాన్ని కూడా తప్పు పట్టి ట్రోల్స్ చేయడం తనకు కామెడీగా అనిపిస్తుందని తెలిపింది శ్రియా. తనకు ఎంతో ప్రత్యేకమైన సమయంలో ముద్దు పెట్టుకోవాలని ఆండ్రీ అనుకున్నారు. అలా తనని ముద్దు పెట్టుకున్నాడని, అవి తమకు ఎంతో అందమైన క్షణాలని చెప్పింది శ్రియా.
`ఒక సహజమైన చర్యకు మిమ్మల్ని ఎందుకు ట్రోల్ చేస్తున్నారో ఆయనకు అర్తం కావడం లేదు. అయినా ఫర్వాలేదు, చెత్త కామెంట్స్ ని పట్టించుకోను. ఇలాంటి కామెంట్స్ సృష్టించడం ట్రోలర్స్ పని. వాటిని అసలు పట్టించుకోకపోవడం నా పని, నేను ఏం చేయగలనో అదే చేస్తా` అని స్పష్టం చేసింది శ్రియా శరణ్. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సైతం వైరల్ అవుతున్నాయి.
శ్రియా లేటెస్ట్ గా హిందీలో `దృశ్యం 2`లో నటించింది. అజయ్ దేవగన్ హీరోగా నటించిన చిత్రమిది. సౌత్‌లో ఇప్పటికే ఈ సినిమా విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు హిందీలోనూ రూపొంది ఈ నెల 18న విడుదలైంది. ప్రారంభం నుంచే హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. చాలా గ్యాప్ తర్వాత హిందీలో హిట్ కొట్టిందీ చిత్రం. ఓ రకంగా బాలీవుడ్‌కి ఊపిరిపోసినంత పని చేసింది. ఈ చిత్రం సుమారు డెబ్బై కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. వంద కోట్ల దిశగా రన్ అవుతుంది.
ఈ నేపథ్యంలో లేటెస్ట్ సెలబ్రిటీల కోసం స్పెషల్ స్క్రీనింగ్ వేశారు. స్క్రీనింగ్ అనంతరం ఫోటోలకు పోజులిచ్చే సమయంలో శ్రియా, ఆండ్రీ మధ్య ఈ ముద్దు సీన్ చోటు చేసుకుంది. అది కెమెరాలకు చిక్కడంతో ట్రోల్స్ దారుణంగా ఆడుకుంటున్నారు. దీనిపై శ్రియా కూడా అదే రేంజ్‌లో కౌంటర్ ఇవ్వడం విశేషం. ఆమెకి అభిమానులు కూడా సపోర్ట్ చేస్తున్నారు. భార్యాభర్తలు ముద్దు పెట్టుకోవడంలో తప్పేముందంటున్నారు. అయితే శ్రియా ఇలా చేయడం కొత్త కాదు, చాలా సందర్భాల్లోనూ ఆమె తన భర్తతో లిప్ కిస్ ఇస్తూ కెమెరాలకు చిక్కింది. ఆ పిక్స్ సైతం ఈ సందర్భంగా వైరల్ అవుతున్నాయి.
సెకండ్ ఇన్నింగ్స్ లో ఆచితూచి అడుగులు వేస్తుంది శ్రియా. సీనియర్ హీరోలకు జోడీగాచేస్తుంది. అదే సమయంలో తన పాత్రకి ప్రయారిటీ ఉన్న సినిమాలు చేస్తుంది. తెలుగు, హిందీ, కన్నడ చిత్రాల్లో నటిస్తుంది. ఇటీవల తెలుగులో ఆమె `ఆర్‌ఆర్‌ఆర్`లో మెరిసిన విషయం తెలిసిందే. అంతకు ముందు `గమనం` అనే చిత్రంలో నటించి ఆకట్టుకుంది.