- Home
- Entertainment
- Shriya Saran Latest Pics: రైల్వే స్టేషనల్ లో శ్రియా సరన్ సందడి.. షూటింగ్ స్పాట్ లో సెల్ఫీలు..
Shriya Saran Latest Pics: రైల్వే స్టేషనల్ లో శ్రియా సరన్ సందడి.. షూటింగ్ స్పాట్ లో సెల్ఫీలు..
తెలుగు ప్రేక్షకులకు పరిచయం లేని హీరోయిన్లలో శ్రియా సరన్ (Shriya Saran) ఒకరు. రెండు దశబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. తాజాగా తను నటిస్తున్న ఓ మూవీ లోకేషన్ నుంచి సెల్పీలు దిగి.. ఇన్ స్టాలో తన అభిమానులతో పంచుకుంది.

2001 నుంచి శ్రియా సరన్ తెలుగు ఆడియెన్స్ ను విభిన్న పాత్రల్లో అలరిస్తూనే ఉన్నారు. తాను నటించిన అన్ని సినిమాలు దాదాపు హిట్ చిత్రాలుగా నిలిచాయి. టాలీవుడ్ లోని అగ్ర హీరోల సరనన శ్రియ సరన్ ఆడిపాడి.. యూత్ ను సైతం ఊర్రూతలూగించింది. సౌత్ లో తనకుంటూ ప్రత్యేక గుర్తింపును సాధించుకుంది.
యూపీకి చెందిన శ్రియ సరన్ తన కేరీర్ ను టాలీవుడ్ లోనే ప్రారంభించింది. 2001లో ‘ఇష్టం’మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఈ మూవీతో పెద్దగా గుర్తింపు రాకున్నా.. వరుస ఆఫర్లు మాత్రం క్యూ కట్టాయి. ఆ తర్వాత అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) నటించిన ‘సంతోషం’ మూవీతో శ్రియకు మంచి గుర్తింపు లభించింది.
అప్పటి నుంచి తెలుగు, హిందీ, తమిళ మూవీల్లో వరుస సినిమాలు చేస్తూనే ఉంది. శ్రియ నటించిన చిత్రాల్లో సంతోషం, ఠాగూర్, నేనున్నాను, బాలు, ఛత్రపతి, శివాజీ, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, మనం, ద్రుశ్యం మూవీలు ఎవర్ గ్రీన్ చిత్రాలుగా నిలిచిపోయాయి. తెలుగులో చివరిగా ‘ఎన్టీఆర్ కథానాయకుడు’లో మెరిసింది.
అయితే 2018లో రష్యన్ కు చెందిన భాయ్ ఫ్రెండ్ ఆండ్రీ కొస్చీవ్ ను వివాహాం చేసుకుంది. 2021లో బేబీ గర్ల్ కు జన్మనిచ్చింది. తన పర్సనల్ లైఫ్ ను ఎప్పుడూ కేరీర్ అడ్డుగా భావించాలేదు. బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తూనే ఉంది. సోషల్ మీడియాలోనూ తన అభిమానులకు ఎప్పటికప్పుడు తన పర్సనల్ లైఫ్ విషయాలను పంచుకుంటోంది.
తాజాగా తను నటిస్తున్న మూవీ ‘మ్యూజిక్ స్కూల్’ లోకేషన్ నుంచి సెల్పీలను ఇన్ స్టాలో తన అభిమానులతో పంచుకుంది. రైల్వే స్టేషన్ లోకేషనల్ లో తన అల్లరి అంతా ఇంతా కాదు. 40 ఏండ్లు దగ్గరికి వచ్చినా ఆ అల్లరి మాత్రం తగ్గలేదంటున్నారు నెటిజన్లు. రాజు సుందర్ మాస్టర్ తో సెల్పీలు దిగి సందడి చేసింది.
ఈ ఫొటోలను పోస్ట్ చేస్తూ నోట్ కూడా రాసింది. ‘యామిని ఫిల్మ్ పతాకంపై తెరకెక్కిస్తున్న మ్యూజిక్ స్కూల్ మూవీ షూటింగ్ లో ఉన్నాను. నాకు ఇష్టమైన కొరియోగ్రాఫర్ రాజు సుందర్ మాస్టర్ వర్క్ చాలా నచ్చుతుంది. అలాగే అత్యుత్తమ డీవోపీ కిరణ్ వర్క్ స్టైల్ కు ధన్యవాదాలు’ అంటూ పేర్కొంది. శ్రియ తెలుగులో ఆర్ఆర్ఆర్ (RRR), మ్యూజిక్ స్కూల్ లో నటిస్తోంది. మరోవైపు హిందీ, తమిళంలోనూ రెండేసి మూవీల్లో నటిస్తోందీ సుందరి.