MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • క్రేజ్‌ తగ్గినా ఆస్తులు మాత్రం గట్టిగానే కూడబెట్టుకున్న శ్రియా శరణ్‌.. హాట్‌ బ్యూటీ రేర్‌ ఫ్యాక్ట్స్

క్రేజ్‌ తగ్గినా ఆస్తులు మాత్రం గట్టిగానే కూడబెట్టుకున్న శ్రియా శరణ్‌.. హాట్‌ బ్యూటీ రేర్‌ ఫ్యాక్ట్స్

ఒకప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది శ్రియాశరణ్‌. అనుష్క, నయనతార, త్రిష వంటి స్టార్‌ హీరోయిన్ల జోరు నడుస్తున్న సమయంలో వారికి దీటుగా రాణించి స్టార్‌ డమ్‌ పొందిందీ అందాల భామ.

3 Min read
Author : Aithagoni Raju
| Updated : Sep 11 2022, 07:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111

టాలీవుడ్‌లో హాట్‌ హీరోయిన్‌గా పేరుతెచ్చుకుంది శ్రియా(Shriya Saran). చీరలో యమ హాట్‌గా కనిపిస్తూ కుర్రాళ్ల మతిపోగొట్టింది. దాదాపు దశాబ్దంపాటు తెలుగు చిత్ర పరిశ్రమని ఓ ఊపు ఊపేసిన శ్రియా శరణ్‌ నేడు(సెప్టెంబర్‌ 11) 40వ పుట్టిన రోజు(Shriya Birthday) జరుపుకుంటోంది. ఈ సందర్భంగా ఆమెకి సంబంధించిన పలు ఆసక్తికర, అరుదైన విషయాలు, ఆస్తుల సమాచారం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
211

శ్రియా శరణ్‌ 1982లో శ్రియా శరణ్‌ భట్నగర్‌గా ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో జన్మించిన శ్రియా తండ్రి బీహెచ్‌ఈఎల్‌ లో ఉద్యోగి కాగా, తల్లి ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో కెమిస్ట్రీ టీచర్‌గా పనిచేవారు. మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన శ్రియా చిన్నప్పట్నుంచే క్లాసికల్‌ డాన్సులో శిక్షణ తీసుకుంది. ఆమె కతక్‌ డాన్స్, రాజస్థాని ఫోక్‌ డాన్సు నేర్చుకుంది. 
 

311

ఎల్‌ఎస్‌ఆర్‌ కాలేజ్‌లో చదువుకునే రోజుల్లో ఆమెకి వీడియో షూట్‌ చేసే అవకాశం వచ్చింది. అలా మ్యూజిక్‌ వీడియో మొదట నటించింది. ఇందులో ఆమెని చూసిన రామోజీ ఫిల్మ్స్ వారు `ఇష్టం` చిత్రంలో హీరోయిన్గా ఆఫర్‌ ఇచ్చారు. అలా సినిమాల్లో తొలి ఛాన్స్ అందుకుంది. ఈసినిమాలో నటించడానికి ముందే ఆమెకి నాలుగు సినిమా ఆఫర్లు రావడం విశేషం. అందులో `చెన్న కేశవ రెడ్డి, `నీకు నేను నాకు నువ్వు`, `నువ్వే నువ్వే` కూడా ఉంది. 

411

నాగార్జునతో కలిసి నటించిన `సంతోషం` చిత్రం ఆమెకి బిగ్‌ బ్రేక్‌నిచ్చింది. ఇక వెన్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. చిరంజీవితో చేసిన `ఠాగూర్‌`తో స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. ఇలా వరుసగా `ఎలా చెప్పను`, `నేనున్నాను`, `అర్జున్‌`, `నా అల్లుడు`, `సదా మీ సేవలో`, `సోగ్గాడు`, `సుభాష్‌ చంద్రబోస్‌`, `చత్రపతి`, `భగీరథ` వంటి చిత్రాలతో మెప్పించింది. ఆల్మోస్ట్ ఆసమయంలో స్టార్‌ హీరోలందరికి శ్రియానే హీరోయిన్‌ కావడం విశేషం. 
 

511

శ్రియా స్టార్‌ హీరోయిన్‌గా రాణించే సమయంలో ఆమె దాదాపు ఒక్కో సినిమాకి కోటి రూపాయల వరకు పారితోషికం అందుకున్నట్టు టాలీవుడ్‌ టాక్. కొన్నాళ్లపాటు అత్యధిక పారితోషికం అందుకున్న కథానాయికగా నిలిచింది శ్రియా. తెలుగులోనే కాదు, తమిళం, హిందీలోనూ స్టార్‌ హీరోయిన్‌గా వెలిగింది. 
 

611

శ్రియాకి ఇష్టమైన హీరోలు షారూఖ్‌ ఖాన్‌, అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్, మధుబాలా, మాధురీ దీక్షిత్‌. రజనీకాంత్‌తో `శివాజీ` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇది అప్పట్లో సంచలన విజయం సాధించింది. హిందీలోనే కాదు హాలీవుడ్ ఫిల్మ్స్ కూడా చేసింది. `ది అదర్‌ ఎండ్‌ ఆఫ్‌ ది లైన్‌`, `కూకింగ్‌ విత్‌ స్టెల్లా` చిత్రాలు చేసింది. అంతగా పేరుని తీసుకు రాలేకపోయాయి. 
 

711

స్టార్‌ హీరోయిన్‌గా రాణించే సమయంలో కమర్షియల్‌ బ్రాండ్‌లకు కేరాఫ్‌గా నిలిచింది. ఫుల్‌ డిమాండెడ్‌ నటిగా నిలిచింది. ఆమె కోకా కోలా, ఫెయిర్‌ అండ్‌ లవ్లీ, హెడ్‌ అండ్‌ షోల్డర్‌ వంటి యాడ్‌ చేసింది. వీటి ద్వారా కూడా బాగానే సంపాదించింది శ్రియా. ఒక్కో యాడ్‌కి యాభై లక్షల వరకు తీసుకునేదని టాక్‌. 

811

శ్రియా దానధర్మాలు కూడా బాగానే చేస్తుంటుంది. ఆమె 2011లో ముంబయిలో `శ్రీ` పేరుతో ఓ స్పా సెంటర్‌ని ఏర్పాటు చేసింది. ఇందులో అందరు విజువల్లీ ఛాలెంజ్డ్ ఉద్యోగులే పనిచేస్తుండటం విశేషం. ప్రస్తుతం శ్రియా సినిమాల్లో అంతగా యాక్టివ్‌గా లేదు. అలాగని చేయడం లేదని కాదు, అంత జోరులో లేదు. అడపాదడపా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. 

911

ఆమె రష్యాకి చెందిన ఫోటోగ్రాఫర్‌ ఆండ్రూని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి ఓ పాప కూడా ఉన్నారు. ప్రస్తుతం శ్రియాచాలా వరకు ఇండియాలోనే ఉంటున్నారు. ముంబయిలో ఆమెకి ఓ లగ్జరీ అపార్ట్ మెంట్‌ కూడా ఉందని సమాచారం. చాలా వరకు ముంబయి లేదంటే స్పెయిల్‌లోని బర్సిలోనాలో ఉంటుంటారు ఈ జంట.
 

1011

అయితే ఇప్పుడు శ్రియా జోరు తగ్గినా ఆస్తులు మాత్రం బాగానే కూడబెట్టుకుందని తెలుస్తుంది. ప్రస్తుతం శ్రియా వద్ద 12 మిలియన్ డాలర్లు ఆస్తులున్నట్టు తెలుస్తుంది. దీని వాల్యూ దాదాపు 90కోట్లు అని సమాచారం. కొంత ల్యాండ్స్, కార్లు, శ్రీ స్పా సెంటర్ అందులో భాగంగా ఉన్నాయి. అలాగే ఒక ఎస్‌ క్లాస్‌ మెర్సిడేజ్‌ బెంజ్‌, జాగ్వార్‌ ఎక్స్ ఎఫ్‌, ఆడి క్యూ 7 వంటి కార్లున్నాయి. 

1111

ప్రస్తుతం ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉంది. హిందీలో `దృశ్యం 2` చేస్తుంది. అలాగే `మ్యూజిక్‌ స్కూల్‌`, `తడ్కా`లతోపాటు కన్నడలో `కబ్జా`, `తమిళంలో రెండు సినిమాలు చేస్తుంది. ఇవి విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.  అడపాదడపా గ్లామర్‌ ఫోటో షూట్లతో ఇంటర్నెట్‌లో దుమారం రేపుతుందీ సెక్సీ బ్యూటీ.
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం

Latest Videos
Recommended Stories
Recommended image1
Sunil: హీరోగా కోలుకోలేని దెబ్బ, అందుకే సునీల్ తన బంధువునే పక్కన పెట్టారా..ఇద్దరి మధ్య ఏం జరిగింది ?
Recommended image2
Suman: శోభన్‌ బాబు, సుమన్‌, నాగార్జున ముగ్గురిలో ఉన్న మైనస్‌ ఒక్కటే.. అందుకే మెగాస్టార్‌ కాలేకపోయారు
Recommended image3
Geetu Mohandas: టాక్సిక్‌కి డిజాస్టర్‌ టాక్‌.. గీతూ మోహన్‌దాస్‌ కామెంట్స్ దుమారం.. ట్రోలింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved