ఎర్ర చీరకట్టిన ‘ఠాగూర్’ హీరోయిన్.. రెడ్ శారీలో శ్రియా శరన్ స్టిల్స్ చూస్తే అంతే.!
స్టార్ హీరోయిన్ శ్రియా శరన్ బీచ్ లో సోషల్ మీడియాలో తరుచూగా తన అందాల దర్శనం చేస్తోంది. బ్యూటీఫుల్ లుక్ లో కనిపిస్తూ అభిమానులను, నెటిజన్లను కట్టిపడేస్తోంది. తాజాగా రెడ్ శారీలో మెరిసింది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రియా శరన్ (Shriya Saran) తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకుంది. తన నటన, అందంతో ఆడియెన్స్ ను తన అభిమానులుగా మార్చుకుంది.
ఈ సీనియర్ హీరోయిన్ నటన గురించి స్పెషల్ గా చెప్పాల్సి అవసరం లేదు. సౌత్ లో బడా హీరోల సరసన నటించి మెప్పించింది. కొన్నేళ్ల పాటు టాలీవుడ్ లో వెలుగొందిన శ్రియా సార్ నార్త్ లోనూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకుంది.
ముఖ్యంగా శ్రియా శరన్ కెరీర్ టాలీవుడ్ చిత్రాలతోనే ప్రారంభం కావడంవిశేషం. తొలి సినిమా అవకాశాన్నా ఈ ముద్దుగుమ్మ ఇక్కడే అందుకుంది. 2001లో ‘ఇష్టం’ చిత్రంతో నటిగా తెరంగేట్రం చేసింది. తొలిసారిగా తెలుగు ప్రేక్షకులను పలకరించింది.
ఆ తర్వాత ‘సంతోషం’తో మంచి గుర్తింపు దక్కించుకుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 22 ఏళ్ల కెరీర్ ను పూర్తి చేసుకుంది. ఇప్పటికీ టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ లోని అగ్రస్థాయి తారల సరసన నటిస్తూ సందడి చేస్తోంది.
బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. కీలకపాత్రల్లో నటిస్తూ తన అభిమానులను ఆకట్టుకుంటోంది. చివరిగా తెలుగులో జక్కన్న తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’తో ప్రేక్షకులను అలరించింది. తమిళం, హిందీలో సినిమాలు చేస్తూనే ఉంది.
ఈ క్రమంలో శ్రియా సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా కనిపిస్తూ వస్తోంది. బ్యూటీఫుల్ లుక్ లో మెరుస్తూ తన అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది. అందాలతో అదరగొడుతోంది. జీరో సైజ్ నడుముతో మతులు పోగొడుతోంది.
తాజాగా ఈ సీనియర్ బ్యూటీ ఎర్ర చీరలో దర్శనమిచ్చింది. డీప్ బ్లౌజ్ లో బ్యాక్ అందాలను ప్రదర్శించి మతులు చెడగొట్టింది. చీరకట్టులో కవ్వించేలా ఫొటోలకు ఫోజులిస్తూ కుర్ర హృదయాలను ఉక్కిరిబిక్కిరి చేసింది. మత్తెక్కించే కళ్లతో మెస్మరైజ్ చేసింది.
సంప్రదాయంగా మెరిసినా తన కవ్వింపు చర్యలతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంది. బ్యూటీఫుల్ లుక్ కు అభిమానులు, నెట్టింట జనాలు ఫిదా అవుతూ ఆ ఫొటోలను వైరల్ చేస్తున్నారు. కామెంట్లు పెడుతూ శ్రియాను మరింతగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆమె అందాన్ని పొగుడుతూ ఆకాశానికి ఎత్తుతున్నారు.