- Home
- Entertainment
- Pavitra Lokesh: నరేష్ తో ఆ ఒప్పందం కుదుర్చుకున్న పవిత్ర లోకేష్ ?.. మామూలు ట్విస్ట్ కాదుగా..
Pavitra Lokesh: నరేష్ తో ఆ ఒప్పందం కుదుర్చుకున్న పవిత్ర లోకేష్ ?.. మామూలు ట్విస్ట్ కాదుగా..
నరేష్, పవిత్ర రిలేషన్ గురించి ఒక హాట్ గాసిప్ వైరల్ గా మారింది. తమ రిలేషన్ విషయంలో నరేష్, పవిత్ర ఓ అగ్రిమెంట్ చేసుకున్నారట.

ఇటీవల కొంతకాలంగా నటుడు నరేష్ గురించి మీడియాలో అనేక కథనాలు వెలువడుతున్నాయి . సీనియర్ నటి పవిత్ర లోకేష్ తో ఎఫైర్.. తన మూడో భార్య రమ్య రఘుపతితో విభేదాలే అందుకు కారణం. నరేష్.. పవిత్ర లోకేష్ తో రిలేషన్ షిప్ లో ఉంటున్నాడు. తనకు విడాకులు ఇవ్వకుండా పవిత్రతో ఎఫైర్ పెట్టుకున్నాడు అంటూ రమ్య ఆరోపించింది.
దీనితో వీళ్ళ ముగ్గురి వ్యవహారం తీవ్ర వివాదంగా మారింది. మైసూర్ హోటల్ సంఘటనతో నరేష్ ఫ్యామిలీ మ్యాటర్ రచ్చకెక్కింది అనే చెప్పాలి. ఇదిలా ఉండగా ఉండగా నరేష్, పవిత్ర లోకేష్ వివాహం చేసుకుంటారా లేక ఇలాగే రిలేషన్ షిప్ కొనసాగిస్తారా అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది.
Naresh- Pavitra Lokesh
వ్యాపారాల పేరుతో రమ్య చాలా ఫ్రాడ్ లు చేసిందని, అవన్నీ తన తలకు చుట్టుకున్నాయని నరేష్ ఆరోపిస్తున్నారు. ఇంతలో నరేష్ కి పవిత్ర చేరువైంది. వీరిద్దరూ కలసి అనేక చిత్రాల్లో నటించారు. క్రమంగా వీరి రిలేషన్ గురించి వార్తలు పెరుగుతూ వచ్చాయి. పవిత్ర లోకేష్ కూడా తన మొదటి భర్త సుచేంద్ర ప్రసాద్ నుంచి విడిపోయింది.
సోషల్ మీడియాలో నరేష్, పవిత్ర రిలేషన్ గురించి ఒక హాట్ గాసిప్ వైరల్ గా మారింది. తమ రిలేషన్ విషయంలో నరేష్, పవిత్ర ఓ అగ్రిమెంట్ చేసుకున్నారట. ఈ అగ్రిమెంట్ ప్రకారం తనతో రిలేషన్ లో ఉన్నందుకు గాను నెలకి రూ 25 లక్షలు ఇవ్వాలని పవిత్ర ఒప్పందం చేసుకుందట. ఒక వేల భవిష్యత్తులో విడిపోయి మరొకరితో రిలేషన్ పెట్టుకుంటే తనకి 50 కోట్లు చెల్లించేలా పవిత్ర అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు గాసిప్ వైరల్ గా మారింది.
ఇందులో ఎంతవరకు నిజం ఉందనేది తేలాల్సి ఉంది. గతంలో వీరిద్దరూ వివాహం చేసుకుంటారని ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు వీరికి ఆ ఉద్దేశం లేదట. నరేష్ ఇప్పటికే మూడు వివాహాలు చేసుకున్నారు. ఇకపై పెళ్లిళ్లు వద్దని.. రిలేషన్ షిప్ లో మాత్రమే ఉంటే ఎలాంటి ఫ్యామిలీ సమస్యలు రావని భావిస్తున్నారట.
కేవలం రిలేషన్ షిప్ కి మాత్రమే పవిత్ర కూడా అంగీకరించింది కానీ.. ఇలా అగ్రిమెంట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీళ్లిద్దరి ఎఫైర్ మ్యాటర్ లో ఇది పెద్ద టిస్ట్ అని నెటిజన్లు అంటున్నారు. నరేష్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో బిజీగా గడుపుతున్నారు. యువ హీరోలకు తండ్రి పాత్రల్లో ఎక్కువగా నరేషే కనిపిస్తున్నారు. అలాగే పవిత్ర కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తోంది.