MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Entertainment
  • Folk Song : 111M వ్యూస్ తో యూట్యూబ్ షేక్... ఆషాడమాసం బోనాల వేళ అమ్మవారి ఫోక్ సాంగ్ అదిరిపోయిందిగా..!

Folk Song : 111M వ్యూస్ తో యూట్యూబ్ షేక్... ఆషాడమాసం బోనాల వేళ అమ్మవారి ఫోక్ సాంగ్ అదిరిపోయిందిగా..!

Bonalu Folk Song : వర్షాకాలం మొదలయ్యింది.. వచ్చేనెలలో ఆషాడమాసం బోనాల వేడుకలు జరగనున్నాయి. ఈ సమయంలో ఓ తెలంగాణ బోనాల పాట 111M వ్యూస్ తో యూట్యూబ్ ను షేక్ చేస్తోంది. ఇంతకీ ఈ పాట ఏదో తెలుసా..?

3 Min read
Author : Arun Kumar P
Published : Jun 12 2026, 06:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
యూట్యూబ్ ను షేక్ చేస్తున్న తెలంగాణ బోనాలు సాంగ్
Image Credit : Screeshot to JDL Music Youtube Channel

యూట్యూబ్ ను షేక్ చేస్తున్న తెలంగాణ బోనాలు సాంగ్

Telangana Bonalu Folk Song : ఇప్పుడంతా జానపద పాటల హవా నడుస్తోంది. సినిమా పాటల కంటే ఫోక్ సాంగ్సే ప్రజల్లోకి ఎక్కువగా దూసుకెళుతున్నాయి... హిట్ టాక్ సాధిస్తున్నాయి. ''రాను బొంబైకి రాను" "ఓ పిలగ యెంకటేశు'' వంటి రొమాంటిక్ పాటలే కాదు తల్లిదండ్రులు, పిల్లల మధ్య ప్రేమను తెలియజేసే ''పేరుగళ్ల పెద్దిరెడ్డి'' వంటివి కూడా ఆకట్టుకుంటున్నాయి. ఇక బతుకమ్మ, బోనాలు పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు... ఈ పండగలు వచ్చాయంటే చాలు సరికొత్త ఫోక్ సాంగ్స్ అదరగొడుతుంటాయి. ఇలా గతేడాది బోనాలు సమయంలో వచ్చిన ''నా పేరే ఎల్లమ్మా... నేను జోగురాలమ్మ'' సాంగ్ ఏ స్థాయిలో జనాధరణ పొందిందో చూశాం. మళ్ళీ తెలంగాణలో ఆషాడ మాసం బోనాలకు సమయం దగ్గరపడుతున్నా అంటే సంవత్సరం గడిచినా ఈ సాంగ్ ప్రజల్లో సజీవంగా నిలిచింది... ఇంకా యూట్యూబ్ ను షేక్ చేస్తూనే ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నా పేరే ఎల్లమ్మ సాంగ్ దెబ్బకు యూట్యూబ్ రికార్డులు బ్రేక్
Image Credit : Screeshot to JDL Music Youtube Channel

నా పేరే ఎల్లమ్మ సాంగ్ దెబ్బకు యూట్యూబ్ రికార్డులు బ్రేక్

సాధారణంగా దేవుళ్ల పాటలకు పెద్దగా రీచ్ ఉండదు... కానీ బతుకమ్మ, బోనాల సమయంలో వచ్చే తెలంగాణ జానపదాలు చాలా గట్టిగా సౌండ్ చేస్తుంటాయి. యూట్యూబ్, సోషల్ మీడియా మాధ్యమాల్లో కోట్ల వ్యూస్... లక్షల్లో లైక్స్, కామెంట్స్ తో అదరగొట్టిన పాటలెన్నో ఉన్నాయి. ఇలా గత బోనాలు సమయంలో (జూలై 4, 2025) లో యూట్యూబ్ లో విడుదలైన 'నా పేరే ఎల్లమ్మ' సాంగ్ 111 మిలియన్స్ అంటే 111,157,144 వ్యూస్ తో దూసుకుపోతోంది... 374K లైక్స్ సాధించింది.

ఇక ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో ఈ పాటపై వందలాది రీల్స్ వచ్చాయి… ఇంకా వస్తూనే ఉన్నాయి. ఇప్పటికీ చిన్నాపెద్ద అని తేడాలేకుండా నా పేరే ఎల్లమ్మ పాటను పాడుకుంటున్నారు… స్టెప్పులు వేస్తున్నారు. మళ్లీ బోనాల పండగ వస్తున్నా ఈ ఫోక్ సాంగ్ కు ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదు... అంటే ఈసారి కూడా ఈ పాటే సందడి చేసేలా కనిపిస్తోంది.

Related Articles

Related image1
Folk Song : భార్యాభర్తలు కలిసి చూడాల్సిన ఫోక్ సాంగ్.. 14 కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ నే షేక్ చేస్తున్న జానపదం
Related image2
Folk Song: ఈ పాట వింటే పూనకాలే..120 మిలియన్లతో అప్పట్లో ఒక ఊపు ఊపేసింది
35
నా పేరే ఎల్లమ్మ సాంగ్ సాగుతుందిలా...
Image Credit : Screeshot to JDL Music Youtube Channel

నా పేరే ఎల్లమ్మ సాంగ్ సాగుతుందిలా...

''నా పేరే ఎల్లమ్మ.. నేను జోగురాలమ్మ'' అంటూ ఆకట్టుకునే పదాలతో ఈ ఫోక్ సాంగ్ ప్రారంభం అవుతుంది. తెలంగాణ ప్రజలు అనేక రూపాల్లో అమ్మవార్లను కొలుస్తుంటాయి... ఇలా ఎల్లమ్మ, కట్టమైసమ్మ, ముత్యాలమ్మ, మావురాలమ్మ, మారెమ్మలను స్తుతిస్తూ పాట సాగుతుంది. కోరినవాళ్లకు కొడుకులు, అడిగినవాళ్లకు ఆడబిడ్డలను ఇచ్చే అమ్మవార్లపై మరింత భక్తిని పెంచేలా ఈ పాటలో లిరిక్స్ ఉంటాయి. 

బోనాల పండగ సమయంలో ప్రజలు దేవాలయాలకు యాపకొమ్మలు తోరణాలుగా కట్టి యాటపిల్లలు అమ్మవార్లకు బలి ఇస్తారు... అమ్మవారికి నిమ్మకాయల దండలు వేసి సారె పోసి ఆషాడ హారతులు ఇస్తారు.. ఇలా బోనాల వేడుకల గురించి వివరిస్తూ కళ్లకు కడుతుంది ఈ ఎల్లమ్మ సాంగ్. అందుకే గత బోనాల వేడుకల్లో మారుమోగింది... ఈసారి కూడా మారుమోగనుంది.

45
నా పేరే ఎల్లమ్మ సాంగ్ లిరిక్స్...
Image Credit : Screeshot to JDL Music Youtube Channel

నా పేరే ఎల్లమ్మ సాంగ్ లిరిక్స్...

నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో

అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి

ఆరు గంపల్లా నేను ఆడినదన్నామో

అందరి ముంగాట నే అమ్మవారునే

కలియుగములోనా కన్నె మాతనంటిరే

ఎయ్యో యాపశెట్టంటి నాకు ఇంపుగాయెనే

నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో

అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి

అ సెరుకట్ట మీది అమ్మి కట్టమైసినే

నీ ఇంటి ముంగటనే సుట్టామైతినే

ఆ ముల్లోకాలేలే అ ముత్యాలమ్మనే

నన్ను సెరనన్నోలకి నేను షరుతులిద్దునే

అయ్యో కొరినోళ్లకు నేను కొడుకులిద్దునే

నన్ను అడిగినోళ్లకు ఆడబిడ్డలిద్దునే

నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో

అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి

అ మర్రి సెట్లల్లా నే మావురాలినే

ఆ ఒర్రెల ఒంపుల్లా నే ఒడ్డుకుంటినే

సుట్టు సెట్టు సెలకల్లా నేను సక్కని తల్లినే

ఆ గట్టు మీదున్న గౌండ్లాడి బిడ్డనే

ఆ మంద్దొడ్డకు నేను మారెమ్మ తల్లినే

ఆ గంగొడ్డుకు నేను గవురాల తల్లినే

నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో

అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి

తీరొక్క పేరు నాది తీరు బండారు

తిరుగారం గోల నాకు తీరుతమిద్దురు

అయ్యో ఆషాఢం ఎలా నాకు ఆరతులిద్దురు

అడ్డెడు బియ్యమ్ము నా ముంగట పోద్దురు

నా యాపరెల్లాలనే నాకు తోరణమిద్దురు

ఆ యాటా పిల్లలనే నాకు కనుకగిద్దురు

నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో

అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి

నిమ్మకాయ దండలనే నాకు నిండుగేద్దురే

ఆ సీరే బట్టలనే నాకు సారే పోద్దురే

నా అక్క సెల్లెల్లె నాకు పాటలు పాడుదురే

నా అకిట్ల అలికి బోట్ల పట్నాలేద్దురే

అమ్మ శరణు శరణంటూ మాట సగాదిద్దురే

తల్లి శరణాలే అంటూ నన్ను ఆరాదిద్దురే

నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో

అయ్యో జోడు గంపల్లా నన్ను జోల జోలాంటి

55
నా పేరే ఎల్లమ్మ సాంగ్ ను రూపొందించిన టీమ్ ఇదే...
Image Credit : Screeshot to JDL Music Youtube Channel

నా పేరే ఎల్లమ్మ సాంగ్ ను రూపొందించిన టీమ్ ఇదే...

తెలంగాణలో ఆషాడమాసం బోనాలకు కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది నా పేరే ఎల్లమ్మ సాంగ్. ఈ పాటకు ప్రాణం పోసింది ప్రముఖ ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ. ఆమె డ్యాన్స్ అదరగొడుతుందని అందరికీ తెలుసు... కానీ ఈ పాటలో తన హావభావాలతో కట్టిపడేసింది. అమ్మవారిలా ఆమె నటన చూస్తే ప్రతిఒక్కరు ఫిదా అవ్వాల్సిందే. ఈ ఎల్లమ్మ పాటద్వారా నాగదుర్గ మరోమెట్టు ఎక్కేశారు... మరింతమంది అభిమానులను సంపాదించుకున్నారు.

ఇక రాజేందర్ కొండ ఈ లిరిక్స్ అందించారు... అతడు రాసిన మాటలు సింగర్ ప్రభ గొంతుతో వినసొంపుగా మారాయి. ఇక మదీన్ ఎస్కే అందించిన మ్యూజిక్ ఈ పాటను మరోస్థాయికి తీసుకెళ్లింది. కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్ అదిరిపోయేలా నాగదుర్గతో స్టెప్పులు వేయించారు. ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వెయ్యలేదు ప్రొడ్యూసర్ దర్గుపల్లి ప్రభాకర్. ఇలా పర్ఫెక్ట్ టీమ్ కుదరడంతో 'నా పేరే ఎల్లమ్మ' వీడియో సాంగ్ ఇంత అద్భుంతంగా వచ్చింది... అదే స్థాయిలో హిట్ అయ్యింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వినోదం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Agnipariksha 2: రైతు బిడ్డ సింగర్‌ ఝాన్సీ సంచలనం.. బిగ్‌ బాస్‌ తెలుగు 10 ఫస్ట్ కంటెస్టెంట్‌ కన్ఫమ్‌
Recommended image2
Actor Soori: నాతో నటించడానికి హీరోయిన్లు భయపడ్డారు.. సూరి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Raj Tarun: రాజ్‌ తరుణ్‌ `టార్జాయిస్‌` నుంచి అదిరిపోయే మెలోడీ.. కట్టిపడేస్తున్న `నీ పరిచయం` సాంగ్‌
Related Stories
Recommended image1
Folk Song : భార్యాభర్తలు కలిసి చూడాల్సిన ఫోక్ సాంగ్.. 14 కోట్ల వ్యూస్ తో యూట్యూబ్ నే షేక్ చేస్తున్న జానపదం
Recommended image2
Folk Song: ఈ పాట వింటే పూనకాలే..120 మిలియన్లతో అప్పట్లో ఒక ఊపు ఊపేసింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved