NTR: ఎన్టీఆర్ పై ఆయనలా స్పందించడం అనూహ్యమే... ఇదేం ట్విస్ట్ సామీ!
సోషల్ మీడియాలో ఎన్టీఆర్, చంద్రబాబు అభిమానుల మధ్య వార్ నడుస్తూనే ఉంది. భువనేశ్వరి ఎపిసోడ్ తో ప్రజల్లో సానుభూతి పొందడంతో పాటు, జూనియర్ ఎన్టీఆర్ పై టీడీపీ క్యాడర్ లో ఉన్న క్రెడిబిలిటీ దెబ్బతీయాలని నారా చంద్రబాబు గొప్ప ప్రణాళిక వేశారు. ఆయన ఒక వైపు నుండి వైసీపీ నాయకులను టార్గెట్ చేస్తుంటే... మరోవైపు టీడీపీ నేతలు ఎన్టీఆర్ పై విమర్శల దాడికి దిగారు.
కొందరు అభిమానులు ఎన్టీఆర్ (NTR)స్పందించిన తీరు చాలా బాధాకరమని, ఆయన ఫ్యాన్స్ అయినందుకు సిగ్గు పడుతున్నామంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. కొందరైతే నీ తాత పేరును వదులుకో, ఆ పేరు పెట్టుకునే అర్హత నీకు లేదంటూ పరుష పదజాలంతో వీడియో బైట్స్ విడుదల చేశారు.
నేతల విమర్శలతో పాటు, ఫ్యాన్స్ పేరుతో ఎన్టీఆర్ పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్న ఈ గ్యాంగ్ వెనుక చంద్రబాబు, నారా లోకేష్ హస్తం ఉందని ఆయన అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. అదే సమయంలో ఎన్టీఆర్ ని టార్గెట్ చేయడం టీడీపీలోని ఓ వర్గానికి ఆగ్రహం తెప్పించింది. టీడీపీ రెండు వర్గాలుగా విడిపోయింది. మేనత్త ఆత్మగౌరవం పేరుతో ఎన్టీఆర్ ని బద్నామ్ చేద్దామని బాబు వేసిన ప్లాన్ బెడిసి కొట్టినట్లు తెలుస్తోంది. దీని వలన ప్రయోజనం కంటే, నష్టమే ఎక్కువ జరుగుతుందని భావించిన బాబు, నష్ట నివారణ చర్యలు చేపట్టారు.
బాలకృష్ణ (Balakrishna)చిన్న అల్లుడు భరత్ లేటెస్ట్ కామెంట్స్ దీనికి ఉదాహరణ భరత్ ఈ విషయంలో ఎన్టీఆర్ కి సప్పోర్ట్ గా మాట్లాడడం, ఒకింత ఆశ్చర్యం కలిగించింది. ఎన్టీఆర్ చాలా పరిపక్వతతో మాట్లాడారు. కుటుంబానికి జరిగిన అవమానంపై ఆయన బయటకు వచ్చి మాట్లాడడం అభినందించదగ్గ విషయం. అంతే కానీ ఆయన అలా మాట్లాడలేదు, ఇలా మాట్లాడలేదు అని కార్నర్ చేయడం సరికాదన్నారు.
ఒకప్పుడు ఎన్టీఆర్ సేవలు పార్టీకి అవసరం లేదన్న భరత్... ఇలా ఆయనకు మద్దతుగా మాట్లాడం అందరికీ షాక్ ఇచ్చింది. ఎన్టీఆర్ కంటే సమర్థులు, సీనియర్స్ పార్టీలో ఉన్నారని, వాళ్ళ సారధ్యంలో టీడీపీ పార్టీ సక్సెస్ ఫుల్ గా ముందు సాగుతుంది. ఎన్టీఆర్ వచ్చినా రాకున్నా టీడీపీ పార్టీకి ఒరిగేదేమీ లేదని గతంలో భరత్ అన్నారు. అలాంటి భరత్ ఎన్టీఆర్ కి మద్దతుగా నిలవడం వెనుక బాబు పాత్ర ఉండే అవకాశం కూడా కలదని కొందరి అభిప్రాయం.
మరోవైపు బాలయ్య అఖండ (Akhanda) ప్రీ రిలీజ్ వేదికగా ఆర్ ఆర్ ఆర్ (RRR movie)మూవీ గురించి స్పందించారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ విడుదల కాబోతుంది. ఆ సినిమా కూడా భారీ విజయం సాధించాలని కోరుకుంటున్నా అంటూ బాలయ్య కామెంట్ చేయడం కొత్త సమీకరణాలకు దారితీసింది.
టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న బాలకృష్ణ ఎప్పుడూ బావ చంద్రబాబు వెంటే.. దాని కోసం అన్న హరికృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్ ని కూడా దూరం పెట్టిన సందర్భాలు ఉన్నాయి. బాలయ్య సైతం ఎన్టీఆర్ రాక టీడీపీకి అవసరం లేదని ఓ సందర్భంలో ఓపెన్ గా చెప్పారు. సడన్ గా ఎన్టీఆర్ గురించి బాలయ్యతో పాటు భరత్ స్వరం మారడం వెనుక కారణం ఏమిటో అర్థం కావడం లేదు.
చంద్రబాబు (Chandrababu)పై గుస్సాతో ఉన్న జూనియర్ ని బుజ్జగించి, 2024 అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వాడుకోవాలనే వూహ్యం కూడా దీని వెనుక ఉండవచ్చు. ఏదిఏమైన రానున్న రెండేళ్లలో టీడీపీ పార్టీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకోవడం ఖాయం.
Also read NTR vs Lokesh: చంద్రబాబుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ సెగ... రెండుగా చీలిన టీడీపీ