మేం తల దించుకోం.. తల తెంచుకుని వెళ్లిపోతాం..!

సూపర్ హిట్టైన ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో బాలకృష్ణ రెండు పాత్రల్లో సందడి చేస్తారు. ప్రగ్యా జైశ్వాల్‌, పూర్ణ హీరోయిన్స్. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. 

Nandamuri Balakrishna Akhanda Mass Jathara trailer released

నందమూరి అభిమానులుతో పాటు సినీ లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘అఖండ’(Akhanda). సింహా, లెజెండ్ లాంటి బ్లాక్‌బస్టర్ల తర్వాత నందమూరి బాలకృష్ణ(Balakrishna), బోయపాటి శ్రీనుల కలయికలో రూపొందుతున్న చిత్రం కావటంతో మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. కరోనా వేవ్ తర్వాత శరవేగంగా జరుపుకున్న Akhandaఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవడానికి రెడీగా ఉంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.  'అఖండ మాస్ జాతర' పేరుతో రిలీజ్ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది.

 

'అఖండ'  లో బాలయ్య పోషిస్తున్న రెండు పాత్రల చూపిస్తూ కట్ చేసిన ఈ యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్ ఫ్యాన్స్ కు పండగ చేసుకునేలా ఉంది. 'నేనే.. త్రిపురానాశక రక్షకుడు.. శివుడు' అంటూ ప్రారభమైన అఘోరా పాత్ర చాలా శక్తివంతంగా కనిపిస్తోంది. బాలకృష్ణ కెరీర్ లోనే ఇది గుర్తుండిపోయే క్యారక్టర్ అంటున్నారు. ఈ ట్రైలర్ చూస్తే ఇందులో యాక్షన్ సీక్వెన్స్ లు నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయని అర్దమవుతోంది. అలాగే బాలయ్య తనదైన స్టైల్ లో చెప్పిన 'మేం ఎక్కడికైనా వస్తే తల దించుకోం.. తల తెంచుకుని వెళ్ళిపోతాం..' 'దేవుణ్ణి కరుణించమని అడుగు.. కనిపించమని కాదు..' వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి.   
 
సూపర్ హిట్టైన ‘సింహా’, ‘లెజెండ్‌’ తర్వాత బాలకృష్ణ - బోయపాటి శ్రీను కలయికలో రూపొందుతున్న చిత్రమిది. ఇందులో బాలకృష్ణ రెండు పాత్రల్లో సందడి చేస్తారు. ప్రగ్యా జైశ్వాల్‌, పూర్ణ హీరోయిన్స్. మిర్యాల రవీందర్‌రెడ్డి నిర్మాత. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ - గోపీచంద్‌ మలినేని కలయికలో ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. ఆ తర్వాత బాలకృష్ణ చేయనున్న చిత్రం ఖరారైన విషయం తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహించనున్నారు.

 ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయని సమాచారం. అంతేకాదు ఈ అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఫిగర్స్ టచ్ చెయ్యనున్నట్టుగా తెలుస్తోంది.   ఈ సినిమా మొత్తం ఆంధ్ర హక్కులు రూ. 35 కోట్ల కు అమ్ముడయ్యాయి, నైజాం ప్రాంతం రూ. 10 కోట్లుకు అమ్మడు అయ్యాయని... సీడెడ్ రీజియన్ హక్కులు రూ .12 కోట్లకు అమ్ముడు పోయాయని చెప్తున్నారు.  

మరో ప్రక్క ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. అఖండ షూటింగ్ పూర్తి అవ్వడంతో ఇక బాలయ్య మరో సినిమాను మొదలు పెట్టనున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను ద్వారక ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.

also read: Akhanda: ఆ విషయంలో ఎన్టీఆర్‌ తర్వాత బాలయ్యనే: బన్నీ ప్రశంసలు.. రెండు రాష్ట్రాలకు బాలకృష్ణ రిక్వెస్ట్

also read: Akhanda: బాలయ్య ఒక ఆటంబాంబ్‌ః రాజమౌళి సంచలన వ్యాఖ్యలు.. బన్నీపై నో కామెంట్‌.. ఫ్యాన్స్ ఫైర్‌
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios