మెగాస్టార్ పై ఇలాంటి ట్రోల్స్ ఏంటీ?.. గెస్ట్ గా వెళితే ఫ్లాప్ అంట గడుతున్నారే?
మెగాస్టార్ చిరంజీవి అంటే టాలీవుడ్‌కి పెద్ద దిక్కులాంటి వారు. కానీ ఆయనపై షాకింగ్ ట్రోల్స్ వైరల్ అవుతున్నాయి. ఆయనకు ఫ్లాప్ సెంటిమెంట్ మూటగడుతుండటం విచారకరం.

చిరంజీవి(Chiranjeevi) ఇండస్ట్రీకి పెద్దలా పేరుతెచ్చుకోవడంతో సినిమా ఫంక్షన్లకి ఆయన్ని గెస్ట్ గా పిలుస్తున్నారు. చిరంజీవి వస్తే సినిమాకి మంచి ప్రమోషన్ అవుతుందని, సినిమాకి అది హెల్ప్ అవుతుందని భావిస్తున్నారు మేకర్స్. చిరు సైతం చిన్న సినిమాలను, తన సహాయం కోరిన వారిని కాదనుకుండా ఈవెంట్లకి వెళ్తున్నారు. సినిమా టీజర్, ట్రైలర్లు విడుదల చేస్తూ తనవంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ విషయంలో ఆయనకు అంతా థ్యాంక్యూ చెప్పుకుంటున్నారు.
కానీ ఆయనకు ఫ్లాప్‌లను అంటగట్టడమే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. చిరంజీవి గెస్ట్ (Chiranjeevi Guest) గా వెళ్లిన ప్రతి సినిమా ఫ్లాప్ అవుతుందని, అది పరాజయం చెందుతుందనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. చిరంజీవి ఇటీవల చాలా సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్లాడు. తాప్సీ నటించిన `మిషన్ ఇంపాజిబుల్` చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కి వెళ్లాడు చిరు. ఆ సినిమా నిర్మాత నిరంజన్ రెడ్డి `ఆచార్య` నిర్మాత కావడంతో ఆయన ఆహ్వానం మేరకు ఈవెంట్‌కి వెళ్లి బ్లెస్సింగ్స్ అందించారు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది.
మరోవైపు ఇటీవల గోపీచంద్ హీరోగా నటించిన `పక్కా కమర్షియల్` చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కి సైతం గెస్ట్ గా వెళ్లారు. అల్లు అరవింద్ బ్యానర్‌కావడంతో ఆయన పిలుపు మేరకు గెస్ట్ గా వెళ్లారు. సినిమాకి తనదైన స్టయిల్లో ప్రమోషన్ చేసి పెట్టాడు. కానీ ఆ సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టింది. అప్పుడే చిరుపై కొన్ని విమర్శలు వచ్చాయి.
ఇటీవల `ఫస్ట్ డే ఫస్ట్ షో` సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సైతం గెస్ట్ గా వెళ్లాడు. ఆ సినిమా కూడా ఘోరంగా పరాజయం చెందింది. మరోవైపు `లాల్ సింగ్ చద్దా` సినిమాని తెలుగులో ప్రజెంట్ చేశారు. సినిమా ప్రమోషన్‌లోనూ పాల్గొన్నాడు. ఆ సినిమా సైతం డిజాస్టర్‌గా నిలిచింది. ఇలా ఇటీవల కాలంలో చిరంజీవి గెస్ట్ గా చేసిన ప్రతి సినిమా పరాజయం చెందింది. దీంతో ఆయనపై ఫ్లాప్‌సెంటిమెంట్‌ని మూటగడుతున్నారు నెటిజన్లు.
చిరంజీవి గెస్ట్ గా వెళ్లాడంటే ఆ సినిమా పోయినట్టే అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇవన్నీ ఉదాహరణలుగా చెబుతూ వైరల్ చేస్తున్నాయి. అయితే ఎన్టీఆర్ గెస్ట్ గా వెళ్లితే సినిమా హిట్ అట. మరి ఇటీవల `బ్రహ్మాస్త్ర`కి ఎన్టీఆర్ వెళ్లాడు. ఆ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది. మెగా అభిమానులు సైతం ఇలాంటి ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరి రిజల్ ఎలా ఉంటుందో చూడాలి.
అయితే చిరంజీవి చిన్న సినిమాలను, తనని సాయం కోరిన వారిని పెద్ద మనసుతో తనవంతు సహకారాన్ని అందించాలనే స్వచ్ఛమైన కాంక్షతోనే ఈవెంట్లకు వెళ్తున్నారు. సినిమా బాగా లేనందుకు, కంటెంట్ లో స్టఫ్ లేనందుకు, సినిమా పోయినందుకు ఆయన్ని బదనాం చేయడం పట్ల మెగా అభిమానులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సహాయం చేయడం కూడా తప్పేనా అంటూ ఎదురు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ సెంటిమెంట్‌కి ఎప్పుడు బ్రేక్ పడుతుందో చూడాలి.