BB Telugu 7 Top 5: లేటెస్ట్ సర్వే... బిగ్ బాస్ తెలుగు 7 టాప్ 5 కంటెస్టెంట్స్ వీరే! ఆ కంటెస్టెంట్ కి షాక్!
మరో ఆరు వారాల్లో బిగ్ బాస్ తెలుగు 7 ముగియనుంది. హౌస్లో 12 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. వీరిలో ఎవరు విన్నర్ అనే అంచనాలు మొదలయ్యాయి. ఒక సర్వే ప్రకారం టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరో చూద్దాం..
బిగ్ బాస్ క్రేజియస్ట్ రియాలిటీ షో. ఎక్కడో బ్రిటన్ లో బిగ్ బ్రదర్ గా ఫస్ట్ ప్రసారమైంది. దాని ఆధారంగా ఇండియాలో హిందీ భాషలో బిగ్ బాస్ షోగా ప్రాచుర్యం పొందింది. అన్ని ప్రధాన భాషలకు బిగ్ బాస్ షో వ్యాపించింది. తెలుగులో 2017లో ప్రారంభమైంది. ప్రస్తుతం సీజన్ 7 ప్రసారం అవుతుంది. నాగార్జున హోస్ట్ గా వ్యహరిస్తున్నారు. షో 9 వారాలు పూర్తి చేసుకుంది. హౌస్లో 12 మంది ఉన్నారు. నేడు ఒకరు ఎలిమినేట్ కానున్నారు.
బిగ్ బాస్ సీజన్ 7 మరో ఆరు వారాల్లో పూర్తి కానుంది. మరి ఫైనల్ కి వెళ్ళేది ఎవరు? టైటిల్ కొట్టేది ఎవరు? అనే చర్చ మొదలైంది. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సర్వే నిర్వహించగా షాకింగ్ ఫలితాలు వచ్చాయి. ప్రతి నెలా ఆర్మాక్స్ సర్వే నిర్వహిస్తోంది. నవంబర్ ఫలితాల ప్రకారం... శివాజీ టాప్ లో ఉన్నారు. వయసులో, అనుభవంలో పెద్దవాడైన శివాజీ కూల్ గా గేమ్ ఆడుతూ ఆడియన్స్ లో ఫేమ్ రాబట్టాడు.
రెండో స్థానంలో పల్లవి ప్రశాంత్ ఉన్నాడు. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ అంచనాలకు మించి రాణిస్తున్నాడు. సింపతీ గేమ్ అంటూ అతని ఆత్మస్తైర్యం దెబ్బతీయాలని చూశారు. అయితే టాస్క్ లలో రాణిస్తూ తనదైన గేమ్ తో టాప్ కంటెస్టెంట్ లో ఒకరిగా అవతరించాడు. హౌస్ కి ఫస్ట్ కెప్టెన్ అయ్యాడు.
మూడో స్థానం ప్రియాంకకు దక్కింది. ఈమె ఇటీవల కెప్టెన్సీ కంటెండర్ అయ్యింది. నాలెడ్జ్ గేమ్ లో మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. స్ట్రాంగ్ ప్లేయర్ కాకున్నా సీరియల్ నటిగా ఆమెకు ఫ్యాన్ బేస్ ఉంది.
నాలుగో స్థానంలో అమర్ దీప్ ఉన్నాడు. ఇతడు హౌస్లోకి వచ్చాక వెర్రి పప్ప అయ్యాడు. ఆడియన్స్ విపరీతంగా ట్రోల్ చేశారు. రెండు వారాలుగా పర్లేదు అనిపిస్తున్నాడు. సీరియల్ హీరో కావడంతో బుల్లితెర ప్రేక్షకుల్లో ఫాలోయింగ్ ఉంది.
ఇక ఐదో స్థానంలో గౌతమ్ ఉన్నాడు. డాక్టర్ కమ్ యాక్టర్ అని గౌతమ్ తన ఆట తీరు మెరుగు పరుచుకుంటూ ఆడియన్స్ లో ఆదరణ రాబడుతున్నాడు. గౌతమ్ నాలుగో కెప్టెన్ అయ్యాడు. లేటెస్ట్ రిజల్ట్స్ ప్రకారం.. శివాజీ, ప్రశాంత్ టైటిల్ కోసం పోటీపడుతున్నారు. టాప్ 5 లో అమర్, ప్రియాంక, గౌతమ్ ఉన్నారు. శోభకు చోటు దక్కలేదు.