MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • షాకింగ్ సర్వే బిగ్ బాస్ తెలుగు 6 టాప్-5 కంటెస్టెంట్స్ వీళ్ళే... మరి టైటిల్ కొట్టేది ఎవరు?

షాకింగ్ సర్వే బిగ్ బాస్ తెలుగు 6 టాప్-5 కంటెస్టెంట్స్ వీళ్ళే... మరి టైటిల్ కొట్టేది ఎవరు?

బిగ్ బాస్ సీజన్ 6 వాడి వేడిగా నడుస్తుంది. రెండు వారాలు పూర్తి కాగా కంటెస్టెంట్స్ పై ఆడియన్స్ కి ఒక క్లారిటీ వచ్చేసింది. అలాగే హౌస్ మేట్స్ ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. కొందరు మిత్రులయ్యారు. మరికొందరు శత్రువులు అయ్యారు. 

2 Min read
Author : Sambi Reddy
| Updated : Sep 14 2022, 02:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
Bigg boss telugu 6

Bigg boss telugu 6


ప్రస్తుతం హౌస్ లో 21 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు. గత వారం ఇనయ సుల్తానా, అభినయశ్రీలలో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంది. అయితే బిగ్ బాస్ ఇద్దరినీ సేవ్ చేశాడు. ఇకపై మంచి గేమ్ ఆడి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని హోస్ట్ నాగార్జున వాళ్లను హెచ్చరించారు. ఈసారి కంటెస్టెంట్స్ లో చాలా మంది స్ట్రాంగ్ గా ఉన్నారు. ఒకరికి మించి మరొకరు అసలు తగ్గడం లేదు. 
 

27


ఇక ఈ వారం ఎలిమినేషన్స్ కి ఎనిమిది మంది నామినేట్ అయ్యారు. రాజశేఖర్, షాని, రోహిత్-మెరీనా,  ఫైమా, ఆదిరెడ్డి, రేవంత్ , గీతూ రాయల్, అభినయశ్రీ ఎలిమినేషన్స్ లో ఉన్నారు. వీరి నుండి ప్రేక్షకుల ఓట్ల ఆధారంగా ఒకరు హౌస్ నుండి వెళ్లిపోనున్నారు. 
 

37
Bigg boss Telugu 6

Bigg boss Telugu 6

టాప్ కంటెస్టెంట్ గా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన రోహిత్ ఆటతీరు జనరంజకంగా లేదు. అతని యాటిట్యూడ్, పొగరు ఇంటి సభ్యులతో పాటు ఆడియన్స్ లో నెగిటివ్ ఇంపాక్ట్ తీసుకొస్తుంది. మెజారిటీ కంటెస్టెంట్స్ రేవంత్ ని వ్యతిరేకిస్తున్నారు. ఇతర కంటెస్టెంట్స్ ని చులకనగా చూడటం, తాను అందరి కంటే గొప్పగా ఫీల్ కావడం రేవంత్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తుంది. అతడు చెత్త గేమ్ తో టైటిల్ అవకాశాలు గల్లంతు చేసుకుంటున్నాడు.

47
Bigg boss telugu 6

Bigg boss telugu 6


కాగా బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్స్ లో ఎవరు ప్రేక్షకుల ఫేవరేట్ గా ఉన్నారు. ఎవరి ఫేమ్ ఎలా ఉందనే సమాచారం అందుతుంది. ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ సర్వే ప్రకారం టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరో తేలిపోయింది. బిగ్ బాస్ ప్రేక్షకుల ఓటింగ్ ఆధారంగా నిర్ణయించిన ఈ సర్వే రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం... 
 

57


ఆర్మాక్స్ సర్వే ప్రకారం సింగర్ రేవంత్ టాప్ పొజిషన్ లో ఉన్నాడు. ఇండియన్ ఐడల్ విజేతగా రేవంత్ కి ఇండియా వైడ్ గుర్తింపు ఉంది. అలాగే అతడు స్టార్ సింగర్ గా కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో అతడికి ఆడియన్స్ టాప్ పొజిషన్ ఇచ్చారు. ఇక 2వ ప్లేస్ యూట్యూబర్ శ్రీహాన్ కి దక్కింది. 

67
Bigg boss telugu 6

Bigg boss telugu 6

జబర్దస్త్ కమెడియన్ చలాకీ చంటి 3వ స్థానంలో ఉన్నాడు. టెలివిజన్ సెలబ్రెటీగా చలాకీ చంటి మంచి పాపులారిటీ కలిగి ఉన్నాడు. అనూహ్యంగా 4వ స్థానం యూట్యూబర్ ఆదిరెడ్డికి ఇచ్చారు ప్రేక్షకులు. ఆదిరెడ్డి బిగ్ బాస్ రివ్యూవర్ గా ఫేమస్. ఇక 5వ స్థానం యాంకర్ నేహా చౌదరికి దక్కింది. ఈ రెండు వారాలలో నేహ మంచి ఆటతీరు కనబరిచింది. ఆ కారణంగా ఆమె టాప్ ఫైవ్ లో స్థానం సంపాదించుకున్నారు. 
 

77

అయితే ఈ ర్యాంకింగ్స్ ప్రస్తుతానికి మాత్రమే. వారాలు గడిచే కొద్దీ వాళ్ళ ఆటతీరు ఆధారంగా ర్యాంకింగ్స్ మారిపోతాయి. టాప్ ఫైవ్ లో ఉన్నవాళ్లు క్రింది పడిపోవచ్చు. లేని వాళ్ళు పైకి ఎగబాకవచ్చు. అసలు ఎప్పుడు టాప్ ఫైవ్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఫైనల్ లో కనిపించకపోవచ్చు. ఇది బిగ్ బాస్ షో కాబట్టి ఏదైనా జరగవచ్చు.

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
బిగ్ బాస్ తెలుగు
Latest Videos
Recommended Stories
Recommended image1
Madhavi Deverakonda: కొడుకు పెళ్లిలో అందరి మనసులు గెలిచిన విజయ్ దేవరకొండ తల్లి..
Recommended image2
ఏఎన్నార్ బయోపిక్ ఎప్పుడు? నాగార్జున, నాగచైతన్య లలో హీరోగా నటించబోయేది ఎవరు?
Recommended image3
Karthika Deepam 2 Today Episode: జ్యో మాస్టర్ ప్లాన్- ఇరుక్కున్న దీప, కార్తీక్- నిజం బయటపడుతుందా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved