MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • భూమా మౌనికతో మంచు మనోజ్ వివాహం..మోహన్ బాబుకి ఇష్టం లేదా? మంచు ఫ్యామిలిలో ఆస్తి పంపకాలు..

భూమా మౌనికతో మంచు మనోజ్ వివాహం..మోహన్ బాబుకి ఇష్టం లేదా? మంచు ఫ్యామిలిలో ఆస్తి పంపకాలు..

మంచు మనోజ్ టాలీవుడ్ లో నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కెరీర్ ఆరంభంలో యూత్ ఫుల్ చిత్రాలతో మంచు మనోజ్ అలరించాడు. ఆ తర్వాత కెరీర్ ట్రాక్ తప్పింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా మనోజ్ మంచి మనసున్న వ్యక్తి అని అభిమానులు ప్రశంసిస్తుంటారు. 

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Sep 05 2022, 04:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

మంచు మనోజ్ టాలీవుడ్ లో నటుడిగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. కెరీర్ ఆరంభంలో యూత్ ఫుల్ చిత్రాలతో మంచు మనోజ్ అలరించాడు. ఆ తర్వాత కెరీర్ ట్రాక్ తప్పింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా మనోజ్ మంచి మనసున్న వ్యక్తి అని అభిమానులు ప్రశంసిస్తుంటారు. ఇదిలా ఉండగా మంచు మనోజ్ త్వరలో రెండో వివాహానికి రెడీ అవుతున్నట్లు మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఇటీవల మనోజ్.. భూమా మౌనికతో కలసి గణేష్ పూజలో కనిపించాడు. భూమా మౌనిక పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి కావడంతో ఈ న్యూస్ ప్రస్తుతం టాలీవుడ్ అండ్ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. గత కొంతకాలం నుంచి మనోజ్, మౌనిక రిలేషన్ షిప్ లో ఉన్నట్లు తెలుస్తోంది. కర్నూలు రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన దివంగత భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతుల కుమార్తె భూమా మౌనిక. భూమా మౌనిక సోదరు అభిలప్రియ కూడా రాజకీయాల్లో ఉన్న సంగతి తెలిసిందే. 

36

మౌనికతో వివాహం గురించి మంచు మనోజ్ ని మీడియా ప్రశ్నించగా అది తన వ్యక్తిగత విషయం అని, సమయం వచ్చినప్పుడు చెబుతానని హింట్ ఇచ్చారు. దీనితో మనోజ్, మౌనిక వివాహం ఖాయం అని అంతా భావిస్తున్నారు. అయితే మౌనికతో వివాహానికి మనోజ్ తన ఫ్యామిలిలో వ్యతిరేకత వ్యక్తం అవుతున్నట్లు తెలుస్తోంది. 

46

మౌనికని మంచు మనోజ్ వివాహం చేసుకోవడం మోహన్ బాబుకి నచ్చడం లేదు అని ప్రచారం జరుగుతోంది. దీనితో మంచు మనోజ్ కుటుంబంతో విభేదిస్తున్నారట. మనోజ్ పట్టు పట్టడంతో కుటుంబ సభ్యులు ఈ వివాహానికి అయిష్టంగానే అంగీకరించినట్లు తెలుస్తోంది. వివాహం తర్వాత మోహన్ బాబు ఆస్తి పంపకాలు చేసేందుకు నిర్ణయించుకున్నారట. 

56

ఆస్తిని విష్ణు, మనోజ్ ఇద్దరికీ సమానంగా పంచేస్తానని.. ఎవరి లైఫ్ వారు బతకాలని మోహన్ బాబు తేల్చేసినట్లు తెలుస్తోంది. 2015లో మనోజ్ ప్రణీత రెడ్డి అని అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. కానీ కొంతకాలం తర్వాత వీరిద్దరూ విడిపోయారు. ఇక భూమా మౌనికకి కూడా గతంలో వివాహం జరిగింది. బెంగుళూరుకి చెందిన వ్యాపార వేత్తతో మౌనిక వివాహం జరిగింది. కానీ అతడి నుంచి మౌనిక విడాకులు తీసుకుంది. 

66

చాలా కాలం నుంచి మంచు మనోజ్ నటించడం లేదు. అహం బ్రహ్మాస్మి అనే చిత్రం ఇంకా పూర్తి కాలేదు. అయితే భూమా మౌనికతో వివాహం తర్వాత మనోజ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జరుగుతున్న ఈ ప్రచారంలో వాస్తవం ఎంతుందో తేలాల్సి ఉంది. 

About the Author

SG
Sreeharsha Gopagani
మంచు మనోజ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Aamir Khan Wedding: ఆమిర్ ఖాన్ కి ఆయన మూడో భార్యకి మధ్య నిజమైన ఏజ్ గ్యాప్ ఎంత ?
Recommended image2
Star Debuts: టాలీవుడ్ స్టార్ల తమ్ముళ్లు, కొడుకులు, అల్లుళ్ళ ఫస్ట్ మూవీస్ ఇవే..దమ్ము చూపించిన హీరోలు ఇద్దరే
Recommended image3
Trisha Krishnan: తిరుగులేని స్టార్‌ గా త్రిష.. ఆ నటితో పోల్చితూ ఆకాశానికి ఎత్తుతున్న కోలీవుడ్‌.. కారణమిదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved