MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Apoorva Eliminated: గొడవలు అరుపులు, ఓవర్ యాక్షన్ వల్ల.. బిగ్ బాస్ నుంచి అపూర్వ ఎలిమినేట్? నిజమెంత?

Apoorva Eliminated: గొడవలు అరుపులు, ఓవర్ యాక్షన్ వల్ల.. బిగ్ బాస్ నుంచి అపూర్వ ఎలిమినేట్? నిజమెంత?

Apoorva Eliminated: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో ఎప్పటికప్పుడు పరిణామాలు మారిపోతున్నాయి. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నవారు కూడా వారాలు గడుస్తున్న కొద్ది వీక్ అయిపోతున్నారు. ఈ వారం బిగ్ బాస్ హౌస్ ను వీడుతున్నది ఎవరో తెలుసా?

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 10 2026, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఊహించని మలుపులు తిరుగుతున్న బిగ్ బాస్ సీజన్ 10
Image Credit : Asianet News

ఊహించని మలుపులు తిరుగుతున్న బిగ్ బాస్ సీజన్ 10

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10 రోజురోజుకూ సరికొత్త వివాదాలు, అనూహ్య మలుపులతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నామినేషన్ల ప్రక్రియ దగ్గరి నుంచి హౌస్‌లో జరిగే ప్రతి చిన్న పరిణామం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఈ నేపథ్యంలో హౌస్‌లో కంటెస్టెంట్ల ప్రవర్తన దారుణంగా ఉంటోంది. ముఖ్యంగా కొంత మంది హౌస్ మెట్స్ ఓవరాక్షన్, అనవసరమైన అరుపులపై ప్రేక్షకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఆటపై దృష్టి పెట్టకుండా కేవలం వివాదాలు, డ్రామాలకే పరిమితమయ్యే కంటెస్టెంట్లకు ఈ వారం ఎలిమినేషన్ రూపంలో గట్టి షాక్ తగిలిందనే చర్చ నెట్టింట జోరుగా సాగుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గోల గోలగా నామినేషన్లు..
Image Credit : Asianet News

గోల గోలగా నామినేషన్లు..

ఐదో వారం నామినేషన్ల ప్రక్రియ అత్యంత ఉత్కంఠభరిత వాతావరణంలో ముగిసింది. ఈ వారం నామినేషన్లలో అపూర్వ, షాలిని, రోహిత్, చరణ్, నరేష్ వంటి పలువురు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లో నిలిచారు. ముఖ్యంగా 'అగ్నిపరీక్ష' ద్వారా కామనర్ కంటెస్టెంట్‌గా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చి, హౌస్‌లోకి అడుగుపెట్టిన అపూర్వ ప్రవర్తన ఈ వారం తీవ్ర విమర్శలకు గురైంది. ఆట మీద, టాస్కుల మీద ఫోకస్ పెట్టాల్సిన సమయంలో ఆమె ఎక్కువగా అరుపులు, వాగ్వాదాలు , ఓవర్ యాక్షన్‌తోనే హైలైట్ అయిందనే అపవాదు మూటగట్టుకుంది. ఆమెతో పాటు షాలినీ పై కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

34
గేమ్‌ను పక్కనపెట్టి డ్రామాలకు పెద్దపీట?
Image Credit : Asianet News

గేమ్‌ను పక్కనపెట్టి డ్రామాలకు పెద్దపీట?

గత వారం నాగార్జున వార్నింగ్ ఇచ్చినా కానీ అపూర్వ తన బిహేవియర్ ను మార్చుకోలేదన్న విమర్శలు వస్తున్నాయి. అపూర్వతో పాటు షాలిని హౌస్‌లో ప్రవర్తించిన తీరుపై సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తోటి కంటెస్టెంట్లతో గొడవ పడుతూ.. నోటికి వచ్చినట్టు మాట్లాడుతుండటం, అటు షాలినీ కూడా రోహిత్‌తో అర్థరాత్రి వరకు ముచ్చట్లు పెట్టడం, ప్రతి చిన్న విషయానికి పెద్ద డ్రామాగా మార్చడం పెద్ద విషయంగా మారింది. దాంతో ఈ ఇద్దరు కంటెస్టెంట్స్ డేంజర్ జోన్ లోకి వచ్చారు. ఈ ఇద్దరు ఎలిమినేషన్ చివరి వరకూ వచ్చినట్టు తెలుస్తోంది.

44
డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?
Image Credit : Star Maa

డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి అపూర్వ ఎలిమినేటో అయినట్టు వార్తలు వస్తున్నాయి. వీటితో పాటు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అదే నిజం అయితే.. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా షాలినీ కూడా హౌస్ నుంచి బయటకు వెళ్లవచ్చన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి.

ముఖ్యంగా రోహిత్ గేమ్‌ను కూడా షాలిని తన ప్రవర్తన ద్వారా దెబ్బతీసిందనే టాక్ గట్టిగా వినిపించింది. కంటెంట్ కోసం గేమ్‌ను పక్కనపెట్టి అతిగా ప్రవర్తిస్తే బిగ్‌బాస్ హౌస్‌లో ఎక్కువ రోజులు నిలబడలేరని ప్రేక్షకులు ఓటింగ్ ద్వారా స్పష్టం చేస్తున్నారు. .

ఈ వారం నామినేషన్లలో నిలిచిన వారిలో అత్యల్పంగా ఓట్లు సాధించడం , ప్రేక్షకుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అపూర్వ ఎలిమినేట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆట కంటే అతి ప్రవర్తనకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఈ ఎలిమినేషన్‌తో హౌస్‌లోని మిగతా కంటెస్టెంట్లకు గట్టి సంకేతం వెళ్లినట్లయింది. మరి ఇందులో నిజమెంత? ఏం జరగబోతుంది అనేది చూడాలి. మిగతా గేమ్స్ ఎలా మారుతాయి అనేది రాబోయే రోజుల్లో ఆసక్తికరంగా మారనుంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
OTT: కోమా నుంచి బయటపడడమే గొప్ప అయితే బోనస్ గా హీరోకి ఆ శక్తి..ఓటీటీలోకి మలయాళీ థ్రిల్లర్, ఎప్పటి నుంచి అంటే
Recommended image2
Sara Ali Khan Home: తండ్రి 5000 కోట్ల ఆస్తికి అధిపతి.. రూ.18 కోట్ల హౌస్ లో ఉంటున్న కూతురు
Recommended image3
Naga Chaitanya: నాగార్జున మొదటి భార్య ఇప్పుడేం చేస్తోంది? నాగ చైతన్య తల్లి లక్ష్మి రెండో పెళ్లి చేసుకున్నది ఎవరినో తెలుసా?
Related Stories
Recommended image1
Naga Chaitanya: నాగార్జున మొదటి భార్య ఇప్పుడేం చేస్తోంది? నాగ చైతన్య తల్లి లక్ష్మి రెండో పెళ్లి చేసుకున్నది ఎవరినో తెలుసా?
Recommended image2
Suma Kanakala: రాజీవ్ కనకాల రొమాంటిక్ సీన్స్ చేస్తే.. సుమ కనకాల రియాక్షన్ ఏంటి? క్లారిటీ ఇచ్చిన రాజీవ్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved