MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Trisha Krishnan: త్రిష సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? ఆ ఒక్క ఫోటోతో మొదలైన రచ్చ, నిజమెంత?

Trisha Krishnan: త్రిష సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? ఆ ఒక్క ఫోటోతో మొదలైన రచ్చ, నిజమెంత?

Trisha Krishnan: సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్‌తో కలిసి దిగిన ఓ సెల్ఫీని త్రిష సోషల్ మీడియాలో షేర్ చేసింది. అందులో తన మెడలోని లాకెట్‌ను దాచేయడంతో కొత్త అనుమానాలు మొదలయ్యాయి.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 10 2026, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మరోసారి వార్తల్లో నిలిచిన త్రిష..
Image Credit : Trisha Krishnan Instagram

మరోసారి వార్తల్లో నిలిచిన త్రిష..

సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ తన పర్సనల్ లైఫ్ విషయాలతో మరోసారి వార్తల్లో నిలిచింది. సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్‌తో కలిసి దిగిన ఓ సెల్ఫీని త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. అయితే, ఆ ఫోటోలో తన మెడలో ఉన్న లాకెట్‌ కనిపించకుండా ఓ హార్ట్ ఎమోజీతో కవర్ చేసింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే మొదలైంది. అసలు త్రిష ఆ లాకెట్‌ను ఎందుకు దాచింది? దీని వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా? అని నెటిజన్లు తెగ ఆరా తీస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విజయ్‌తో డేటింగ్ రూమర్స్ మధ్యలో మరో కొత్త చర్చ!
Image Credit : X

విజయ్‌తో డేటింగ్ రూమర్స్ మధ్యలో మరో కొత్త చర్చ!

కోలీవుడ్ స్టార్ బ్యూటీ త్రిష ఈమధ్య సినిమాల కంటే వ్యక్తిగత విషయాలతోనే ఎక్కువగా ట్రెండ్ అవుతోంది. ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి, స్టార్ హీరో విజయ్‌తో త్రిష పేరును ముడిపెడుతూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, వీరిద్దరి బంధం గురించి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు.

విజయ్ పర్సనల్ లైఫ్ గురించి, అలాగే ఆయనతో త్రిష సన్నిహితంగా ఉంటుందనే వార్తలు కోలీవుడ్‌లో ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారాయి. ఇలాంటి టైమ్‌లో త్రిష సోషల్ మీడియాలో పెట్టే ప్రతి పోస్ట్, ఫోటో మీద అభిమానులు, నెటిజన్లు స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు.

35
రాధికతో సెల్ఫీ.. లాకెట్ హైడ్!
Image Credit : Instagram

రాధికతో సెల్ఫీ.. లాకెట్ హైడ్!

తాజాగా త్రిష, సీనియర్ నటి రాధికా శరత్‌కుమార్‌తో కలిసి దిగిన ఓ సెల్ఫీని ఇన్‌స్టా స్టోరీలో పెట్టింది. ఈ ఫోటోలో త్రిష తన మెడలో వేసుకున్న చైన్ లాకెట్‌ను ఓ హార్ట్ ఎమోజీతో కవర్ చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది.

సెలబ్రిటీలు తమ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకోవడం కామనే. కానీ, ఈ ఫోటోలో లాకెట్ కనిపించకుండా ఎమోజీ పెట్టడమే ఇప్పుడు కొత్త అనుమానాలకు దారి తీసింది. ఆ లాకెట్‌లో ఏముంది? త్రిష కావాలనే దాన్ని దాచిందా? లేక వేరే కారణం ఏదైనా ఉందా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

45
త్రిష సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా?
Image Credit : Trisha Krishnan Instagram

త్రిష సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా?

లాకెట్‌ను ఎమోజీతో కవర్ చేయడాన్ని గమనించిన కొందరు, అది విజయ్‌కి సంబంధించినది అయి ఉంటుందని ఊహిస్తున్నారు. మరికొందరు మాత్రం, ఆ లాకెట్ కేరళ క్రిస్టియన్ సంప్రదాయంలో పెళ్లి సమయంలో వేసుకునే 'మిన్ను' (తాళిబొట్టు) లాగా ఉందని కామెంట్లు పెడుతున్నారు.

దీంతో త్రిష ఏమైనా సీక్రెట్‌గా పెళ్లి చేసుకుందా? అనే ప్రశ్న సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కానీ, ఈ ఊహాగానాలకు ఎలాంటి అధికారిక ఆధారాలు లేవు. కేవలం ఓ ఫోటోలో లాకెట్‌ను దాచేసినంత మాత్రాన త్రిషకు పెళ్లయిపోయిందని ఫిక్స్ అవ్వడం కరెక్ట్ కాదు.

55
ఈ విషయంపై త్రిష క్లారిటీ ఇస్తుందా?
Image Credit : Trisha Krishnan Instagram

ఈ విషయంపై త్రిష క్లారిటీ ఇస్తుందా?

ప్రస్తుతానికి త్రిష షేర్ చేసిన ఈ ఫోటో, ఆ లాకెట్ మ్యాటర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. త్రిష ఆ లాకెట్‌ను ఎందుకు దాచింది? దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటి? దీనిపై ఆమె ఏమైనా స్పందిస్తుందా? అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, త్రిష వైపు నుంచి ఏదైనా అధికారిక ప్రకటన వచ్చే వరకు ఈ వార్తలను కేవలం రూమర్స్‌గానే చూడాలి. ఈ లాకెట్ వ్యవహారం ముందు ముందు ఎలాంటి మలుపు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
త్రిష
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
నగ్మా నుంచి టబు వరకు.. 50 ఏళ్లు దాటినా పెళ్లి లేకుండా, సింగిల్‌గా ఉంటున్న టాప్ 6 హీరోయిన్లు
Recommended image2
Apoorva Eliminated: గొడవలు అరుపులు, ఓవర్ యాక్షన్ వల్ల.. బిగ్ బాస్ నుంచి అపూర్వ ఎలిమినేట్? నిజమెంత?
Recommended image3
OTT: కోమా నుంచి బయటపడడమే గొప్ప అయితే బోనస్ గా హీరోకి ఆ శక్తి..ఓటీటీలోకి మలయాళీ థ్రిల్లర్, ఎప్పటి నుంచి అంటే
Related Stories
Recommended image1
Suma Kanakala: రాజీవ్ కనకాల రొమాంటిక్ సీన్స్ చేస్తే.. సుమ కనకాల రియాక్షన్ ఏంటి? క్లారిటీ ఇచ్చిన రాజీవ్!
Recommended image2
Apoorva Eliminated: గొడవలు అరుపులు, ఓవర్ యాక్షన్ వల్ల.. బిగ్ బాస్ నుంచి అపూర్వ ఎలిమినేట్? నిజమెంత?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved