Sai Pallavi: ఆ హీరోతో ప్రేమ, తెలుగింటి కోడలు కానున్న సాయి పల్లవి... ఫిదా బ్యూటీ షాకింగ్ రియాక్షన్!
ఈ మధ్య సాయి పల్లవి పెళ్లి టాపిక్ తరచుగా వార్తలకెక్కుతుంది. తాజాగా ఆమె తెలుగు యంగ్ హీరో ప్రేమలో పడ్డారని, అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అసలు ఆ కహానీ ఏమిటో చూద్దాం..
Sai Pallavi
సాయి పల్లవి(Sai Pallavi) కి పరిశ్రమలో ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఆమె బిహేవియర్, క్యారెక్టర్ అందరూ ఇష్టపడేలా చేస్తుంది. ఆమె నిర్మాతల హీరోయిన్. డిమాండ్ ఉంది కదా అని కోట్లకు కోట్లు డిమాండ్ చేయదు. ఎన్ని కోట్లు ఇచ్చినా రోల్ నచ్చకపోతే చేయదు. సినిమా ఆడకపోతే డబ్బులు తిరిగి ఇచ్చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
వ్యాపార ప్రకటనలకు దూరంగా ఉంటారు. తాను నమ్మని విషయాన్ని ప్రచారం చేయను అంటారు.అలాగే ప్రాధాన్యత లేని పాత్రలు చేయరు.చాలా నిక్కచ్చిగా ఉంటారు. సాయి పల్లవి నటిస్తుందంటే ఆమె పాత్ర సినిమాలో చాలా బలంగా ఉంటుంది. ఫిదా, లవ్ స్టోరీ , శ్యామ్ సింగరాయ్ లాంటి సినిమాలు ఆమె కారణంగానే ఆడాయంటే అతిశయోక్తి కాదు.
Sai Pallavi
వరుస విజయాలతో దూసుకుపోతున్న సాయి పల్లవి ఈ మధ్య సడన్ గా సినిమాలు తగ్గించారు. కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేయడం ఆపేశారు. దీంతో ఆమె ప్రేమలో పడ్డారని, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారన్న వాదనలు తెరపైకి వచ్చాయి. తాజాగా మరో సరికొత్త వార్త హల్చల్ చేస్తుంది.
సాయి పల్లవి టాలీవుడ్ కి చెందిన యంగ్ హీరో ప్రేమలో పడ్డారట. అతన్నే వివాహం చేసుకోవాలని డిసైడ్ అయ్యారట. ఆ హీరోతో పీకల్లోతు ప్రేమలో ఉన్న సాయి పల్లవి పేరెంట్స్ వేరే సంబంధాలు చూస్తున్నా ఆసక్తి చూపడం లేదంట. అప్పుడే పెళ్ళొద్దు అంటున్నారట.
లాక్ డౌన్ సమయంలో సాయి పల్లవికి వివాహం చేయాలని తల్లిదండ్రులు గట్టి ప్రయత్నాలు చేశారట. సాయి పల్లవి మాత్రం ససేమిరా అన్నారట. ఇదంతా ఆ హీరో ప్రేమ కోసమేనట. ఆ హీరో సై అనాలే కాని పెళ్ళి చేసుకోవడానికి సాయి పల్లవి సిద్ధంగా ఉన్నారట. ప్రస్తుతం టాలీవుడ్ లో ఈ న్యూస్ హాట్ టాపిక్ గా ఉంది.
అయితే తాజాగా ఈ విషయంపై సాయి పల్లవి స్పందించారు. తెలుగు సినిమాల ద్వారా ఫేమ్ తెచ్చుకున్నారు. టాలీవుడ్ లో పెద్ద హీరోయిన్ గా ఎదిగారు. మరి పెళ్లి కూడా తెలుగు అబ్బాయినే చేసుకుంటారా? అని విలేకరి అడిగిన ప్రశ్నకు ఆమె సెటైరికల్ గా స్పందించారు. నేను పెళ్లి చేసుకునే తెలుగు అబ్బాయి ఇంకా పుట్టలేదేమో అంటూ సమాధానం చెప్పారు. ఆమె ఆన్సర్ స్పష్టంగా లేని క్రమంలో కన్ఫ్యూషన్ కొనసాగుతుంది .
మరోవైపు సాయి పల్లవి, రానా జంటగా నటించిన విరాటపర్వం(Virataparvam) జూన్ 17న విడుదల కానుంది. దర్శకుడు వేణు అడుగుల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ ప్రియమణి కీలక రోల్ చేస్తున్నారు.