- Home
- Entertainment
- చిరు మూవీలో హీరోయిన్ కి దారుణ అవమానం..దానికి కూడా గొడవ పడ్డ మోహన్ బాబు, అడవిలో షూటింగ్ జరుగుతుండగా..
చిరు మూవీలో హీరోయిన్ కి దారుణ అవమానం..దానికి కూడా గొడవ పడ్డ మోహన్ బాబు, అడవిలో షూటింగ్ జరుగుతుండగా..
చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కిరాయి రౌడీలు అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో మోహన్ బాబు కూడా ఉన్నారు.

టాలీవుడ్ లో హీరోల మధ్య విభేదాలు తరచుగా వినిపిస్తూ ఉంటాయి. చిరంజీవి, మోహన్ బాబు కుటుంబాల మధ్య విభేదాలు ఉన్నాయనేది ఇప్పటి మాట కాదు. పలు వేదికలపై ఇద్దరి మధ్య మనస్పర్థలు కనిపించాయి. గతంలో చిరంజీవి, మోహన్ బాబు అనేక చిత్రాల్లో కలసి నటించారు.
చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కిరాయి రౌడీలు అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో మోహన్ బాబు కూడా ఉన్నారు. రాధిక హీరోయిన్. ఒక ఫైట్ సన్నివేశాన్ని చిరంజీవి, మోహన్ బాబు మధ్య అడవిలో చిత్రీకరించారట. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత కానగల జయకుమార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఈ చిత్రానికి నిర్మాత క్రాంతి కుమార్. ఆయనకి అప్పటికే చిరంజీవి అంటే చాలా ఇష్టం.
ఆ ఫైట్ సీన్ లో రాధిక కూడా ఉంటుంది. రాధికకి మోహన్ బాబు రేప్ చేయడానికి ప్రయత్నించాలి. అలా చేస్తున్నప్పుడు రాధికకి దారుణ అవమానం జరిగింది. మోహన్ బాబు ఆమెని గట్టిగా పట్టుకుంటాడు. రాధిక తప్పించుకుని వెళ్ళిపోవాలి. మోహన్ బాబు గట్టిగా పట్టుకోవడంతో ఒక్కసారిగా ఆమె డ్రెస్ జారిపోయింది.
దీనితో ఆమె ప్రైవేట్ పార్ట్స్ రివీల్ అయ్యే పరిస్థితి కనిపించింది. నిర్మాత క్రాంతి కుమార్ అక్కడే ఉన్నారు. ఆయన వేగంగా స్పందించి కట్ అని చెప్పారు. ఒక్కసారిగా రాధిక కింద పడిపోయింది. ఆమె డ్రెస్ జారిపోవడంతో అంతా షాక్ అయ్యారు. ఎవరూ ఏమీ మాట్లాడకుండా తలా దిక్కూ వెళ్లిపోయారు.
చిరంజీవి గారు కూడా అక్కడే ఉన్నారు. కాసేపు సెట్ మొత్తం నిశ్శబ్దం ఆవహించింది. ఆ సంఘటనతో నిర్మాత క్రాంతికుమార్ బాగా సీరియస్ అయ్యారట. కనకాల జయకుమార్ మాట్లాడుతూ.. మోహన్ బాబు నా దగ్గరకి వచ్చి.. ఏంట్రా క్రాంతి కుమారు.. వాడి పెళ్ళాం లాగా ఫీల్ అయిపోతున్నాడు అని అన్నారు. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు.
సినిమా పూర్తయ్యాక మరో గొడవ జరిగింది. సినిమా టైటిల్స్ లో చిరంజీవి పేరు ముందు వేయాలా.. మోహన్ బాబు పేరు వేయాలా అనే చర్చ జరిగింది. క్రాంతి కుమార్ కేమో చిరంజీవి అంటే ఇష్టం. కానీ మోహన్ బాబు చిరంజీవి కన్నా సీనియర్. అప్పుడే మోహన్ బాబు ఫోన్ చేసి టైటిల్స్ వేశారా అని అడిగారు. ఇంకా లేదు అండీ అని చెప్పా. నేను చిరంజీవి కన్నా సీనియర్ .. కాబట్టి నా పేరు ముందు వేయాలి అని అన్నారు.
దీనిపై ఒక గంట చర్చించిన తర్వాత ఒక పరిష్కారం కనుగొన్నాం. ముందు మోహన్ బాబు పేరే వేసాం. చివర్లో చిరంజీవి పేరు వేస్తూ పెద్ద అక్షరాలతో 'అబౌవ్ ఆల్ అవర్ చిరంజీవి' అని వేసినట్లు జయకుమార్ తెలిపారు. అప్పటికి చిరంజీవికి సుప్రీం హీరో అని కానీ, మెగాస్టార్ అని కానీ బిరుదు రాలేదు.