- Home
- Entertainment
- నయనతార కొత్త కాపురం అంటే అంతే మరి.. ఏకంగా రూ.25 కోట్ల ఖర్చు, భర్తతో అక్కడికి షిఫ్ట్..
నయనతార కొత్త కాపురం అంటే అంతే మరి.. ఏకంగా రూ.25 కోట్ల ఖర్చు, భర్తతో అక్కడికి షిఫ్ట్..
నయనతార, విగ్నేష్ శివన్ జంట ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. మహాబలిపురంలో విగ్నేష్, నయనతార వివాహం వైభవంగా జరిగింది.

నయనతార, విగ్నేష్ శివన్ జంట ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. మహాబలిపురంలో విగ్నేష్, నయనతార వివాహం వైభవంగా జరిగింది. నయన్, విగ్నేష్ వివాహానికి సినీ ప్రముఖులు హాజరై ఆశీర్వదించారు. వివాహం తర్వాత నయన్, విగ్నేష్ శివన్ థాయిలాండ్ కి హనీమూన్ వెళ్లి తిరిగొచ్చారు.
ప్రస్తుతం నయనతార, విగ్నేష్ శివన్ తన చిత్రాలపై ఫోకస్ పెడుతున్నారు. అలాగే కొత్త కాపురానికి ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. చెన్నైలో సెలబ్రిటీలు ఉండే విలాసవంతమైన ప్రాంతం పోయెస్ గార్డెన్. ఈ ప్రాంతంలోనే రజనీకాంత్, జయలలిత లాంటి ప్రముఖుల నివాసాలు ఉన్నాయి. త్వరలోనే నయన్, విగ్నేష్ జంట పోయెస్ గార్డెన్ కి షిఫ్ట్ కానున్నట్లు తెలుస్తోంది.
నయనతార తన కొత్త కాపురం కోసం ఇక్కడే రెండు ఇల్లు కొనుగోలు చేసింది. గతంలోనే ఈ న్యూస్ వైరల్ ఐంది. అయితే ప్రస్తుతం ఈ బ్యూటీ ఆ రెండు ఇళ్లలో ఇంటీరియర్ డిజైన్ చేయించనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం బాలీవుడ్ సెలెబ్రిటీల ఇళ్లకు ఇంటీరియర్ డిజైన్ చేసే సంస్థతో 25 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు టాక్.
కేవలం ఇంటీరియర్ డిజైన్ కోసమే 25 కోట్లు అంటూ ప్రచారం జరుగుతుండడంతో అంతా ముక్కున వేలేసుకుంటున్నారు. వీలైనంత త్వరగా ఈ పనులు ముగించి.. కొత్త కాపురం స్టార్ట్ చేయాలని నయనతార, విగ్నేష్ భావిస్తున్నారు.
నయనతార కొనుగోలు చేసిన ఈ ఇళ్లలో అనేక విశేషాలు ఉన్నాయి. ఒక్కో ఇల్లు 8000 చదరపు అడుగుల స్థలంలో ఉందట. ఒక్కో ఇంటిలో 1500 చదరపు అడుగుల్లో స్విమ్మింగ్ పూల్ నిర్మాణం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే నయన్ విగ్నేష్ కి మాత్రమే ప్రత్యేకంగా లిఫ్ట్.. పనివాళ్ళకి ప్రత్యేకంగా మరో లిఫ్ట్ ఉండబోతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా వివాహం తర్వాత నయన్ సినిమాలు తగ్గించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నయనతార గ్లామర్ రోల్స్ కి దూరం కాబోతున్నట్లు నిర్మాతలకు చెప్పేసినట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేవలం సెలెక్టివ్ గా మాత్రమే సినిమాలు చేయబోతున్నట్లు టాక్.