MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు అదిరిపోయే షాక్.. అరెస్టు చేస్తానన్న ఎస్ఐ, వల్లి ఆనందం

Illu Illalu Pillalu Today Episode: ప్రేమకు అదిరిపోయే షాక్.. అరెస్టు చేస్తానన్న ఎస్ఐ, వల్లి ఆనందం

Illu Illalu Pillalu Today Episode: ఇల్లు ఇల్లాలు పిల్లలు నేటి ఎపిసోడ్లో ప్రేమకు అదిరిపోయే షాక్ తగులుతుంది. ఎస్ఐ ఫోన్ చేసి వెంటనే రావాలి అని లేకపోతే అరెస్టు చేస్తామని చెబుతాడు. ఇక ఈరోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకోండి.

2 Min read
Author : Haritha Chappa
Published : Jul 15 2026, 09:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
కోచింగ్ సెంటర్లో ప్రేమ
Image Credit : jio hotstar

కోచింగ్ సెంటర్లో ప్రేమ

ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్లో ప్రేమను ఎస్ఐ కోచింగ్ సెంటర్ కు తీసుకెళ్తాడు ధీరజ్. అక్కడ కాస్త ఎక్కువ ఫీజు కట్టాల్సి వస్తుంది. బాగా చదవమని చెబుతాడు ధీరజ్. అయితే ప్రేమ ఈ ఒక్కరోజు తనతో పాటు క్లాసులో ఉండమని అడుగుతుంది. దాంతో ప్రేమను క్లాసులో కూర్చోబెట్టి గది బయటే వెయిట్ చేస్తూ ఉంటాడు. మధ్యలో ప్రేమ నిద్రపోతుంది. ప్రేమకు కాఫీ, స్నాక్స్ ఇలా తీసుకొస్తూ క్లాసును డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. చివరికి ప్రేమ వెళ్ళిపోమని చెప్పడంతో క్లాస్ నుంచి బయటికి వెళ్లిపోతాడు

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
సాగర్ ముందు లంచం
Image Credit : jio hotstar

సాగర్ ముందు లంచం

సాగర్ వర్క్ చేసుకుంటూ ఉంటే ఒక రోడ్డు కాంట్రాక్టు కోసం కాంట్రాక్టర్ వస్తాడు. ఫైల్ మీద సంతకం చేస్తే బహుమతి ఇస్తానని చెప్పి డబ్బును లంచంగా పెడతాడు. అది చూసి సాగర్ భయపడిపోతాడు. ఈలోపు ఆఫీస్ బాయ్ వచ్చి ఇలాంటివన్నీ మామూలే.. సంతకం పెట్టేయేండని చెబుతాడు. ఆ సమయంలో సాగర్ కు రామరాజు చెప్పిన మాటలు గుర్తుకొస్తాయి. చచ్చిపోయినా పర్వాలేదు కానీ నిజాయితీగా ఉండాలని.. విలువలు తప్పకూడదని రామరాజు చెప్పిన మాటలను ఒకసారి గుర్తు చేసుకుంటాడు సాగర్. కానీ సంతకం మాత్రం పెట్టేసాడు.

ఇక ఇంట్లో రామరాజుకు వేదవతి సేవలు చేస్తూ ఉంటుంది. అడగకుండానే అన్ని ఇచ్చేస్తూ ఉంటుంది. ఈ లోపు నర్మద కూడా అక్కడికి వస్తుంది. ప్రేమ ఎస్సై కోచింగ్ కు ఒప్పుకున్నందుకు వేదవతి సంతోషంగా ఉన్నానని చెబుతుంది. దానికి రామరాజు మాట్లాడుతూ నీకోసమే ఒప్పుకున్నా.. నువ్వు పాతికేళ్లలో ఏదీ అడగలేదు అని అంటాడు. వెంటనే వేదవతి మరొక చిన్న ఇష్టం కూడా ఉందండి.. మా అమ్మ పుట్టినరోజు మన ఇంట్లోనే చేద్దామని అంటుంది. దానికి రామరాజు మీ వాళ్ళు అందుకు ఒప్పుకోరు... ఆశలు పెట్టుకోకు బాధపడాల్సి ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతాడు.

33
ప్రేమకు వార్నింగ్ ఇచ్చిన ఎస్ఐ
Image Credit : jio hotstar

ప్రేమకు వార్నింగ్ ఇచ్చిన ఎస్ఐ

ఇక ఇక్కడి నుంచి సీన్ ప్రేమ దగ్గరికి మారుతుంది. కోచింగ్ క్లాస్ పూర్తయిన తర్వాత ప్రేమ బయటకు వస్తుంది. అదే సమయానికి ఎస్సై పోలీస్ స్టేషన్ నుండి ప్రేమకు ఫోన్ చేస్తాడు. ‘మీరు ఎనిమిది నెలల క్రితం మోపిదేవికి వచ్చారు కదా.. ఇక్కడ లాడ్జిలో స్టే చేశారు కదా ఆ లార్జ్ దగ్గరికి రండి’ అని అంటాడు. అందుకు ప్రేమ ఏం జరిగిందని అడుగుతుంది. మీరు లాడ్జిలో స్టే చేసిన రోజే ఇక్కడ ఒక క్రైమ్ జరిగింది.. దానికి సంబంధించి ఎంక్వయిరీ చేస్తున్నాము అని అంటాడు. సహకరించకపోతే అరెస్టు చేస్తామని భయపడతాడు. దీంతో ప్రేమ భయపడి పోయి ధీరజ్ కు విషయం చెబుతుంది. ఇద్దరూ కలిసి నర్మదకు విషయం చెప్పి అక్కడ నుంచి మోపిదేవికి బయలుదేరుతారు. ఇక నర్మద వేదవతికి కూడా ప్రేమకు వచ్చిన ఫోన్ కాల్ గురించి చెబుతుంది. ఇక్కడితో ఎపిసోడ్ ముగిసిపోతుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode: విశ్వను కాపాడి కుటుంబానికి షాకిచ్చిన అమూల్య, పగబట్టిన పాములా వల్లి
Recommended image2
Illu Illalu Pillalu Today Episode: అమూల్య ప్రేమలో విశ్వ? ప్రేమ కాపురాన్ని కూల్చేందుకు వల్లి కుట్ర
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved