MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Rambha: నాన్నతో 6 నెలలు మాటల్లేవ్, నా కెరీర్ లో అదే స్పెషల్ మూవీ..తండ్రి గురించి రంభ చెప్పిన విషయాలు

Rambha: నాన్నతో 6 నెలలు మాటల్లేవ్, నా కెరీర్ లో అదే స్పెషల్ మూవీ..తండ్రి గురించి రంభ చెప్పిన విషయాలు

Actress Rambha: ఒక పాత ఇంటర్వ్యూలో నటి రంభ తన చిన్ననాటి పంతం, నాన్నతో ఆరు నెలలు మాట్లాడకపోవడం, తన అందం, సినిమా అనుభవాల గురించి భలే ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

3 Min read
Author : Tirumala Dornala
Published : Oct 26 2026, 06:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
నటి రంభ
Image Credit : others

నటి రంభ

సౌత్ ఇండియాలో ఒకప్పుడు తన అందం, నటనతో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు నటి రంభ. ఆమె తన పర్సనల్ లైఫ్‌కి సంబంధించిన చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. తన నవ్వు, ఎమోషనల్ నేచర్, చిన్ననాటి పంతం, సినిమా అనుభవాల గురించి ఆమె మాట్లాడిన ఒక పాత ఇంటర్వ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది. కోపం వస్తే తన నాన్నతో ఏకంగా ఆరు నెలల పాటు మాట్లాడలేదట రంభ. ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పారు.

రంభ అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆమె క్యూట్ స్మైల్. మీలో ఉన్న అత్యంత అందమైన లక్షణం ఏంటి అని అడిగితే.. 'నా నవ్వే నా అందం' అని ఆమె టక్కున సమాధానం ఇచ్చారు. తనకు ఎంత బాధ ఉన్నా దాన్ని దాచుకోవడం ఆమెకు చేతకాదట. బాధొస్తే కన్నీళ్లు వచ్చేస్తాయని, ఫీలింగ్స్‌ను ముఖంలో దాచుకోవడం తన వల్ల కాదని రంభ చెప్పారు. తాను నవ్వినా, ఏడ్చినా ఆ ఎమోషన్స్ కొద్ది నిమిషాల్లోనే ముగిసిపోతాయట. తనను చూసిన వాళ్లు.. ఈమె జీవితంలో ఎలాంటి బాధ, చింత లేని వ్యక్తి అని అనుకుంటారని ఆమె చెప్పుకొచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
నా తప్పు లేకపోతే వాళ్లనే ఏడిపించేదాన్ని!
Image Credit : X

నా తప్పు లేకపోతే వాళ్లనే ఏడిపించేదాన్ని!

జీవితం గురించి రంభకు ఒక డిఫరెంట్ యాంగిల్ ఉంది. 'లైఫ్ ఈజ్ షార్ట్' అనే మాటను తాను అస్సలు నమ్మనని ఆమె అన్నారు. దేవుడు మనకు సుదీర్ఘమైన జీవితాన్ని ఇచ్చాడు. కానీ, ఇతరుల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, జనాలు ఏమనుకుంటారో అని టెన్షన్ పడుతూ మన జీవితాన్ని మనమే చిన్నదిగా చేసుకుంటున్నామని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రాణం ఉన్నంత వరకు సంతోషంగా బతకాలి అన్నదే తన లైఫ్ ఫిలాసఫీ అని రంభ చెప్పారు. పక్కవాళ్ల అభిప్రాయాల కోసం మన సంతోషాన్ని దూరం చేసుకోకూడదన్న ఆమె మాటలు నిజంగా ఆలోచింపజేస్తాయి.

సినిమాల్లో పనిచేసేటప్పుడు తన నటనపై విమర్శలు వచ్చినా వాటిని చాలా పాజిటివ్‌గా తీసుకునేవారట రంభ. ఎవరైనా తన యాక్టింగ్ బాగోలేదని చెప్తే, దాని గురించి ఆలోచించి, ఇంటికి వెళ్లాక అమ్మానాన్న లేదా అక్కాచెల్లెళ్లతో పంచుకునేవారట. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఆమెను ఓదార్చి, ఎంకరేజ్ చేసేవారని గుర్తుచేసుకున్నారు. కానీ, ఇంట్లో వాళ్లే తనను తిడితే మాత్రం సీన్ వేరేలా ఉండేదట! తన తప్పు లేదని అనిపిస్తే, వాళ్లతో నెల రోజుల పాటు మాట్లాడకుండా ఉండేదాన్ని అని చెప్పారు. అంతేకాదు, వాళ్లనే ఏడిపించేదాన్ని అని రంభ నవ్వుతూ చెప్పుకొచ్చారు.

35
నాన్నతో ఆరు నెలలు మాటల్లేవ్!
Image Credit : Instagram/@rambhaindran_

నాన్నతో ఆరు నెలలు మాటల్లేవ్!

రంభ చిన్ననాటి పంతం గురించి వింటే ఇంకా ఆశ్చర్యం వేస్తుంది. తాను చిన్నప్పటి నుంచి చాలా మొండి పిల్లనని చెప్పుకున్న ఆమె.. కోపం వచ్చినప్పుడు తన నాన్నతో ఏకంగా ఆరు నెలల పాటు మాట్లాడకుండా ఉన్న సంఘటనను పంచుకున్నారు. కొన్ని విషయాల్లో పంతం పట్టడం తన స్వభావంలోనే ఉందన్నారు. రంభ చెప్పిన ఈ మాటలు ఆమె అభిమానులకు కచ్చితంగా ఆశ్చర్యం కలిగిస్తాయి. తెరపై ఎప్పుడూ నవ్వుతూ కనిపించే ఈ హీరోయిన్ వెనుక ఇంత మొండితనం ఉందా అనిపిస్తుంది.

రంభ వాళ్ల ఫ్యామిలీకి స్వీట్స్ బిజినెస్ ఉండేదట. అందుకే చిన్నప్పటి నుంచి ఆమెకు స్వీట్స్ తినే అలవాటు ఎక్కువ. బాగా భోజనం చేసే తనను ఇండస్ట్రీకి వచ్చాక డైట్ చేయమని చెప్పేవారని, కానీ తినాలనే కోరికను కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టంగా ఉండేదని ఆమె చెప్పారు. అంతేకాదు, ఇప్పటిలా 'జీరో సైజ్' మెయింటైన్ చేయడం కంటే సంతోషంగా ఉండటమే ముఖ్యమని రంభ అభిప్రాయపడ్డారు. 'హ్యాపీ ఫిగర్స్' ఉండాలని, బొద్దుగా ఉండటమే ఇండియన్ అమ్మాయిల స్పెషాలిటీ అని ఆమె తన మనసులోని మాట చెప్పారు.

45
ఇండస్ట్రీలో ఎవరి స్టైల్ వాళ్లదే!
Image Credit : Rambha Facebook

ఇండస్ట్రీలో ఎవరి స్టైల్ వాళ్లదే!

సినిమా రంగంలో హీరోయిన్ల మధ్య ఉండే కాంపిటీషన్ గురించి కూడా రంభ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. ప్రతి ఒక్కరిలో ఒక రకమైన టాలెంట్ ఉంటుంది. ఎవరినీ మరొకరితో పోల్చలేం. ప్రతి ఆర్టిస్టుకు వాళ్లకంటూ ఒక స్పెషాలిటీ, స్థానం ఉంటాయని చెప్పారు. తన టైమ్‌లో డైరెక్టర్లు ఆర్టిస్టులకు సెట్ అయ్యే పాత్రలను క్రియేట్ చేసేవారని, శ్రీదేవి లాంటి నటీమణులకు వాళ్ల టాలెంట్‌కు తగ్గట్టుగా స్పెషల్ క్యారెక్టర్స్ రాసేవారని రంభ గుర్తుచేసుకున్నారు.

55
నా సినీ జర్నీలో 'హిట్లర్' సినిమా చాలా స్పెషల్!
Image Credit : Asianet News

నా సినీ జర్నీలో 'హిట్లర్' సినిమా చాలా స్పెషల్!

తాను కరెక్ట్ టైమ్‌లో ఇండస్ట్రీకి వచ్చానని రంభ ఫీల్ అవుతున్నారు. 'హిట్లర్' సినిమాలో తనకు నార్మల్ గ్లామరస్ రోల్ దొరికినా, డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య లాంటి వాళ్లు తన నటనలో కొత్తదనం తెచ్చేలా ఎంకరేజ్ చేశారని ఆమె గుర్తుచేసుకున్నారు. కొన్ని సీన్లలో తనదైన స్టైల్‌లో డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చే ఛాన్స్ దొరికిందని చెప్పారు.

సరైన సమయంలో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి, ఇండియన్ సినిమా హిస్టరీలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడం తన అదృష్టమని రంభ గర్వంగా చెప్పారు. తన నవ్వు, చిన్ననాటి పంతం, నాన్నతో అలిగిన తీరు, స్వీట్స్ మీద ప్రేమ, సినిమా అనుభవాల గురించి రంభ పంచుకున్న విషయాలు అభిమానులలో ఆసక్తిని పెంచుతున్నాయి. తెరపై ఎప్పుడూ నవ్వుతూ కనిపించే హీరోయిన్ పర్సనాలిటీలోని మరో యాంగిల్‌ను ఈ పాత ఇంటర్వ్యూ పరిచయం చేసింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
AK47 Ticket Price: ఆదర్శ కుటుంబం టికెట్ ధరలు పెంచేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి.. పెంచిన ధరలు ఇవే
Recommended image2
Trivikram: ఎన్టీఆర్‌ విషయంలో తప్పు ఒప్పుకున్న త్రివిక్రమ్‌.. అరవింద సమేతలో బ్లండర్‌ ఇదే
Recommended image3
Suriya Scene Movie: ఇది నా చిరకాల కోరిక, కొత్తగా మొదలుపెట్టినట్లుంది.. సీన్ మూవీ ఈవెంట్ లో సూర్య
Related Stories
Recommended image1
Rashmika: 100 కాదు 1000 సార్లు చేస్తా, విజయ్ అంటే పిచ్చి.. నా ఫ్యామిలీ జోలికొస్తే సహించను, రష్మిక వార్నింగ్
Recommended image2
Mahesh Babu: మహేష్ బాబు ఫ్యూచర్ ని ముందే ఊహించిన కవి.. ఫ్లాప్ మూవీ పాట 100 శాతం నిజమైందిగా
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved