అమర్ దీప్ కోసం విలువైనది వదిలేసుకున్న శోభా శెట్టి..స్నేహం కోసం ఆమె చేసిన పనికి అంతా షాక్
శోభా శెట్టిలో కొంచెం మొండితనం, పొగరు ఉన్నాయి. కానీ ఆమె ఎలాంటి పరిస్థితుల్లో అయినా స్నేహం కోసం నిలబడే వ్యక్తి అని మరోసారి నిరూపించుకుంది.
Shobha shetty
కార్తీక దీపం మోనితగా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయిన శోభా శెట్టి.. బిగ్ బాస్ సీజన్ 7తో మరింత పాపులర్ అయింది. ఎదుట ఉన్నది ఎవరైనా, ఎలాంటి వివాదం జరిగినా తగ్గేదే లే అన్నట్లుగా శోభా శెట్టి బిగ్ బాస్ హౌస్ లో పెర్ఫామ్ చేసింది. అయితే శోభా శెట్టికి బిగ్ బాస్ ఎంత క్రేజ్ తీసుకువచ్చిందో అదే స్థాయిలో నెగిటివిటి కూడా మూటగట్టుకుంది.
చిన్న విషయాలకు కూడా గొడవ పడడం.. ఓటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకపోవడం, తానే సాధించాలి అనే పంతం శోభా శెట్టిపై ట్రోలింగ్ జరిగేలా చేశాయి. అయితే అందరికంటే ఎక్కువ నెగిటివిటీతో శోభా శెట్టి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చింది.
శోభా శెట్టి అంటే పొగరు, మొండితనం మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ శోభా శెట్టి స్నేహం కోసం ఎంత దూరమైనా వెళ్లే మనిషి. ఆ విషయం మరోసారి రుజువైంది. బిగ్ బాస్ హౌస్ లో శోభా శెట్టి, అమర్ దీప్, ప్రియాంక జైన్ ఒక జట్టుగా ఉన్నారు. హౌస్ లో గ్రూపులు కట్టి ఆడుతున్నారు అని విమర్శలు వచ్చినప్పటికీ ఒకరికి అండగా మరొకరు నిలబడ్డారు. అవసరమైన సమయాల్లో ఒకరికొకరు మద్దతు తెలుపుకున్నారు.
Shobha shetty
హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత కూడా వీరి ఫ్రెండ్ షిప్ కొనసాగుతోంది. అయితే తాజాగా శోభా శెట్టి అమర్ దీప్ కోసం చేసిన త్యాగం గురించి వింటే హ్యాట్సాఫ్ అనాల్సిందే. రీసెంట్ గా బుల్లితెరపై బిగ్ బాస్ ఉత్సవ్ షో జరిగింది. ఈ షోలో సీజన్ 7 సెలెబ్రిటీలంతా పాల్గొన్నారు.
ఈ షోలో శోభా శెట్టి తనకి ఎంతో విలువైన బహుమతిని అమర్ దీప్ కి ఇచ్చేసింది. అదేంటంటే బిగ్ బాస్ హౌస్ లో నాగార్జున ఇచ్చిన టీషర్ట్. నాగార్జున ధరించిన ఒక వెరైటీ టీషర్ట్ శోభా శెట్టికి బాగా నచ్చింది. మీ టీషర్ట్ కావాలని శోభా ప్రేమగా అడగడంతో నాగార్జున కాదనలేకపోయారు. షో ముగిసిన తర్వాత ఆమెకి టీషర్ట్ కానుకగా ఇచ్చాడు.
ఆ టీ షర్ట్ ధరించి శోభా శెట్టి ఫోటో షూట్స్ కూడా చేసింది. స్వయంగా నాగార్జున అంతటి వ్యక్తి తన కోసం గిఫ్ట్ ఇవ్వడంతో మురిసిపోయింది. లైఫ్ లో ఇది మరచిపోలేని విలువైన బహుమతి అని సంతోషంతో ఉప్పొంగింది. అయితే నాగార్జున నుంచి టీ షర్ట్ తీసుకోవాలని అమర్ దీప్ కూడా ప్రయాత్నించారు. కానీ కుదర్లేదు.
బిగ్ బాస్ ఉత్సవ్ లో శోభా శెట్టి అంత విలువైన బహుమతిని అమర్ దీప్ కి ఇచ్చేసింది. నాగార్జున ఇచ్చిన గిఫ్ట్ ని ఆమె వదిలేసుకోవడంతో అంతా షాక్ అయ్యారు. వాస్తవానికి అమర్ దీప్ కూడా తి షర్ట్ కోసం ప్రయత్నించాడు. కానీ కుదర్లేదు. అందుకే ఇప్పుడు అతడికి నాగార్జున గారు నాకు ఇచ్చిన టీషర్ట్ ఇచ్చేస్తున్నా అని త్యాగం చేసింది. స్నేహం కోసం శోభా శెట్టి చేసిన పనిని అంతా అభినందిస్తున్నారు. మంచైనా చెడైనా ఫ్రెండ్ కోసం నిలబడే నీ లాంటి వ్యక్తి ఉండాలి అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.