బిగ్ బాస్ లో నాకు కోట్లేమీ రాలేదు..సొంత ఇల్లు కొన్న శోభా శెట్టి, అంత డబ్బు ఎలా వచ్చిందంటే..
కార్తీక దీపం మోనితగా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయిన శోభా శెట్టి.. బిగ్ బాస్ సీజన్ 7తో మరింత పాపులర్ అయింది. ఎదుట ఉన్నది ఎవరైనా, ఎలాంటి వివాదం జరిగినా తగ్గేదే లే అన్నట్లుగా శోభా శెట్టి బిగ్ బాస్ హౌస్ లో పెర్ఫామ్ చేసింది.
కార్తీక దీపం మోనితగా తెలుగు ప్రేక్షకులకు గుర్తుండిపోయిన శోభా శెట్టి.. బిగ్ బాస్ సీజన్ 7తో మరింత పాపులర్ అయింది. ఎదుట ఉన్నది ఎవరైనా, ఎలాంటి వివాదం జరిగినా తగ్గేదే లే అన్నట్లుగా శోభా శెట్టి బిగ్ బాస్ హౌస్ లో పెర్ఫామ్ చేసింది. అయితే శోభా శెట్టికి బిగ్ బాస్ ఎంత క్రేజ్ తీసుకువచ్చిందో అదే స్థాయిలో నెగిటివిటి కూడా మూటగట్టుకుంది.
చిన్న విషయాలకు కూడా గొడవ పడడం.. ఓటమిని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకపోవడం, తానే సాధించాలి అనే పంతం శోభా శెట్టిపై ట్రోలింగ్ జరిగేలా చేశాయి. అయితే అందరికంటే ఎక్కువ నెగిటివిటీతో శోభా శెట్టి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకి వచ్చింది. అయితే తాజాగా శోభా శెట్టి తన సొంత ఇంటి కల నెరవేర్చుకుంది.
ఏడాదిన్నర క్రితమే ఆ ఇంటిని శోభా శెట్టి కొన్నప్పటికీ రీసెంట్ గా అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ రోజున ఇంటి తాళాలని శోభా పొందింది. దీనితో తన తల్లి, ప్రియుడు కాబోయే భర్త యశ్వంత్ తో కలసి కొత్త ఇంట్లోకి వెళ్ళింది. ఈ సందర్భంగా ఆ సంతోష క్షణాలని అభిమానులతో పంచుకుంది.
చాలా మంది అనుకుంటున్నట్లు బిగ్ బాస్ తో వచ్చిన డబ్బుతో తాను ఈ ఇంటిని కొనలేదని శోభా శెట్టి క్లారిటీ ఇచ్చింది. తనకి బిగ్ బాస్ ద్వారాల కోట్లేమీ రాలేదని పేర్కొంది. ఇల్లు కొన్నంత మాత్రాన నేను కరోడ్ పతిని అయిపోయినట్లు కాదు. దీని వెనుక చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి. రెండేళ్ల క్రితం నిర్మాణంలో ఉన్న ఓ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాం. కానీ వాళ్ళు మోసం చేశారు.
అలా చాలా మోసపోయాను. కానీ ఏడాదిన్నర తర్వాత ఈ ఇంటిని కొన్నాను. అయితే వరుసగా ఆర్థిక సమస్యలు ఎదురవుతుండడంతో జ్యోతిష్యురాలిని కలిశాను. వాళ్ళ సలహాలు పాటించిన తర్వాత ఏదో అద్భుతం జరిగినట్లు ఈ ఇల్లు నా సొంతం అయింది. బిగ్ బాస్ లోకి వెళ్లక ముందే ఎన్నో కష్టాలు పడి డబ్బు పోగేసి ఈ ఇల్లు కొన్నట్లు శోభా శెట్టి తెలిపింది. ఇంకా ఇంటీరియర్ డిజైన్ పూర్తి కాలేదు. దానికి మరో మూడు నెలల సమయం పడుతుంది. ఇంటీరియర్ డిజైన్ పూర్తయ్యాక పూర్తి స్థాయిలో ఈ ఇంట్లోకి వస్తాము అని శోభాశెట్టి తెలిపింది.
తనపై ఉన్న నెగిటివిటి గురించి కూడా శోభా శెట్టి స్పందించింది. బిగ్ బాస్ లో కేవలం ఒకటి రెండు ఎపిసోడ్ లు చూసి నన్ను జడ్జ్ చేసేశారు. లోపల ఉన్న కండిషన్స్ కి కొందరు అలాగే స్పందిస్తారు. ఆ క్షణంలో రియాక్ట్ అయిన దానిని బట్టి మనిషి క్యారెక్టర్ డిసైడ్ చేయొద్దు అని శోభా శెట్టి కోరింది. ఇటీవల శోభా శెట్టి తనకు కాబోయే భర్త యశ్వంత్ తో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే.