- Home
- Entertainment
- Karthika Deepam: స్వప్న ఇంట్లో శోభ.. హిమ ఇంట్లో నిరుపమ్.. ఆలోచనలో పడ్డ జ్వాల, ప్రేమ్?
Karthika Deepam: స్వప్న ఇంట్లో శోభ.. హిమ ఇంట్లో నిరుపమ్.. ఆలోచనలో పడ్డ జ్వాల, ప్రేమ్?
Karthika Deepam: బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం (Karthika Deepam) సీరియల్ కుటుంబ కథా నేపథ్యం లో కొనసాగుతూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ రోజు జులై 26వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఈరోజు ఎపిసోడ్ లో నిరుపమ్(Nirupam), హిమకు పెళ్లి విషయంలో పూర్తిగా క్లారిటీ ఇచ్చిన మాత్రం మళ్లీ నిరుపమ్ ను కన్విన్స్ చేయడానికి ప్రయత్నించగా అప్పుడు సౌందర్య, హిమపై సీరియస్ అవుతుంది. అప్పుడు ఆనంద్ రావు(anand rao)కూడా అవునమ్మా నీ జీవితంలో దేవుడు నీకు కావాల్సింది ఇచ్చినప్పుడు ఎందుకు చేజేతులా వదిలేసుకుంటున్నావు అంటున్న చెప్పడానికి ప్రయత్నిస్తాడు.
అప్పుడు నిరుపమ్ నీకు ఒక మంచి ఆఫర్ ఇస్తాను హిమ(hima) అని చెప్పి ఇప్పటికిప్పుడు సౌర్యతో పెళ్లికి ఒప్పించు ఇప్పటికిప్పుడే తాళి కట్టేస్తాను అని అంటాడు నిరుపమ్. నాకు నిరుపమ్ బావ అంటే ఇష్టం నిరుపమ్ బావ ను పెళ్లి చేసుకుంటాను అని సౌర్యతో అనిపించు ఇదే నీకు లాస్ట్ అవకాశం అని అంటాడు. హిమ మాట్లాడకుండా మౌనంగా ఉండడంతో కోప్పడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరొకవైపు ప్రేమ్(pream),హిమ కోసం ఎదురుచూస్తూ ఉండగా ఇంతలోనే అక్కడికి హిమ వస్తుంది.
అప్పుడు హిమ(hima) టెన్షన్ పడుతుండగా ఏమైంది చెప్పు అనడంతో హిమ జరిగింది మొత్తం వివరిస్తుంది. అప్పుడు ప్రేమ్, ఐస్ క్రీమ్ తిందాం రా అని అనగా నాకు ఐస్ క్రీమ్ తినే మూడు లేదు బావ అని అంటుంది. అప్పుడు నేను ఏం చేసినా నీకు ఇష్టమేనా అంటే ఓకే అని అంటుంది హిమ. ఆ తర్వాత నిరుపమ్(Nirupam) కోసం స్వప్న వెతుకుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి శోభ లగేజ్ తీసుకొని వచ్చేస్తుంది. ఆ తర్వాత శోభ నన్నే ఎందుకు కోడలుగా చేసుకోవాలి అనుకుంటున్నారు ఆంటీ అని అడగగా అప్పుడు స్వప్న మొత్తం వివరిస్తుంది.
తర్వాత వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలోనే అక్కడికి నిరుపమ్(Nirupam)వస్తాడు. ఆ తరువాత సౌర్య జరిగిన మొత్తం తలచుకుని బాధపడుతూ ఉండగా ఇంతలోనే అక్కడికి హిమ రావడంతో అప్పుడు సౌర్య(sourya)ఎందుకు చిన్నప్పటి నుంచి నేను అంతే నీకు అంత కోపం. నువ్వేమో దర్జాగా పెరిగావు నేను అమ్మ వాళ్ళ దగ్గర ఎన్నో కష్టాలను అనుభవించాను తీరా కలిసి పోయాము అనుకునేసరికి అమ్మ నాన్న లను దూరం చేశావు అంటూ ఎమోషనల్ గా మాట్లాడుతుంది సౌర్య.
అప్పుడు హిమ(hima)ఎంత నచ్చిచెప్పడానికి ప్రయత్నించిన సౌర్య మాత్రం వినిపించుకోదు. అప్పుడు సౌర్య,హిమ ను తిడుతూ మరింత అపార్థం చేసుకుంటుంది. నీ మీద నాకు ద్వేషం ఎందుకు ఉంటుంది అని హిమ అనగా శౌర్య మాత్రం ఆపవే నీ డ్రామాలు అని హిమ పై కోప్పడుతుంది. ఆ తర్వాత సౌందర్య, సౌర్య ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడు సౌందర్య(soundarya)నీకు ఏం కావాలో చెప్పు అని అనగా వెంటనే సౌర్య ఇంట్లో జరుగుతున్న నాటకాలను ఎలా అయినా ఆపేయ్ ఉంటుంది.
అప్పుడు సౌర్య(sourya)కీ సౌందర్య నాతో చెప్పే ప్రయత్నం చేయగా శౌర్య మాత్రం హితబోధ చేయొద్దు అవుతుందా లేదా అని అడుగుతుంది. ఇంతలోనే అక్కడికి నిరుపమ్, లగేజ్ తీసుకొని ఎంట్రీ ఇస్తాడు. అప్పుడు సౌర్య,సౌందర్య ఇద్దరు షాక్ అవుతారు. అప్పుడు నిరుపమ్ అమ్మమ్మ కొద్దిరోజులు నేను ఇక్కడే ఉంటాను అని అనగా వెంటనే సౌర్య చెప్పాను కదా నానమ్మ నాటకాలు జరుగుతున్నాయని అందులో ఇది కూడా ఒకటి అని అంటుంది. అప్పుడు స్వప్న(swapna), శోభల ప్లాన్ గురించి మొత్తం జరిగిందంతా వివరిస్తాడు నిరుపమ్.
అప్పుడు నిరుపమ్(Nirupam)మాత్రం తెగ హడావిడి చేస్తూ ఉండగా ఇంతలోనే అక్కడి నుంచి సౌర్య వెళ్ళిపోతుంది. ఆ తరువాత ప్రేమ్,హిమ అన్న మాటలు తలుచుకొని మురిసిపోతూ ఉంటాడు. ఇంతలోనే హిమ, ప్రేమ్(pream) కీ ఫోన్ చేసి నిరుపమ్ వాళ్ళ ఇంటికి వచ్చిన విషయం చెప్పడంతో ప్రేమ్ షాక్ అవుతాడు. అప్పుడు వారికి కాసేపు నిరుపమ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు హిమ,నిరుపమ్ అన్న మాటలు తలుచుకొని టెన్షన్ పడుతూ ఉంటుంది.