- Home
- Entertainment
- పై బటన్ విప్పేసి విరహ వేదనతో పిచ్చెక్కిస్తున్న శివాత్మిక రాజశేఖర్.. ఓరగా చూస్తూ టెంప్టింగ్ పోజులు అదరహో
పై బటన్ విప్పేసి విరహ వేదనతో పిచ్చెక్కిస్తున్న శివాత్మిక రాజశేఖర్.. ఓరగా చూస్తూ టెంప్టింగ్ పోజులు అదరహో
శివాత్మిక రాజశేఖర్ డస్కీ అందాలతో నెటిజన్లని అలరిస్తున్న విషయం తెలిసిందే. రోజు రోజుకి మరింత హాట్‌గా రెడీ అవుతూ కుర్రాళ్లని మంత్రముగ్దుల్ని చేస్తుంది. ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.

స్టార్ కిడ్, రాజశేఖర్ ముద్దుల తనయ శివాత్మిక రాజశేఖర్(Shivathmika Rajashekar) తరచూ తన గ్లామర్ ఫోటో షూట్ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ నెటిజన్లని ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ మరింత హాట్ ఫోటోలను షేర్ చేసింది. విరహంతో కూడిన పోజులిస్తూ మత్తెక్కిస్తుంది.
ఇందులో తన టాప్ పై బటన్స్ విప్పేసి హంట్ చేస్తుంది. అభిమానులకు అందాలను ఎరగా వేస్తుంది. వాల్‌ని వరిగి, ఓరగా చూస్తూ విరహంతో కూడిన పోజులతో ఇంటర్నెట్‌లో మంటలు పుట్టిస్తుంది. కుర్రాళ్ల బాడీలో టెంపరేచర్ పెంచేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ ఆకట్టుకుంటున్నాయి.
నేచురల్ అందాలకు కేరాఫ్ శివాత్మిక. సహజమైన అందాలను ఆవిష్కరిస్తూ నెటిజన్లకి మరింత దగ్గరయ్యింది. మేకప్ లేకుండా చాలా సందర్భాల్లో తన సహజమైన అందాలను ఆవిష్కరించింది. ఈ క్రమంలో ఆమెకి అభిమానులు పెరిగిపోయారు. ఇంత డేర్‌గా తన అసలు అందాలు చూపించడంతోనే ఆమెకి డేర్‌నెస్‌కి ఫిదా అయ్యారు. అందుకే ఈబ్యూటీకి సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంటుంది.
మరోవైపు నటిగానూ ఒక్కో మెట్టు ఎక్కుతుంది శివాత్మిక. తొలి సినిమా విడుదలైన మూడేళ్లకి మరో సినిమాతో మెరిసింది. `దొరసాని`తో ఆమె తెలుగులోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇటీవల ఆమె `పంచతంత్రం` సినిమాతో ఆకట్టుకుంది. గత శుక్రవారం విడుదలైన `పంచతంత్రం` సినిమా పాజిటివ్ టాక్‌ని తెచ్చుకుంది.
ఐదు కథల సమాహారంగా, మంచి ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కి విశేష ఆదరణ పొందింది. ఆడియెన్స్ మనసు దోచుకుంది. క్రిటిక్స్ ప్రశంసలందుకుంది. అయితే కమర్షియల్‌గా పెద్దగా సత్తాచాటలేకపోయింది. ఓటీటీలో దీనికి మంచి లైఫ్ ఉంటుందని చెప్పొచ్చు. ఇక ఇందులో లేఖ పాత్రలో అలరించింది శివాత్మిక. మెచ్యూర్డ్ అమ్మాయిగా, పెళ్లి చేసుకునేందుకు కావాల్సిన అర్హతలున్న అమ్మాయిగా, జీవితంపై మంచి అవగాహణ ఉన్న అమ్మాయిగా కనిపించింది. మెచ్యూర్డ్ గా నటించి స్పెషల్ గా నిలిచింది. హుందాతనంతో కూడిన ఆమె నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.
మరోవైపు ఇప్పుడు మరో సినిమాతో రాబోతుంది శివాత్మిక. `రంగమార్తాండ` చిత్రంతో ఆడియెన్స్ ని అలరించేందుకు వస్తుంది. కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. ఇందులో శివాత్మిక పాత్ర చాలా కీలకంగా ఉంటుందని తెలుస్తుంది.
అలాగే ఇటీవల `ఆకాశం` అనే తమిళ సినిమాలో మెరిసింది. ఇందులో బోల్డ్ రోల్ లో మెరిసింది. హీరోయిన్‌గానే కాదు, బలమైన పాత్రలకు ప్రయారిటీ ఇస్తుంది. ఇమేజ్‌కి పోకుండా నటిగా గుర్తింపు కోసం ప్రయత్నిస్తుంది. మంచి నటిగా పేరు తెచ్చుకునేందుకు తపిస్తుంది. అందుకే పాత్ర నిడివితో సంబంధం లేకుండా బలమైన పాత్రలను ఎంచుకుంటుంది శివాత్మిక.